T20 World Cup 2021 : వరల్డ్ కప్‌లో శ్రీలంక బోణీ.. బంగ్లాపై ఘన విజయం

టీ20 వరల్డ్‌కప్‌ సూపర్-12లో శ్రీలంక శుభారంభం చేసింది. బంగ్లాదేశ్ పై 5 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. బంగ్లాదేశ్ భారీ స్కోర్ చేసినా ప్రయోజనం లేకపోయింది. మరో 7 బంతులు

10TV Telugu News

T20 World Cup 2021 : టీ20 వరల్డ్‌కప్‌ సూపర్-12లో శ్రీలంక శుభారంభం చేసింది. బంగ్లాదేశ్ పై 5 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. బంగ్లాదేశ్ భారీ స్కోర్ చేసినా ప్రయోజనం లేకపోయింది. మరో 7 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి బంగ్లా నిర్దేశించిన 172 పరుగుల టార్గెట్ ను లంక చేజ్ చేసింది.

లంక బ్యాటర్లలో చరిత్ అసలంక హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 49 బంతుల్లో 80 పరుగులు చేసి (నాటౌట్) జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. మరో బ్యాట్స్ మెన్ భానుక రాజపక్స హాఫ్ సెంచరీతో (31 బంతుల్లో 54 పరుగులు) రాణించాడు. బంగ్లా బౌలర్లలో అహ్మద్, షకీబ్ తలో రెండు వికెట్లు తీశారు. మహమ్మద్ సైఫుద్దీన్ ఒక వికెట్ తీశాడు.

Amazon లో రూ.70వేల ఖరీదైన ఫోన్ ఆర్డర్‌ చేస్తే అంట్లు తోమే సోప్ పంపారు

టీ20 వరల్డ్‌కప్‌ సూపర్-12లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే బంగ్లాదేశ్ బ్యాటర్లు అదరగొట్టేశారు. షార్జా వేదికగా శ్రీలంకతో మ్యాచ్‌లో ఓపెనర్ మహ్మద్ నయీమ్ (62: 52 బంతుల్లో 6×4), మిడిలార్డర్ లో సీనియర్ ఆటగాడు ముష్ఫికర్ రహీం (57 నాటౌట్: 37 బంతుల్లో 5×4, 2×6) హాఫ్ సెంచరీలు బాదడంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 4 వికెట్ల నష్టానికి 171 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది. శ్రీలంక బౌలర్లలో చమిక కరుణరత్నె, ఫెర్నాండో, లాహిరు కుమార తలో వికెట్ మాత్రమే తీయగలిగారు.

Porn : షాకింగ్.. పోర్న్ వీడియోలకు అలవాటుపడ్డ 11ఏళ్ల బాలురు.. దానికి ఒప్పుకోలేదని బాలిక హత్య

టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ శనక మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో లిట్టన్ దాస్ (16: 16 బంతుల్లో 2×4)తో కలిసి బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన నయీమ్ తొలి వికెట్‌కి 5.5 ఓవర్లలో 40 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే.. దూకుడు పెంచే క్రమంలో లిట్టన్ దాస్ ఔటవగా.. అనంతరం వచ్చిన షకీబ్ అల్ హసన్ (10: 7 బంతుల్లో 2×4) నిరాశపరిచాడు. కానీ.. మిడిల్ ఓవర్లలో నిలకడగా ఆడిన ముష్ఫికర్ రహీమ్.. స్లాగ్ ఓవర్లలో వరుస బౌండరీలతో చెలరేగిపోయాడు. ఆఖర్లో కెప్టెన్ మహ్మదుల్లా (10 నాటౌట్: 5 బంతుల్లో 2×4) కూడా విలువైన పరుగులు చేశాడు.

స్కోర్లు..
బంగ్లాదేశ్- 171/4
శ్రీలంక-172/5(18.5 ఓవర్లు)