T20 World Cup 2021 : ఉత్కంఠ పోరులో శ్రీలంకపై సౌతాఫ్రికా విజయం

టీ20 వరల్డ్ కప్ సూపర్ 12 లో భాగంగా సౌతాఫ్రికా, శ్రీలంక జట్లు తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా గెలిచింది.

T20 World Cup 2021 : ఉత్కంఠ పోరులో శ్రీలంకపై సౌతాఫ్రికా విజయం

T20 World Cup 2021

T20 World Cup 2021 : టీ20 వరల్డ్ కప్ సూపర్ 12 లో భాగంగా సౌతాఫ్రికా, శ్రీలంక జట్లు తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా గెలిచింది. శ్రీలంక నిర్దేశించిన టార్గెట్ ను 19.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. ఒకానొక సమయంలో లంక గెలిచేలా కనిపించింది. కానీ, సౌతాఫ్రికా మళ్లీ పుంజుకుంది. సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా 46 పరుగులతో రాణించాడు. డేవిడ్ మిల్లర్ 23 పరుగులు, కగిసో రబాడా 13 పరుగులు చేశారు. లంక బౌలర్లలో హసరంగ మూడు వికెట్లు తీశాడు. చమీర 2 వికెట్లు తీశాడు.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ పతుమ్ నిస్సాంక హాఫ్ సెంచరీతో (58 బంతుల్లో 72 పరుగులు) రాణించాడు. అతడి స్కోరులో 6 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. అసలంక 21 పరుగులు చేశాడు. వీరిద్దరు తప్ప లంక జట్టులో మరెవ్వరూ రాణించలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలో స్పిన్నర్ తబ్రైజ్ షంసీ 3, ప్రిటోరియస్ 3, అన్రిచ్ నోర్జే 2 వికెట్లు తీశారు. ఏమంత కష్టసాధ్యం కాని లక్ష్యఛేదనకు దిగిన సఫారీలు 26 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డారు.

ఈ మ్యాచ్ లో శ్రీలంక మోస్తరు పరుగులకే పరిమితమైంది. దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 142 పరుగులు చేసి ఆలౌటైంది. దక్షిణాఫ్రికా ముందు 143 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

Disease Attack : యువతపై జబ్బుల దాడి… చిన్న వయస్సులోనే మరణం అంచులకు..

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నెమ్మదిగా ఆటను ఆరంభించింది. నాలుగో ఓవర్లోనే ఓపెనర్‌ కుశాల్‌ పెరీరా (7) ఔటయ్యాడు. అన్రిచ్‌ నోర్జే బౌలింగ్‌లో అతడు బౌల్డయ్యాడు. దీంతో పవర్‌ ప్లే పూర్తయ్యే సరికి 39/1 స్కోరుతో నిలిచింది. ఆ తర్వాత బ్యాటింగ్‌ వచ్చిన చరిత్‌ అసలంక (21), మరో ఓపెనర్‌ పీతమ్‌ నిశాంకతో కలిసి ధాటిగా ఆడాడు. ఈ క్రమంలోనే కేశవ్‌ మహరాజ్‌ వేసిన 9వ ఓవర్లో పరుగు తీసేందుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన భానుక రాజపక్సే (0), అవిష్క ఫెర్నాండో (3), వానిందు హసరంగ (4) వరుసగా విఫలమయ్యారు.

ఓ వైపు వికెట్లు పడుతున్నా.. ఓపెనర్‌ నిశాంక నిలకడగా ఆడుతూ 15వ ఓవర్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత వేగం పెంచాడు. 18వ ఓవర్లో రెండు ఫోర్లు, ఓ సిక్స్ బాదాడు. 19వ ఓవర్లో నిశాంక ఔటయ్యాడు. చివరి రెండు ఓవర్లలోనే శ్రీలంక మొత్తం నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆఖర్లో వచ్చిన దసున్ శనక (11), చమిక కరుణరత్నే (5), దుష్మంత చమీర (3) వరుసగా పెవిలియన్‌ చేరారు. మహేశ్‌ తీక్షణ (7) నాటౌట్‌గా నిలిచాడు. నిశాంక రాణించినా అతడికి సహకరించే బ్యాటర్‌ లేకపోవడంతో శ్రీలంక పెద్దగా స్కోరు చేయలేకపోయింది.

స్కోర్లు..
శ్రీలంక- 142 ఆలౌట్
సౌతాఫ్రికా – 146/6(19.5ఓవర్లలో)