Virat Kohli: కోహ్లీని టీ20 కెప్టెన్‌గా ఉండాలని బీసీసీఐ మొత్తం అడిగింది – చీఫ్ సెలక్టర్

బీసీసీఐ సెలక్షన్ కమిటీ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కోసం జట్టును శుక్రవారమే ప్రకటించింది. రోహిత్ శర్మ కండరాల గాయం కారణంగా సిరీస్ కు దూరమవుతుండటంతో కేఎల్ రాహుల్ ను కెప్టెన్ గా పేర్కొంటూ జాబితా విడుదల చేసింది.

Virat Kohli: కోహ్లీని టీ20 కెప్టెన్‌గా ఉండాలని బీసీసీఐ మొత్తం అడిగింది – చీఫ్ సెలక్టర్

Virat Kohli

Virat Kohli: బీసీసీఐ సెలక్షన్ కమిటీ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కోసం జట్టును శుక్రవారమే ప్రకటించింది. రోహిత్ శర్మ కండరాల గాయం కారణంగా సిరీస్ కు దూరమవుతుండటంతో కేఎల్ రాహుల్ ను కెప్టెన్ గా పేర్కొంటూ జాబితా విడుదల చేసింది. జట్టును అనౌన్స్ చేసిన తర్వాత సెలక్టర్ల ఛైర్మన్ చేతన్ శర్మ వన్డే కెప్టెన్సీ, టీ20 కెప్టెన్సీకి వీడ్కోలు చెప్పిన విరాట్ గురించి మాట్లాడారు.

‘మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత అందరికీ సర్‌ప్రైజ్ గానే అనిపించింది. వరల్డ్ టీ20 ఆ రేంజ్ లో ఉన్నప్పుడు ఇలాంటి విషయం విని ఎలాంటి రియాక్షన్ ఇవ్వగలం. అందుకే ఈ నిర్ణయం గురించి మరోసారి ఆలోచించాలని అతనికి చెప్పాం. దీని గురించి వరల్డ్ కప్ తర్వాత మాట్లాడదాం అని చెప్పాం’ అని అన్నారు చేతన్.

‘ప్రతి ఒక్కరూ ఇండియన్ క్రికెట్ కోసం కొనసాగాలని అడిగాం. సెలక్టర్లంతా ఇది వరల్డ్ కప్ పై ప్రభావం చూపిస్తుందని భావించాం. ఆ మీటింగ్ లో ఉన్న బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షాతో సహా అందరూ కొనసాగాలనే చెప్పారు. కన్వీనర్లు, బోర్డ్ అఫీషియల్స్ కూడా అక్కడే ఉన్నారు. ఎందుకంటే అతని నిర్ణయం టీంపై ప్రభావం చూపించడం మాకు ఇష్టం లేదు. కోహ్లీని అతని ప్లాన్స్ ను గౌరవిస్తాం. అతను జట్టుకు పిల్లర్ లాంటి వాడు. అందుకే ఇంకోసారి ఆలోచించుకోవాలని సూచించాం’ అని చేతన శర్మ వెల్లడించారు.

ఇది కూడా చదవండి : మేఘాలయ మేఘాల్లో తేలిపోతున్న విష్ణుప్రియ

కాకపోతే విరాట్ కోహ్లీ గతంలో జరిగిన ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడి.. తాను టీ20 కెప్టెన్సీకి వీడ్కోలు పలుకుదామని అనుకుంటున్నట్లు చెప్పినప్పుడు అందరూ తన నిర్ణయానికి కన్విన్స్ అయ్యారని ఏ ఒక్కరూ అభ్యంతరం చెప్పలేదని అన్నాడు.