AP Corona Cases : ఏపీలో 24 గంటల్లో 2,107 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,107 కరోనా కేసులు నమోదయ్యాయి.

Ap Corona
AP corona cases : ఆంధ్రప్రదేశ్ లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,107 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 20 మంది మృతి చెందారు. 1,807 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 19,59,154కు చేరింది.
ప్రస్తుతం 21,279 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా వల్ల కృష్ణాలో ఆరుగురు, చిత్తూరు, ప్రకాశంలో నలుగురు మరణించారు. అనంతపురం, తూర్పుగోదావరి, కడప, నెల్లూరు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరిలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.
కాగా నిన్న 2,010 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 20 మంది మృతి చెందారు. 1,956 మంది బాధితులు వైరస్ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.