WTC Final 2023: డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ మ్యాచ్ డ్రా అయితే ప‌రిస్థితి ఏంటి..? ట్రోఫీని అందుకునేది ఎవ‌రంటే..?

క్రికెట్ ప్రేమికుల దృష్టి అంతా ఇప్పుడు ప్ర‌తిష్టాత్మ‌క ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ మ్యాచ్‌(WTC Final 2023) పైనే ఉంది. డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ డ్రా గా ముగుస్తే ప‌రిస్థితి ఏంటి..? ఎవ‌రిని విజేత‌గా నిర్ణ‌యిస్తారు..? అన్న ప్ర‌శ్న చాలా మందిలో మెదిలే ఉంటుంది.

WTC Final 2023: డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ మ్యాచ్ డ్రా అయితే ప‌రిస్థితి ఏంటి..? ట్రోఫీని అందుకునేది ఎవ‌రంటే..?

WTC Final 2023 IND vs AUS

WTC Final: క్రికెట్ ప్రేమికుల దృష్టి అంతా ఇప్పుడు ప్ర‌తిష్టాత్మ‌క ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ మ్యాచ్‌(WTC Final 2023) పైనే ఉంది. లండ‌న్ వేదిక‌గా ఓవ‌ల్ మైదానంలో జూన్ 7 నుంచి 11 మ‌ధ్య భార‌త్‌(Team India), ఆస్ట్రేలియా(Australia) జ‌ట్ల మ‌ధ్య ఈ స‌మ‌రం జ‌ర‌గ‌నుంది. ఇందుకోసం ఇరు జ‌ట్లు ఇప్ప‌టికే లండ‌న్ చేరుకుని ప్రాక్టీస్‌ను కూడా మొద‌లెట్టేశాయి. ఇన్ని రోజులు ఐపీఎల్‌(IPL)లో అల‌రించిన భార‌త ఆట‌గాళ్లు టెస్టు ఫార్మాట్‌కు అల‌వాటుప‌డుతున్నారు.

ఈ మ్యాచ్‌లో ఏ జ‌ట్టు గెలిచినా కూడా ఇది వారికి మొద‌టి ట్రోఫీనే కానుంది. డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ విజేత‌గా నిలిచిన జ‌ట్టుకు 1.6 మిలియన్‌ డాలర్ల ప్రైజ్‌మనీ అంటే భార‌త క‌రెన్సీలో రూ.13.24 కోట్లు ద‌క్క‌నుంది. ర‌న్న‌ర‌ప్‌కు 8 ల‌క్ష‌ల డాల‌ర్లు అంటే మ‌న క‌రెన్సీలో రూ.6.5 కోట్లు అంద‌నుంది. మూడో స్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికాకు 450,000 డాలర్లు అంటే మ‌న క‌రెన్సీలో రూ.3.6 కోట్లు), నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్న ఇంగ్లాండ్‌కు రూ. 2.8 కోట్లు, శ్రీలంకకు రూ.1.6 కోట్లు అంద‌నున్నాయి.

WTC Final 2023: ఈ ఇద్ద‌రు టీమ్ఇండియా ఆట‌గాళ్ల‌పైనే ఆస్ట్రేలియా దృష్టంతా

ఇక‌ ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో ఉన్న న్యూజిలాండ్, పాకిస్థాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్‌లకు తలో 100,000 డాలర్లు అంటే భార‌త క‌రెన్సీలో రూ.82ల‌క్ష‌లు అందుకోనున్నాయి. గ‌త(2019-2021) ఎడిష‌న్‌లో కూడా ఇంతే ప్రైజ్‌మ‌నీ ని అందించారు.

ఫైన‌ల్ మ్యాచ్ డ్రా అయితే..?

టెస్టు మ్యాచులు ఎక్కువ‌గా డ్రా గా ముగుస్తుండ‌డాన్ని చూస్తేనే ఉన్నాము. అలాగే డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ కూడా డ్రా గా ముగుస్తే ప‌రిస్థితి ఏంటి..? ఎవ‌రిని విజేత‌గా నిర్ణ‌యిస్తారు..? అన్న ప్ర‌శ్న చాలా మందిలో మెదిలే ఉంటుంది. ఒక‌వేళ డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ మ్యాచ్ గ‌నుక డ్రా గా ముగుస్తే ఇరు జ‌ట్ల‌ను సంయుక్త విజేత‌లుగా ప్ర‌క‌టిస్తారు. ఇరు జ‌ట్ల‌కు ట్రోఫీని అంద‌జేస్తారు.

WTC Final 2023: అజింక్యా ర‌హానేను ఊరిస్తున్న రికార్డులు.. ఏంటంటే..?

ఐదు రోజులు సాగే టెస్టు మ్యాచులో వ‌ర్షం వ‌ల్ల ఆట‌కు అంత‌రాయం క‌లిగితే ఆ రోజు ఆట‌ను.. రిజ‌ర్వ్ డే రోజున నిర్వ‌హిస్తారు. జూన్ 12న రిజ‌ర్వ్‌డే గా ఇప్ప‌టికే ఐసీసీ నిర్ణయించింది. ఈ మ్యాచ్ భార‌త కాల‌మానం ప్ర‌కారం మ‌ధ్యాహ్నాం 3.30 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. స్టార్‌స్పోర్ట్స్‌లో ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం వీక్షించొచ్చు.