Home » Chandrababu Naidu
పవన్ కల్యాణ్ తో అంబటి రాయుడు భేటీ కావటం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వీరి భేటీలో తాజా రాజకీయాలు, వైసీపీలో ఎందుకు చేరాల్సి వచ్చింది? ఎందుకు మళ్లీ రాజీనామా చేయాల్సి వచ్చిందనే విషయాలపై పవన్ కు అంబటి వివరించినట్లు తెలుస్తోంది.
టీడీపీ ఎంపీ కేశినేని నాని వైసీపీ తీర్థం పుచ్చుకొనేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం సీఎం జగన్ తో ఆయన భేటీ అవుతారని సమాచారం.
‘మీ బలహీనతను తెలుసుకుని కొత్త కొత్త బ్రాండ్లు తీసుకుని వచ్చారు. అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో ఎక్కడ పెడితే అక్కడ పెడతాను. టీటీడీలో కూడా నాసిరకం భోజనం పెడుతున్నారు’ అని అన్నారు.
పార్టీలో చేరికలు, ఆర్థికంగా బలమైన అభ్యర్థులు, నిధుల సమీకరణ, అధికార యంత్రాంగం మద్దతు.. ఇలా అన్ని వనరులు సమీకరించుకోవడం, సేకరించుకోవడం తేలిక అవుతుంది.
2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రగిరి అసెంబ్లీ పరిధిలో 2.90 లక్షల ఓట్లు ఉంటే ఇప్పుడు 3.08 ఓట్లు ఉన్నాయని తెలిపారు. ఐదేళ్లలో పెరిగిన ఓట్లు 16వేలు మాత్రమే అని వివరించారు.
మాకు దొంగ ఓట్లు అవసరం లేదన్న అంబటి రాంబాబు.. జగన్ ని అన్ని వర్గాల ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని చెప్పారు.
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. అతడిని అరెస్ట్ చెయ్యొద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
కాంగ్రెస్ లో చేరిన షర్మిలకు రేవంత్ రెడ్డి మద్దతివ్వడంలో వింతేముంది? అని కొడాలి నాని అడిగారు. రేవంత్ రెడ్డి ఏపీకి వచ్చి పీసీసీ బాధ్యత తీసుకోమని చెప్పండి అని వ్యాఖ్యానించారు.
కార్పొరేటర్ పదవికి కేశినేని శ్వేత రాజీనామా చేశారు. విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మికి కేశినేని శ్వేత తన రాజీనామా లేఖను అందించారు.
జైలుకైనా పోతామంటూ కొందరు అంగన్ వాడీ వర్కర్ల సంఘం నేతలు అంటున్నారు. కొన్ని శక్తులు ఈ సమ్మెను నడిపిస్తున్నాయి. మేము వారికి చేయాల్సింది చేశాం.