Nagaland Polls: నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీపీపీతో కలిసి పోటీ చేయనున్న బీజేపీ.. ఎవరికి ఎన్ని సీట్లంటే

నాగాలాండ్ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలున్నాయి. ఇక్కడ బీజేపీ-ఎన్డీపీపీ కూటమి కలిసి పోటీ చేయనుంది. ఈ నేపథ్యలో ఇరు పార్టీలు 40:60 నిష్పత్తిలో సీట్లు పంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు నాగాలాండ్ అసెంబ్లీకి బీజేపీ 20 స్థానాల్లో పోటీ పడనుంది.

Nagaland Polls: నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీపీపీతో కలిసి పోటీ చేయనున్న బీజేపీ.. ఎవరికి ఎన్ని సీట్లంటే

Nagaland Polls: నాగాలాండ్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 27న ఇక్కడ ఎన్నికలు జరుగుతాయి. నాగాలాండ్ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలున్నాయి. ఇక్కడ బీజేపీ-ఎన్డీపీపీ కూటమి కలిసి పోటీ చేయనుంది.

Adani issue In Parliament : పార్లమెంట్‌లో అదానీ ప్రకంపనలు .. హిండెన్ బర్గ్ నివేదికపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్..

ఈ నేపథ్యలో ఇరు పార్టీలు 40:60 నిష్పత్తిలో సీట్లు పంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు నాగాలాండ్ అసెంబ్లీకి బీజేపీ 20 స్థానాల్లో పోటీ పడనుంది. ఎన్డీపీపీ 40 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తెంజెన్ ఇమ్నా గురువారం వెల్లడించారు. ఇటీవల ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, జేపీ నద్దాతో జరిగిన సమావేశంలో ఈ మేరకు సీట్ల పంపిణీపై నిర్ణయం తీసుకున్నట్లు ఇమ్నా చెప్పాడు. తమ కూటమికి చెందిన ఎన్డీపీపీ మిగతా 40 సీట్లలో పోటీ చేస్తుందని వెల్లడించారు. బీజేపీ నుంచి పోటీ చేయబోయే 20 మంది అభ్యర్థుల జాబితాను కూడా పార్టీ ప్రకటించింది. అధ్యక్షుడు తెంజెన్ ఇమ్నా.. అలాంగ్టాకి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.

NSA Ajit Doval: అమెరికా సెక్రటరీతో అజిత్ ధోవల్ భేటీ.. రక్షణ రంగ సహకారంపై చర్చ

ప్రధాని మోదీ నాయకత్వంలో చేపడుతున్న అభివృద్ధి పనుల వల్ల తమకు విజయం లభిస్తుందని భావిస్తున్నట్లు బీజేపీ నేతలు అంటున్నారు. నాగాలాండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను మంగళవారం విడుదల చేసింది. నాగాలాండ్‌కు ఇవి 14వ అసెంబ్లీ ఎన్నికలు. ఈ నెల 7 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 8 నుంచి నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 27న ఎన్నికలు జరుగుతాయి. మార్చి 2న ఫలితాలు ప్రకటిస్తారు.