Home » Matti Manishi
అపరాల పంటల్లో కందిది ప్రత్యేక స్థానం. దీనిని ఏకపంటగానే కాక పలుపంటల్లో అంతర, మిశ్రమ పంటగా సాగుచేసుకునే అవకాశం వుండటంతో చాలా మంది ఈ ఖరీఫ్ లో సాగుచేశారు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో పూత, కాత దశలో ఉంది.
ఖరీఫ్ పంట కాలంలో పండించే జొన్న ఎక్కువగా పశువుల దాణా, కోళ్ళ మేత మరియు ఆల్కహాల్ తయారీ కొరకు వినియోగిస్తారు. రబీ పంటలో సాగుచేసిన జొన్న ఏకమొత్తంగా ఆహారపు అవసరాలకు వినియోగిస్తారు.
ఆర్థికంగా ఎదగాలంటే బాగా చదివి ఉద్యోగాలే చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా కష్టపడేతత్వం, మరికొంత పెట్టుబడి ఉంటే సరిపోతుందని నిరూపిస్తున్నారు ఏలూరు జిల్లా, కొయిలగూడెం మండలం, అంకాల గూడెం గ్రామ రైతు ఏడుకొండలు.
ఖరీఫ్ లో వర్షాధారంగా దీని సాగులో కొంత ఒడిదుడుకులు వున్నప్పటికీ, రబీలో నీటిపారుదల కింద నమ్మకమైన దిగుబడినిస్తోంది. రెండేళ్లుగా కత్తెర పురుగు సమస్య వెన్నాడుతున్నా, దీని అరికట్టే చర్యల పట్ల రైతుల్లో అవగాహన పెరగటంతో సాగులో భరోసా పెరిగింది.
ముందుగా విత్తుకున్న రైతుల పొలాల్లో రైతులు పత్తితీతలు జరుపుతున్నారు. ఇటు గుంటూరు కృష్ణా జిల్లాలో వేసిన పత్తి కాయ ఎదుగుదల దశలో ఉంది. ఈ దశలో రసంపీల్చు పురుగులైన పచ్చదోమ, తెల్లదోమ ఆశించి అధిక నష్టం చేస్తున్నాయి .
రెండు తెలుగు రాష్ట్రాల్లో బొప్పాయి సాగువిస్తీర్ణం ఏ ఏటికాయేడు పెరుగుతూనే ఉంది. ఒకప్పుడు పెరటితోటలకే పరిమితమైన బొప్పాయి సాగు, ఇంత ప్రాధాన్యం పెరగటానికి ప్రధాన కారణం అధిక దిగుబడినిచ్చే తైవాన్ రకాలని చెప్పవచ్చు.
బూడిద గుమ్మడి ఎక్కువగా కొత్త ఇళ్లకు ముందు ఉట్టిలో వేలాడ గడుతారు. పాత ఇళ్లకు కూడ దిష్టి తగలకుండా ఇంటి ముందు వేళాడ గట్టతారు. బూడిద గుమ్మడిని వడియాలు పెట్టడానికి, కొన్ని రకాల తీపి పదార్థాలు చేయడానికి వాడతారు. అరుదుగా కూరలలో కూడ వాడతారు.
సొర పంటకు ఆశించే చీడపీడలను తక్కువ ఖర్చుతోనే నిర్మూలించవచ్చు . అయితే పంట ఎదుగుదల, పూత, కాత సమయంలో సమయానుకూలంగా ఎరువులు, నీటితడులు అందించాల్సి ఉంటుంది. దీన్నే తూచాతప్పకుండా పాటించారు రైతు.
ఈమధ్య కాలంలో ప్రోట్రేలలో నారుపెంపక విధానం అమిత ఆదరణ పొందుతోంది. అందుకే చాలా ప్రాంతాల్లో కొందరు రైతులు షేడ్ నెట్ ల క్రింద ప్రోట్రేలలో నారుపెంచి రైతులకు అందిస్తున్నారు.
పెసర దాదాపు లక్ష హెక్టార్లలో సాగవుతుంది. వివిధ ప్రాంతాల్లో ఆయా సమయానికి అనువైన రకాలను రైతులు ఎన్నుకోవాలి. పెసరలో ఏడాది పొడవున వేసుకునే రకాలు కూడా ఉన్నాయి.