Virat Kohli : న‌వీన్ ఉల్ హ‌క్ ర‌నౌట్ ఛాన్స్‌ను మిస్ చేసిన రాహుల్‌.. కోహ్లీ రియాక్ష‌న్ వైర‌ల్‌

టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ, అఫ్గానిస్థాన్‌ పేసర్ నవీన్ ఉల్ హక్ ల మధ్య ఉన్న‌ వివాదం గురించి క్రికెట్ పై అవగాహన ప్రతీ ఒక్కరికి దాదాపుగా తెలిసిందే.

Virat Kohli : న‌వీన్ ఉల్ హ‌క్ ర‌నౌట్ ఛాన్స్‌ను మిస్ చేసిన రాహుల్‌.. కోహ్లీ రియాక్ష‌న్ వైర‌ల్‌

Virat Kohli-Naveen ul Haq

Virat Kohli-Naveen ul Haq : టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ, అఫ్గానిస్థాన్‌ పేసర్ నవీన్ ఉల్ హక్ ల మధ్య ఉన్న‌ వివాదం గురించి క్రికెట్ పై అవగాహన ప్రతీ ఒక్కరికి దాదాపుగా తెలిసిందే. ఐపీఎల్ 2023లో ఈ ఇద్ద‌రు ఆట‌గాళ్లు మైదానంలో గొడ‌వ‌కు దిగారు. ఈ వివాదం పెద్ద‌గా మారింది. ఇది కాస్త గంభీర్, కోహ్లీల మ‌ధ్య గొడ‌వ‌కు దారి తీసింది. మైదానంతో గొడ‌వ స‌మ‌సిపోయింద‌ని అంద‌రూ బావించ‌గా అఫ్గాన్ పేస‌ర్ న‌వీన్ సోష‌ల్ మీడియాలో చేసిన ప‌లు ట్వీట్లు కోహ్లీ అభిమానులకు ఆగ్ర‌హాన్ని తెప్పించాయి. ఈ నేప‌థ్యంలో కోహ్లీ ఫ్యాన్స్ న‌వీన్ ఉల్ హ‌ల్ క‌నిపించిన‌ప్పుడు  కోహ్లీ.. కోహ్లీ అంటూ నినాదాలు చేస్తూ అత‌డిని టీజ్ చేస్తున్నారు.

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా బుధ‌వారం భార‌త్‌, అఫ్గానిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రుగుతోంది. ఐపీఎల్‌లో గొడ‌వ త‌రువాత విరాట్ కోహ్లీ, న‌వీన్ ఉల్ హ‌క్ మైదానంలో ముఖాముఖిగా త‌ల‌ప‌డ‌డం ఇదే తొలి సారి. కాగా.. ఆఫ్గాన్ ఇన్నింగ్స్‌లో న‌వీన్ ఉల్ హ‌క్ బ్యాటింగ్‌కు వ‌చ్చిన స‌మ‌యంలో అభిమానులు కోహ్లీ పేరును జ‌పిస్తూ అత‌డికి స్వాగ‌తం ప‌లికారు. న‌వీన్ తాను ఎదుర్కొన్న మొద‌టి బంతిని పైన్ లెగ్ వైపు కొట్టాడు. అక్క‌డ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ చేస్తున్నాడు. బౌండ‌రీకి వెలుతున్న బంతిని ఆపిన కోహ్లీ చాలా వేగంగా వికెట్ల వైపుగా విసిరాడు.

World Cup 2023 IND vs PAK : హై ఓల్టేజ్ మ్యాచ్ ముందు ప్ర‌పంచ‌క‌ప్ ఆరంభ వేడుక‌..! హాజ‌రుకానున్న అమితాబ్, స‌చిన్‌, రజినీకాంత్‌..!

అయితే.. కేఎల్ రాహుల్ బంతిని అందుకోవ‌డంలో విఫ‌లం అయ్యాడు. అప్ప‌టికే న‌వీన్ రెండు ప‌రుగులు పూర్తి చేశాడు. ఒక‌వేళ రాహుల్ క‌నుక బంతిని వేగంగా అందుకుని ఉంటే న‌వీన్ ఉల్ హ‌క్ ర‌నౌట్ అయి ఉండేవాడే. దీంతో రాహుల్ పై విరాట్ కోహ్లీ అసంతృప్తిని వ్య‌క్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఇక ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 272 ప‌రుగులు చేసింది. అఫ్గాన్ బ్యాట‌ర్ల‌లో హష్మతుల్లా షాహిదీ (80; 88 బంతుల్లో 8 ఫోర్లు, 1సిక్స్‌), అజ్మతుల్లా ఒమర్జాయ్ (62; 69 బంతుల్లో 2ఫోర్లు, 4 సిక్స‌ర్లు) లు హాఫ్ సెంచ‌రీల‌తో రాణించారు.

World Cup 2023 PAK vs SL : పాక్ ఆట‌గాళ్లు బౌండ‌రీ లైన్‌ను మార్చారా..? సోష‌ల్ మీడియాలో ఫోటోలు వైర‌ల్‌..?