Cultivation of Ash Gourd : అధిక లాభాలు పండిస్తున్న.. బూడిద గుమ్మడిసాగు

బూడిద గుమ్మడి ఎక్కువగా కొత్త ఇళ్లకు ముందు ఉట్టిలో వేలాడ గడుతారు. పాత ఇళ్లకు కూడ దిష్టి తగలకుండా ఇంటి ముందు వేళాడ గట్టతారు. బూడిద గుమ్మడిని వడియాలు పెట్టడానికి, కొన్ని రకాల తీపి పదార్థాలు చేయడానికి వాడతారు. అరుదుగా కూరలలో కూడ వాడతారు.

Cultivation of Ash Gourd : అధిక లాభాలు పండిస్తున్న.. బూడిద గుమ్మడిసాగు

Cultivation of Ash Gourd

Updated On : November 14, 2023 / 3:16 PM IST

Cultivation of Ash Gourd : ఆ ప్రాంతం కరువు కాటకాలకు పెట్టింది పేరు.. వర్షాలు పడితే కానీ పంటలు పండే పరిస్థితి లేదు.. అయితే గత రెండు ఏళ్లుగా పంటలు చేతికి వచ్చే సమయానికి అధిక వర్షాలు కురవడంతో తీవ్రంగా నష్టపోయారు ఇక్కడి రైతులు. కానీ ఓ రైతు మాత్రం ఈ విపత్తులనుండి బయట పడేందుకు తక్కువ పెట్టుబడితో, తక్కువ సమయంలో పంట చేకొచ్చే బూడిదగుమ్మడిని సాగుచేశారు. మంచి దిగుబడి వచ్చింది. మార్కెట్ లో అధిక ధర పలకడంతో లాభాలను పొందారు. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడా..? ఆరైతు ఎవరని తెలుసుకోవాలంటే ఈస్టోరీ చూడాల్సిందే..

READ ALSO : Eating Papaya : బొప్పాయి తినక ముందు, తిన్న తరువాత ఈ ప్రొటీన్ ఆహారాలను తినకపోవటమే మంచిది !

బూడిద గుమ్మడి ఎక్కువగా కొత్త ఇళ్లకు ముందు ఉట్టిలో వేలాడ గడుతారు. పాత ఇళ్లకు కూడ దిష్టి తగలకుండా ఇంటి ముందు వేళాడ గట్టతారు. బూడిద గుమ్మడిని వడియాలు పెట్టడానికి, కొన్ని రకాల తీపి పదార్థాలు చేయడానికి వాడతారు. అరుదుగా కూరలలో కూడ వాడతారు. ముఖ్యంగా పండుగల వేళ దీనికి మార్కెట్ లో డిమాండ్ అధికం. ఒక్కో కాయ 100 రూపాయలనుండి 150 వరకు పలుకుతుంది. దీన్నే ఆసరాగా చేసుకొని పచ్చిమగోదావరి జిల్లా, కొమరోలు మండలం, పామూరు పల్లి గ్రామానికి చెందిన రైతు అంబవరపు రమణారెడ్డి ప్రయోగాత్మకంగా సాగుచేసి విజయం సాధించారు.

READ ALSO : Best Fruits For Diabetes : మధుమేహ వ్యాధిగ్రస్తులు పండ్లు తినటం మంచిదేనా ? తినాల్సిన 10 ఉత్తమ పండ్ల రకాలు ఇవే !

రైతు రమణారెడ్డి అందరిలాగే అరటి, బొప్పాయి, పసుపు లాంటి ఉద్యాన పంటలు సాగుచేసేవారు. అయితే సాగులో పెరిగిన పెట్టుబడులు.. తగ్గిన దిగుబడులకు తోడు.. అప్పుడప్పుడు ప్రకృతి వైపరిత్యాల వల్లతీవ్రంగా నష్టంపోయేవారు. ఈ సమస్యలనుండి అధిగమించేందుకు బూడిద గుమ్మడిని ఎంచుకొని కందిలో అంతర పంటగా సాగు చేశారు. అతి తక్కువ పెట్టుబడి, అతి తక్కువ సమయంలో మంచి దిగుబడి రావడంతో జూన్ చివరిలో 2 ఎకరాల్లో ప్రధాన పంటగా సాగుచేశారు. దిగుబడి దసరాకు వచ్చింది. మార్కెట్ లో టన్ను ధర రూ.11 వేల వరకు పలకడంతో ఎకరాకు లక్షరూపాయల ఆదాయం పొందారు. దీంతో ఇప్పుడు మరో 15 ఎకరాల్లో ప్రధాన పంటగా సాగుచేస్తున్నారు. ఈ రైతుకు వచ్చి లాభాలను చూసి చుట్టుప్రక్కల రైతులు కూడా బూడిద సాగు చేస్తున్నారు.