Wimbledon Match-fixing : వింబుల్డన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం

వింబుల్డన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం చెలరేగుతోంది. ఒక సింగిల్స్ మ్యాచ్‌‌తోపాటు మ‌రో డ‌బుల్స్ మ్యాచ్‌పై ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో పెద్ద ఎత్తున బెట్టింగ్‌ జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై విచార‌ణ జరుగుతోంది.

Wimbledon Match-fixing : వింబుల్డన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం

Two Wimbledon Matches Under Match Fixing Scanner

Wimbledon Match-fixing Scanner : వింబుల్డన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం చెలరేగుతోంది. ఒక సింగిల్స్ మ్యాచ్‌‌తోపాటు మ‌రో డ‌బుల్స్ మ్యాచ్‌పై ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో పెద్ద ఎత్తున బెట్టింగ్‌ జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై ఇంట‌ర్నేష‌నల్‌ టెన్నిస్ ఇంటెగ్రిటీ ఏజెన్సీ విచార‌ణ జరుపుతోంది. పురుషుల డ‌బుల్స్‌లో తొలి రౌండ్ మ్యాచ్‌లో ఫిక్సింగ్ జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఓ మ్యాచ్‌లో బుకీలకు ఫేవ‌రెట్‌గా ఉన్న జోడీ కావాలనే పరాజయం పాలైనట్లు ప‌లు బెట్టింగ్ సంస్థలు ఫిర్యాదులు చేశాయి. ఈ జోడీ తొలి సెట్ గెలిచి త‌ర్వాతి రెండు సెట్లలో దారుణ రీతిలో ఓడిపోయింది. అలాగే మరో మ్యాచ్‌లో జర్మన్ ప్లేయ‌ర్ ఆడిన తొలి రౌండ్ సింగిల్స్ మ్యాచ్‌‌పై కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ జర్మన్ ప్లేయర్ ప్రత్యర్థిపై అనుమానాలు నెలకొన్నాయి.

రెండవ సెట్ త‌ర్వాత భారీగా బెట్టింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లో స‌ర్వీస్ గేమ్స్ సంఖ్యపై ప్రత్యేకంగా బెట్టింగ్స్ న‌డిచినట్లు సమాచారం. వీటితోపాటు ఈ ఏడాది ఏప్రిల్‌, జూన్ మ‌ధ్య జరిగిన మొత్తం 11 మ్యాచ్‌ల‌పై ఫిక్సింగ్ ఫిర్యాదులు ఇంట‌ర్నేష‌నల్‌ టెన్నిస్ ఇంటెగ్రిటీ ఏజెన్సీకు అందాయి. ఈమేరకు విచారణ చేస్తున్నట్లు ఐటీఐఏ అధికారులు వెల్లడించారు.