Women’s T20 World Cup 2023: ఈ నెల 10 నుంచి ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ప్రారంభం.. భారత్ షెడ్యూల్ ఇదే

దక్షిణాఫ్రికాలో ఈ టోర్నీ మొదలవుతుంది. ఇండియా మ్యాచ్‌లు ఈ నెల 12 నుంచి ప్రారంభమవుతాయి. తొలి మ్యాచ్ దాయాది పాకిస్తాన్‌తో ఉండటం విశేషం. ఇటీవల ఐసీసీ తొలిసారిగా నిర్వహించిన అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఇండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.

Women’s T20 World Cup 2023: ఈ నెల 10 నుంచి ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ప్రారంభం.. భారత్ షెడ్యూల్ ఇదే

Women’s T20 World Cup 2023: మహిళల క్రికెట్‌కు సంబంధించి మరో కీలక అంతర్జాతీయ టోర్నీ మొదలుకానుంది. ఈ నెల 10 నుంచి ‘ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్-2023’ ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికాలో ఈ టోర్నీ మొదలవుతుంది.

Nagaland Polls: నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీపీపీతో కలిసి పోటీ చేయనున్న బీజేపీ.. ఎవరికి ఎన్ని సీట్లంటే

ఇండియా మ్యాచ్‌లు ఈ నెల 12 నుంచి ప్రారంభమవుతాయి. తొలి మ్యాచ్ దాయాది పాకిస్తాన్‌తో ఉండటం విశేషం. ఇటీవల ఐసీసీ తొలిసారిగా నిర్వహించిన అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఇండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ విజయాన్ని మరచిపోక ముందే భారత మహిళల జట్టు మరో టీ20 ప్రపంచ కప్‌కు సిద్ధమవుతుండటం విశేషం. అయితే, ఇది సీనియర్ల కప్. ఈ టోర్నీని రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో నిర్వహిస్తోంది ఐసీసీ. మొత్తం 10 జట్లు ఇందులో పాల్గొంటుండగా, వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు, గ్రూప్-బిలో ఇంగ్లండ్, భారత్, పాకిస్తాన్, వెస్టిండీస్, ఐర్లాండ్ జట్లు ఉన్నాయి.

NSA Ajit Doval: అమెరికా సెక్రటరీతో అజిత్ ధోవల్ భేటీ.. రక్షణ రంగ సహకారంపై చర్చ

ప్రతి గ్రూపులో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్ చేరుతాయి. సెమీస్‌లో విజయం సాధించిన జట్లు ఫైనల్‌లో పోటీ పడుతాయి. ఫిబ్రవరి 26న న్యూలాండ్స్‌లోని కేప్‌‌టౌన్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. టీమిండియా ఫిబ్రవరి 12న పాకిస్తాన్‌తో, ఫిబ్రవరి 15న వెస్టిండీస్‌తో, ఫిబ్రవరి 18న ఇంగ్లాండ్‌తో, ఫిబ్రవరి 20న ఐర్లాండ్‌తో తలపడుతుంది. ఈ గ్రూప్‌లో టీమిండియా టాప్-2లో నిలిస్తే సెమీస్ చేరుతుంది. ఈ టోర్నీకి హర్మన్ ప్రీత్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది.

భారత జట్టు ఇది. హర్మన్‌ ప్రీత్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, యాస్తిక భాటియా, రిచా ఘోష్‌, జెమీమా రోడ్రిగ్స్‌, హర్లీన్‌ డియోల్‌, దీప్తి శర్మ, దేవికా వైద్య, రాధ యాదవ్‌, రేణుక ఠాకూర్‌, అంజలి శర్వాణి, పూజ వస్త్రాకర్‌, రాజేశ్వరి గైక్వాడ్‌, శిఖా పాండే. ఈ టోర్నీకి సంబంధించి సెమీ ఫైనల్ మ్యాచ్‌కు రెండు రిజర్వ్ డేలను ఐసీసీ నిర్ణయించింది. అవి ఫిబ్రవరి 24, 25 కాగా, ఫైనల్ కోసం ఫిబ్రవరి 27న రిజర్వ్ డేగా నిర్ణయించింది. తొలి మహిళా ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2009లో జరిగింది. ఇది 8వ ప్రపంచ కప్.