Home » police investigation
కొంత స్థలం అమ్ముడు పోయిన తర్వాత తనకు రూ.4 లక్షలు ఇవ్వకపోతే శాపం తగులుతుందని మహిళను బాబా బెదిరించారు. బాబా వేధింపులు పెరగడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు.
కారు అదుపు తప్పి ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది. దీంతో పార్కింగ్ స్థలంలో నిలిపి ఉంచిన ఎనిమిది వాహనాలను కారు ఢీకొట్టడంతో ఆ వాహనాలు ధ్వంసం అయ్యాయి. అయితే పార్కింగ్ స్థలంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
మణిరాజ్ పాస్ పోర్టు కార్యాలయానికి వెళ్లి పాస్ పోర్టు రెన్యూవల్ చేసుకుని మణికొండ అలకాపూర్ టౌన్ షిప్ రోడ్ నెంబర్ 20లోని సిద్ధార్థ రెసిడెన్సీలో ఉంటున్న మిత్రుడు కొత్త చాణక్య ఇంటికి వెళ్లాడు. శనివారం ఇతర మిత్రులతో కలిసి వెస్ట్ మారేడ్ పల్లిలోన�
95వ వార్డులో వెంకటేష్ అనే యువకుడు వాలంటీర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. వరలక్ష్మీ అనే 72 ఏళ్ల వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు అపహరించేందుకు ప్రయత్నించిన వాలంటీర్.. ఆ క్రమంలో ఆమెను హత్య చేశాడు.
మహాలక్ష్మి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలిస్తున్నారు. అంతేకాక మహాలక్ష్మితో శ్రీనివాస్ ఫోన్ సంభాషణ, వాట్సాఫ్ చాటింగ్‌పై పోలీసులు దృష్టి సారించారు.
చనిపోయే ముందురోజు రాత్రి బర్త్ డే పార్టీ అయ్యాక 10 గంటల ప్రాంతంలో జీవన్ స్నేహితుడి వద్ద బైక్ తీసుకుని వెళ్లాడు. తెల్లవారేసరికి పెద్దపులిపాక పొలాల్లో కాలిన స్థితిలో శవమై కనిపించాడు.
ఈ కాల్పుల్లో అక్కడే ఉన్న స్థానిక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆమెను వెంటనే ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
దేశం నుంచి అన్ని రకాల ఉగ్రవాద మూలాలను నిర్మూలించడానికి సమగ్ర కార్యాచరణ ప్రారంభించినట్లు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటించిన రెండు రోజులకే ఈ పేలుడు సంభవించడం శోచనీయం.
పాఠశాలలో సైన్స్ టీచర్ గా పని చేస్తున్న బంద్యప్పను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతని ఫోన్ నుంచి బయటకు వచ్చినట్లు పేపర్ బయటికి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. బంద్యప్ప ఫోన్ ను స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు.
గుర్తు తెలియని వ్యక్తి తనకు బ్యాగ్ ఇచ్చి విజయవాడలో అందజేయాలని చెప్పారని పోలీసులకు బస్సు డ్రైవర్ చెప్పారు. ప్రస్తుతం డ్రైవర్ టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్నారు.