INDvsSA: సౌతాఫ్రికాతో వన్డే సిరీస్.. టీమిండియా ప్లేయర్లు వీళ్లే

టీమిండియా.. సౌతాఫ్రికాల మధ్య టెస్టు సిరీస్ ముగిసింది. ఇకపై ఫోకస్ అంతా వన్డే సిరీస్ వైపే. బుధవారం నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభంకానున్న సిరీస్

INDvsSA: సౌతాఫ్రికాతో వన్డే సిరీస్.. టీమిండియా ప్లేయర్లు వీళ్లే

Ind Vs Sa

INDvsSA: టీమిండియా.. సౌతాఫ్రికాల మధ్య టెస్టు సిరీస్ ముగిసింది. ఇకపై ఫోకస్ అంతా వన్డే సిరీస్ వైపే. బుధవారం నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది. కేప్‌టౌన్‌లో శుక్రవారం ముగిసిన ఆఖరి టెస్టులో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అలా చేజారిన టెస్టు సక్సెస్.. వన్డే సిరీస్‌లోనైనా దక్కుతుందానని భారత క్రీడాకారులు, క్రీడాభిమానులు ఎదురుచూస్తున్నారు.

మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభంకానున్న సిరీస్.. జనవరి 19న పార్ల్ వేదికగా ఆరంభం కానుంది. రెండో వన్డే కూడా అదే వేదికగా జనవరి 21న జరగనుంది. జనవరి 23న మూడో వన్డేకి మాత్రం కేప్‌టౌన్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే 19 మందితో కూడిన జట్టుని భారత సెలక్టర్లు ప్రకటించారు.

తొలుత 18 మందితో కూడిన జట్టును ఎంపిక చేసిన భారత సెలక్టర్లు.. వాషింగ్టన్ సుందర్ కు కరోనా రావడంతో అతని స్థానంలో జయంత్ యాదవ్‌తో పాటు నవదీప్ సైనీకి జట్టులో అవకాశం కల్పించారు.

ఇది కూడా చదవండి: మాదే తప్పు.. అవకాశాలు వాడుకోలేకపోయాం – కోహ్లీ

భారత వన్డే జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), చాహల్, ఆర్. అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, ప్రసీద్ క్రిష్ణ, శార్ధూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, జయంత్ యాదవ్, నవదీప్ సైనీ

దక్షిణాఫ్రికా వన్డే జట్టు: తెంబ బవుమా (కెప్టెన్), ఆడెన్ మర్‌క్రమ్, డేవిడ్ మిల్లర్, దుస్సేన్, హమ్జా, జెన్నీమన్ మలాన్, మార్కో జాన్‌సెన్, పార్నెల్, పెహ్లువాయో, ప్రిటోరియస్, డికాక్ (వికెట్ కీపర్), వీరెనె, కేశవ్ మహరాజ్, సిసండ మగాల, లుంగి ఎంగిడి, కగిసో రబాడ, షంషీ