చంద్రబాబు ఓడిపోవడం, మేము మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం- మంత్రి అంబటి రాంబాబు
మాకు దొంగ ఓట్లు అవసరం లేదన్న అంబటి రాంబాబు.. జగన్ ని అన్ని వర్గాల ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని చెప్పారు.

Ambati Rambabu
Ambati Rambabu : టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు మంత్రి అంబటి రాంబాబు. ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేని వ్యక్తి చంద్రబాబు అని, ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు చంద్రబాబు అని మండిపడ్డారు. తెలంగాణలో ఎమ్మెల్సీని కొనటానికి ప్రయత్నించారని ఆరోపించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగితే చంద్రబాబు ఓడిపోతారని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. మాకు దొంగ ఓట్లు అవసరం లేదన్న అంబటి రాంబాబు.. జగన్ ని అన్ని వర్గాల ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని చెప్పారు.
ఈవీఎంలు పని చేయవని గతంలో చెప్పిన చంద్రబాబు.. ఓటమి భయంతో ఇప్పుడు వేషాలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎవరెన్ని కుట్రలు చేసినా చంద్రబాబు ఓడిపోవడం, వైసీపీ మళ్లీ గెలవడం ఖాయం అన్నారు మంత్రి అంబటి రాంబాబు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి వైసీపీ కార్యాలయంలో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు.
కేంద్ర ఎన్నికల సంఘం విజయవాడలో నిర్వహించిన సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. ఏపీలో ఓట్ల అక్రమాలు జరుగుతున్నాయని సీఈసీకి ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్లు వేసుకుంటే తప్ప గెలవలేం అనే తుది నిర్ణయానికి వైసీపీ ప్రభుత్వం వచ్చిందని చంద్రబాబు ఆరోపించారు. ఒక్క చంద్రగిరిలోనే ఫారం-6 కింద 1 లక్ష 15 వేల ఓట్లు ఇచ్చారని తెలిపారు. వాటిలో దాదాపు 33 వేల ఓట్లను ఆమోదించారని, దీనికి సంబంధించిన అన్ని ఆధారాలను సీఈసీకి ఇచ్చామన్నారు చంద్రబాబు. వైసీపీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని, దొంగ ఓట్లను ప్రోత్సహిస్తోందని ఆరోపణలు చేశారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలపై ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
”పవన్ కల్యాణ్ కు గుర్తు లేక చంద్రబాబుతో వెళ్ళారు. మేము ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నాం. దత్తపుత్రుడు, దత్తతండ్రి కలిసి బద్నాం చేయాలని చూస్తున్నారు. జగన్ ఎవరిని మార్చితే మీకేంటి బాధ? కొన్ని పత్రికలు విషం చిమ్ముతున్నాయి. ఎవరినీ కలుపుకోము. సింగిల్ గానే వస్తాం. చంద్రబాబు అన్నీ సర్దుకుని హైదరాబాద్ వెళ్ళాలి. ఎక్కడున్నా ఇక్కడ ఓటు ఉండవచ్చు. కానీ అక్కడ, ఇక్కడ ఓటు ఉండకూడదు. రెండు చోట్ల ఓటు ఉండకూడదు” అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
Also Read : రాష్ట్రంలో పరిస్థితులపై సీఈసీకి ఫిర్యాదు చేశాం.. వాళ్లను ఎన్నికల్లో ఉపయోగించొద్దని కోరాం
”గుర్తింపు లేని రాజకీయ పార్టీ. పవన్ కల్యాణ్ కు కానీ, ఆయన పార్టీకి కానీ గుర్తింపు లేదు. అందువల్లే చంద్రబాబు చెంచాగా వెళ్లారు. పవన్ కల్యాణ్ కు గ్లాసు గుర్తు ఎందుకు? సైకిల్ గుర్తుతో పోటీ చేస్తే సరిపోతుంది కదా. జనసేన పార్టీని టీడీపీలో విలీనం చేసేయ్. మా పార్టీని టీడీపీలో విలీనం చేస్తాం. సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తాం. ఇంకొద్దిగా ప్యాకేజీ పెంచండి అని చంద్రబాబుని అడిగితే సరిపోతుంది. చంద్రబాబు కూడా తాను సంపాదించిన పాపపు సొమ్ముతో రెడీగా ఉన్నారు. దుర్మార్గమైన రాజకీయాలు చేయడంలో చంద్రబాబు నిష్ణాతులు. చెప్పిన మాట చెప్పుకోకుండా మోసం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు.
చంద్రబాబుకి తోడు తానతందాన అనే పత్రికలు ఉన్నాయి. వైసీపీ పని అయిపోయింది, టీడీపీ అధికారంలోకి వచ్చేసింది అనే పిచ్చిరాతలు రాస్తున్నారు. అభూతకల్పనలు రాస్తున్నారు. జగన్ అంట జైలుకెళ్లిపోతారట. వాయిదాలకు హాజరు కాలేదట. మీరు ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ జగనే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు. దొంగ ఓట్లతో మాకు పనే లేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకు మేలు చేశాం. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలుపుకున్నాం. ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైన ముద్ర వేసేలా జగన్ పరిపాలన చేశారు.
జనవరి నెల నుంచి 3వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నాం. ఇచ్చిన మాటను నిలుపుకున్నాం. అందువల్ల మేము మళ్లీ అధికారంలోకి రాబోతున్నాం. ఎవరిని అడిగినా ఇదే మాట చెబుతారు. ఏ సర్వేని అడిగినా చెబుతారు. ఎలక్షన్ కమిషన్ వచ్చిందని వేషాలు వేస్తున్నారు. అసలు విషయాలు వదిలి కొత్త విషయాలు మాట్లాడి మమ్మల్ని బద్నాం చేయాలని చూస్తున్నారు. ఇది దుర్మార్గమైన ప్రయత్నం. పొత్తులు పెట్టుకుంటే పెట్టుకున్నారు. కలిసి తిరిగితే తిరిగారు. మాకేమీ అభ్యంతరం లేదు” అని అంబటి రాంబాబు అన్నారు.
Also Read : వైఎస్ మరణంపై వైసీపీ ఆరోపణలు సరికాదు.. జగన్ తాడేపల్లి నుంచి బయటకొస్తే ఏం జరుగుతుందో తెలుస్తుంది