టాపార్డర్ హాంఫట్: న్యూజిలాండ్‌ను వణికిస్తోన్న భారత బౌలర్లు

టాపార్డర్ హాంఫట్: న్యూజిలాండ్‌ను వణికిస్తోన్న భారత బౌలర్లు

భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్‌ టాప్‌ ఆర్డర్‌ కుప్పకూలింది. 25 ఓవర్లు ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు 5 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. టాపార్డర్‌లో కెప్టెన్ విలియమ్సన్ మినహాయించి ఒక్కరు కూడా 30 పరుగులకు మించి స్కోరు చేయలేకపోవడం గమనార్హం. కెప్టెన్‌ విలియమ్‌సన్‌ 47(61) ఒంటరి పోరాటానికిశాంటర్‌ 1(3) క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు.  భారత బౌలర్లలో షమీ, చాహల్‌ రెండేసి వికెట్లు తీయగా, జాదవ్‌కు ఒక వికెట్‌ దక్కింది.

 

న్యూజిలాండ్‌ జట్టు పరిస్థితి ఆది నుంచి అటూఇటుగానే నడుస్తోంది. ఓపెనర్లు గప్తిల్‌, మన్రో ఇద్దరూ ఆరంభంలోనే తడబడ్డారు. ఈ రెండు వికెట్లూ ఫేసర్ షమీకే దక్కడం విశేషం. రెండో ఓవర్‌ ఐదో బంతికి గప్తిల్‌ (5) ఔటవగా.. నాలుగో ఓవర్‌ మూడో బంతికి మన్రో (8) వెనుదిరిగాడు. ఆ తర్వాత చాహల్‌ వేసిన 15వ ఓవర్లో రాస్‌ టేలర్‌ (24) అతనికే క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. కెప్టెన్‌ విలియమ్‌సన్‌, టేలర్‌ మూడో వికెట్‌కు 34 పరుగులు జోడించారు. టేలర్ స్థానంలో బరిలోకి దిగిన లాథమ్ (11)పరుగులతో సరిపెట్టుకున్నాడు. ఈ వికెట్ కూడా చాహల్‌ క్యాచ్ & బౌల్డ్‌గా దక్కించుకోవడం విశేషం. 23 ఓవర్ ముగిసే సరికి న్యూజిలాండ్ ఐదో వికెట్‌ను చేజార్చుకుంది. కేదర్ జాదవ్ బౌలింగ్‌లో కుల్దీప్ క్యాచ్ అందుకోవడంతో నికోలస్(12)అవుట్‌గా వెనుదిరిగాడు. 

 

ఆస్ట్రేలియా పర్యటన అనంతరం టీమిండియా ఆడుతున్న తొలి వన్డే మొదలైంది. భారత్‌- న్యూజిలాండ్‌ మధ్య జరగనున్న ఈ రసవత్తర పోరులో టాస్‌ గెలిచిన కివీస్‌ కెప్టెన్‌ విలియమ్‌సన్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే నేపియర్‌ వేదికగా మొదలైంది. ఆస్ట్రేలియాను దాని సొంతగడ్డపై ఇటు టెస్టుల్లో, అటు వన్డేల్లో మట్టికరిపించిన ఉత్సాహంలో భారత్‌ ఉండగా.. లంక పర్యటనను విజయవంతంగా ముగించుకున్న న్యూజిలాండ్ అదే నమ్మకంతో ఢీ కొట్టేందుకు సిద్ధమైంది. సొంతగడ్డపై ఆడుతున్న సానుకూలతతో పాటు బలమైన జట్టు, మంచి ఫామ్‌.. ఇవన్నీ న్యూజిలాండ్‌ను గట్టి పోటీదారుగా మారుస్తున్నాయి. 

 

సిరీస్‌ పోరాటంలో హోరాహోరీగా తలపడటమనేది ఖాయమని కనిపిస్తోంది. న్యూజిలాండ్‌ పర్యటనలో భాగంగా భారత్‌ ఐదు వన్డేలతో పాటు మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.

భారత్‌: 
విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, మహేంద్ర సింగ్‌ ధోనీ, కేదార్‌ జాదవ్‌, అంబటి రాయుడు, విజయ్‌ శంకర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చాహల్‌, మహ్మద్‌ షమీ, భువనేశ్వర్‌ కుమార్‌
న్యూజిలాండ్‌: 
కేన్‌ విలియమ్సన్(కెప్టెన్‌)‌, మార్టిన్‌ గప్తిల్‌, కొలిన్‌ మన్రో, రాస్‌ టేలర్‌, హెన్రీ నికోల్స్‌, టామ్‌ లేథమ్‌, మిచెల్‌ శాంట్నర్‌, డౌ బ్రాస్‌వెల్‌, టిమ్‌ సౌథీ, లాకీ ఫెర్గూసన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌