MS Dhoni: నిన్న‌టి మ్యాచులో ‘ధోనీ.. ధోనీ’ అంటూ అభిమానుల నినాదాలు.. వీడియో

టీమిండియా, న్యూజిలాండ్ మధ్య నిన్న రాంచీలోని జేఎస్సీఏ అంత‌ర్జాతీయ మైదానంలో జ‌రిగిన తొలి టీ20 మ్యాచును టీమిండియా మాజీ కెప్టెన్, ఝార్ఖండ్ డైమండ్ మ‌హేంద్ర సింగ్ ధోనీ స్టేడియం నుంచి వీక్షించాడు. ఆ స‌మ‌యంలో ధోనీ భార్య సాక్షి కూడా ఉంది.

MS Dhoni: నిన్న‌టి మ్యాచులో ‘ధోనీ.. ధోనీ’ అంటూ అభిమానుల నినాదాలు.. వీడియో

Indrakaran reddy

MS Dhoni: టీమిండియా, న్యూజిలాండ్ మధ్య నిన్న రాంచీలోని జేఎస్సీఏ అంత‌ర్జాతీయ మైదానంలో జ‌రిగిన తొలి టీ20 మ్యాచును టీమిండియా మాజీ కెప్టెన్, ఝార్ఖండ్ డైమండ్ మ‌హేంద్ర సింగ్ ధోనీ స్టేడియం నుంచి వీక్షించాడు. ఆ స‌మ‌యంలో ధోనీ భార్య సాక్షి కూడా ఉంది. స్క్రీన్ పై ధోనీ క‌న‌ప‌డ‌గానే టీమిండియా అభిమానులు ధోనీ.. ధోనీ అంటూ నినాదాల‌తో హోరెత్తించారు.

ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ త‌మ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ధోనీ ధోనీ అంటూ అభిమానులు నిన‌దిస్తుండ‌గా అత‌డు అభివాదం చేశాడు. మొన్న కూడా టీమిండియాతో ధోనీ క‌న‌ప‌డిన విష‌యం తెలిసిందే. భార‌త జ‌ట్టు ప్రాక్టీస్ చేస్తున్న స‌మ‌యంలో ధోనీ క‌న‌ప‌డ్డాడు. క్రికెట్లో గొప్ప కెప్టెన్ ల‌లో ఒక‌రిగా పేరు తెచ్చుకున్న ధోనీ రిటైర్మెంట్ త‌ర్వాత ఇత‌ర కార్య‌క్ర‌మాల‌పై దృష్టి పెట్టాడు.

అప్పుడ‌ప్పుడు డ్రెస్సింగ్ రూమ్ లో ఆట‌గాళ్ల‌తో క‌న‌ప‌డుతూ అల‌రిస్తున్నారు. కాగా, నిన్న జ‌రిగిన తొలి టీ20లో న్యూజిలాండ్ చేతితో భార‌త్ ఓడిపోయింది. వ‌న్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా తొలి టీ20 లో మాత్రం ఓడిపోవ‌డంతో భారత అభిమానులు తీవ్ర నిరాశ‌కు గుర‌య్యారు. ఓట‌మి ఎదురైన తీరుపై టీమిండియా విశ్లేషించుకుంటోంది. భార‌త్ ముందు న్యూజిలాండ్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఛేదించ‌లేక‌పోవ‌డంతో నిన్న భార‌త్ ఓడిపోయింది. నిర్ణీత‌ ఓవర్లలో 9 వికెట్లకు టీమిండియా 155 పరుగులు చేయగలిగింది.

Shooting In Israel 7 Killed : ఇజ్రాయెల్ లోని ప్రార్థనామందిరంలో కాల్పులు.. ఏడుగురు మృతి