Home » AP
నవ్యాంధ్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధానిలో రైతుల నిరసనలు 600వ రోజుకు చేరుకున్నాయి. భారీ ర్యాలీలకు రాజధాని రైతులు పిలుపునిచ్చారు. భారీగా పోలీసులు మోహరించారు.
పులిచింతల ప్రాజెక్టు గేటు ఊడి మూడు రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు మరమ్మతు పనుల్లో ఆశించినంత పురోగతి కనిపించడం లేదు. దీంతో దిగువ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
ఏపీ పదో తరగతి ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. విజయవాడలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటిస్తారు.
ఏపీ ఆర్థిక శాఖలో ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. ఇద్దరు సెక్షన్ ఆఫీసర్స్, ఒక అసిస్టెంట్ సెక్రటరీని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఊరట లభించింది. రాష్ట్ర ప్రభుత్వం సీబీఏఎస్ పరీక్షలు రద్దు చేసింది.
తనకు ఆరోగ్యం బాగుండక పోయినా రోగులకు సేవల చేయటం మాత్రం మానలేదో ఓ గ్రేట్ డాక్టర్. ఓ చేతికి సెలైన్ పెట్టుకుని మరో చేత్తో రోగులకు వైద్యం చేస్తున్న డాక్టర్ ను చూసినవారంతా గ్రేట్ డాక్టర్..హ్యాట్సాఫ్ డాక్టర్ అంటూ ప్రశంసిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,107 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఆగస్టు 16న పాఠశాలలు పునఃప్రారంభిస్తున్నట్లు ఏపీ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. అదే రోజు జగనన్న విద్యా కానుక ఇస్తామని చెప్పారు.
కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న అపార్ట్ మెంట్ ని జాకీలతో నిలబెట్టి దాంట్లోనే నివసిస్తున్నారు ప్రజలు. పిల్లర్లకు పగుళ్లు వచ్చి ఏ క్షణమైనా కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న అపార్ట్ మెంట్ లో 33 ప్లాట్స్ కు సంబంధించిన ప్రజలు అత్యంత ప్రమాదంలో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాలు మళ్లీ పెరిగాయి.