Tokyo Olympics – PV Sindhu: సింధు కాంస్య విజయం కోసం అతని త్యాగం!!

టోక్యో ఒలింపిక్స్ 2020 బరిలో దేశమంతటి ఆశలతో అడుగుపెట్టారు పీవీ సింధు. సీజన్ లో తొలి మ్యాచ్ నుంచి ఓటమెరుగకుండా దూసుకెళ్లిన ఆమెకు సెమీస్ లో బ్రేక్ పడింది. గోల్డ్ సాధిస్తుందని భావించిన యావత్ దేశానికి ఒక్కసారిగా షాక్.. తెలుగు తేజం కావడంతో ఇరు రాష్ట్రాల్లో పసిడి చేజారిందనే నిరుత్సాహం వెంటాడాయి.

Tokyo Olympics – PV Sindhu: సింధు కాంస్య విజయం కోసం అతని త్యాగం!!

Tokyo Olympics 2020

Tokyo Olympics – PV Sindhu: టోక్యో ఒలింపిక్స్ 2020 బరిలో దేశమంతటి ఆశలతో అడుగుపెట్టారు పీవీ సింధు. సీజన్ లో తొలి మ్యాచ్ నుంచి ఓటమెరుగకుండా దూసుకెళ్లిన ఆమెకు సెమీస్ లో బ్రేక్ పడింది. గోల్డ్ సాధిస్తుందని భావించిన యావత్ దేశానికి ఒక్కసారిగా షాక్.. తెలుగు తేజం కావడంతో ఇరు రాష్ట్రాల్లో పసిడి చేజారిందనే నిరుత్సాహం వెంటాడాయి. చూసే మనకే ఉంటే ఆడే సింధుకు ఎంత బాధ ఉండొచ్చు..

ఆమె కూడా కుంగిపోయారట. వస్తున్న భావోద్వేగాన్ని దిగమింగి ఆ మరుసటి రోజే జరగాల్సిన గేమ్‌లో టఫ్ ఫైట్ అందించి కాంస్యాన్ని సాధించారు.

సెమీస్‌లో చైనీస్‌ తైపీ క్రీడాకారిణి తైజుయింగ్‌ చేతిలో 18-21, 12-21 తేడాతో ఓడినా.. సింధు బింగ్జియావోపై గెలిచి కాంస్య పతకం దక్కించుకుంది. ఆది నుంచి ఆధిపత్యం చెలాయించి.. ఫస్ట్ గేమ్‌లో 21-13తో గెలుచుకోగా.. సెకండ్ సెట్‌ను 21-15తో గెలుచుకుంది సింధు.

ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ కాంస్య పతక పోరులో గెలవగానే ఒక్కసారిగా సింధు గెలిచిన ఆనందంతో గట్టిగా అరిచారు. కెమెరాలన్నీ ఆమెతో పాటు కోర్టు బయట ఉన్న ఓ వ్యక్తి తిరిగాయి. పట్టరాని సంతోషంతో నడుచుకుంటున్న వ్యక్తి.. మనం సాధించాం అనే అర్థం వచ్చేలా సింధును హత్తుకున్నాడు. పొరుగుదేశ వ్యక్తిలా కనిపిస్తున్న అతనెవరు.. సింధు ముందుగా అతణ్ని ఎందుకు కలిశారు..

పార్క్‌ తే సంగ్‌.. సింధు కోచ్‌
కొన్నేళ్లుగా సింధును ఈ మెగా ఈవెంట్ లో గెలిపించడం కోసం 42 ఏళ్ల పార్క్‌ శ్రమిస్తూనే ఉన్నాడు. 2019 నుంచి శిక్షణ ఇస్తూ ఆటలోని లోపాలను సరిచేస్తూ వచ్చాడు. డిఫెన్స్‌లో బలహీనంగా ఉండడంతో ఆ విభాగంలో ఎక్కువ దృష్టి పెట్టి కావాల్సిన మార్పులు తీసుకొచ్చాడు. కోర్టులో చురుగ్గా కదిలేలా తర్ఫీదునిచ్చి.. 2019లో ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో సింధును ఛాంపియన్‌గా నిలవడంలో ముఖ్య భూమిక పోషించాడు. కరోనా విరామంతో కోల్పోయినా.. మునుపటిలా రాణించేలా ప్రత్యేక శిక్షణ అందించాడు.

ఒకప్పటి దక్షిణ కొరియా బ్యాడ్మింటన్‌ ప్లేయర్ అయిన పార్క్‌.. 2004 ఏథెన్స్‌ ఒలింపిక్స్‌ పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్స్‌ వరకూ వెళ్లగలిగాడు. అదే ఏడాది ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్యం గెలిచాడు. 2002 ఆసియా క్రీడల్లో పసిడి సాధించిన పురుషుల టీమ్‌లో అతనూ ఓ సభ్యుడు. ఆ తర్వాత కోచ్‌గా మారిన అతను వ్యూహాలు రచించడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నాడు. 2013 నుంచి 2018 వరకూ కొరియా జట్టుకు కోచ్‌గా పనిచేశాడు.

ఒలింపిక్స్‌కు సమర్థంగా సన్నద్ధమయ్యే దిశగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో కూడిన గచ్చిబౌలి స్టేడియంలో సింధును ప్రాక్టీస్‌ చేయించాడు. ఒకేసారి ముగ్గురు లేదా నలుగురు కుర్రాళ్లను కోర్టులో మరో వైపు ఉంచి.. ఆడించేవాడు. సింధును అయోమయంలోకి గురిచేసేలా పలు షాట్లు ఆడమని చెప్పి.. వాటిని ఎదుర్కొనేలా ఆమెకు మెళకువలు నేర్పాడు. నెట్‌ దగ్గర షటిల్‌ను సమర్థంగా ఆడేలా శిక్షణ ఇచ్చాడు. ఆమెకు శిక్షణ ఇవ్వడం కోసం ఇండియాలోనే ఉండిపోయి గతేడాది ఫిబ్రవరి నుంచి ఒక్కసారి కూడా కుటుంబాన్ని కలవడానికి దక్షిణ కొరియా వెళ్లలేదు. నాలుగేళ్ల కూతురిని కూడా చూడకుండా ఇక్కడే ఉన్నందుకు ఫలితం దక్కింది.