ICC మొమరబుల్ వీడియో : బ్యాటింగే కాదు..వికెట్లు తీయగలం

ICC మొమరబుల్ వీడియో : బ్యాటింగే కాదు..వికెట్లు తీయగలం

when batsmen take wickets ICC : బ్యాటింగ్ కాదు..వికెట్లు తీయగలం అంటున్నారు బ్యాట్స్ మెన్స్. అవును బ్యాట్స్ మెన్స్ బౌలింగ్ చేసి వికెట్లు తీశారు. దీనికి సంబంధించిన ఓ మొమరబుల్ వీడియోను ICC షేర్ చేసింది. ట్విట్టర్ వేదికగా చేసిన ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ గా మారింది. జయవర్ధనే, ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోని, స్టీఫెన్ ప్లెమింగ్‌లాంటి పవర్ ఫుల్ బ్యాట్స్ మెన్స్ బౌలింగ్ చేయడం ఈ వీడియోలో కనిపించింది. క్రికెట్ క్రీడారంగంలో ఎంతో మంది ప్రొఫెషనల్ బ్యాట్స్ మెన్‌గా రాణించారు.

వీరిలో కొంతమంది రిటైర్ కాగా..మరికొంతమంది ఆయా దేశాలకు ఆడుతూ..అభిమానులను అలరిస్తున్నారు. వన్డేలో రెగ్యులర్ బౌలర్లు, ఆల్ రౌండర్లు, పార్ట్ టైమ్ బౌలర్లు ఉంటుంటాడు. టీమిండియా విషయానికి వస్తే..మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, సెహ్వాల్ ‌తో పాటు ఇతరులు కొందరు..బౌలర్లుగా రాణించారు. కొన్ని సందర్భాల్లో మ్యాచ్‌లు గెలిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

జయవర్ధనే, డివిలియర్స్, ఫ్లెమింగ్, కోహ్లీ, ధోని, అన్వర్, యూసఫ్ వీరంతా..మంచి బ్యాట్స్ మెన్స్‌గా పేరొందారు. బ్యాటింగ్‌కే పరిమితం కాకుండా..అరుదుగా బౌలింగ్ చేశారు. ఐసీసీ పాతతరం, కొత్తతరం క్రికేటర్లు తమ జట్లకు బౌలింగ్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోను అస్సలు మిస్ కావొద్దు..అంటూ క్యాప్షన్ జత చేసింది.