AP SSC Results : నేడు ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల

ఏపీ పదో తరగతి ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. విజయవాడలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటిస్తారు.

AP SSC Results : నేడు ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల

Ssc Results

Updated On : August 6, 2021 / 3:36 PM IST

AP SSC results : ఏపీ పదో తరగతి ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. విజయవాడలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటిస్తారు. 2021 సంవత్సరంతోపాటు 2020 సంవత్సరం ఫలితాలను విడుదల చేయనున్నారు. కరోనా కరాణంగా గత సంవత్సరం పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో అధికారులు మార్కులు కేటాయించకుండా కేవలం ఉత్తీర్ణులైనట్లు అయినట్లు మోమోలు జారీ ఇచ్చారు. ఆ విద్యార్థులకు ప్రస్తుతం గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లు ప్రకటిస్తారు. వీరు సంబంధిత వెట్ సైట్ లో హాట్ టికెట్ నెంబర్ తో రిజల్ట్స్ ను పొందవచ్చు. 2021 సంవత్సరం విద్యార్థులు ఫలితాల కోసం జిల్లా, మండలం, పాఠశాల, విద్యార్థి పేరు, పుట్టిన తేదీని రిజిస్టర్ చేసుకోవాలి.