Visakha Accident : విశాఖలో అర్ధరాత్రి మద్యం మత్తులో మహిళ ర్యాష్ డ్రైవింగ్.. 8 వాహనాలను ఢీకొట్టిన ఇన్నోవా కారు

కారు అదుపు తప్పి ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది. దీంతో పార్కింగ్ స్థలంలో నిలిపి ఉంచిన ఎనిమిది వాహనాలను కారు ఢీకొట్టడంతో ఆ వాహనాలు ధ్వంసం అయ్యాయి. అయితే పార్కింగ్ స్థలంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

Visakha Accident : విశాఖలో అర్ధరాత్రి మద్యం మత్తులో మహిళ ర్యాష్ డ్రైవింగ్.. 8 వాహనాలను ఢీకొట్టిన ఇన్నోవా కారు

Visakha Road Accident

Visakha Road Accident : విశాఖలో అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి మద్యం మత్తులో డ్రైవింగ్ చేసిన ఓ మహిళ(Woman Rash Driving) వీఐపీ రోడ్డులో హల్ చల్ చేసింది. ఇన్నోవా కారును(Innova Car) డ్రైవ్ చేసిన ఆమె అతి వేగంతో ఇతర వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో 8 వాహనాలు ధ్వంసం అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆమెతోపాటు కారులో ప్రయాణిస్తున్న వారు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు(Police Registered Case)  చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

విశాఖలోని వీఐపీ రోడ్డులో సోమా రెస్టో బార్ అండ్ రెస్టారెంట్ లో మహిళతోపాటు మరి కొంతమంది యువకులు ఫుల్ గా మద్యం సేవించారు. అక్కడి పార్కింగ్ స్థలం నుంచి వీఐసీ రోడ్డులోని సిరిపురం వెళ్లే మార్గంలో కారులో వేగంగా దూసుకొచ్చారు. ఈ క్రమంలో కారు అదుపు తప్పి ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది. దీంతో పార్కింగ్ స్థలంలో నిలిపి ఉంచిన ఎనిమిది వాహనాలను కారు ఢీకొట్టడంతో ఆ వాహనాలు ధ్వంసం అయ్యాయి. అయితే పార్కింగ్ స్థలంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

Manipur : మణిపూర్‌లో 3 నెలల్లో 30 మంది అదృశ్యం..6వేల జీరో ఎఫ్ఐఆర్‌లు

అక్కడ ఫుడ్ రెస్టారెంట్లు, షాపింగ్ దుకాణాలు ఉండటంతో అనేక మంది రాకపోకలు కొనసాగిస్తుంటారు. దాదాపు రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఒక్కసారిగా కారు ఢీకొట్టడంతో భారీ శబ్ధం వచ్చింది. ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఒక్కసారిగా ప్రజలు గుమిగూడడంతో కారులో ఉన్న వారంతా భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు.

వెంటనే అక్కడికి వేరే కారు రావడంతో అందులో వారంతా పరారయ్యారు. అయితే కారు ఎవరు డ్రైవ్ చేశారు? ఆ సమయంలో కారులో ఎంత మంది ఉన్నారు? వారు ఎక్కడి నుంచి వచ్చారు? కారులో ఉన్న వారు ఎవరు? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అక్కడ ఉన్న సీసీ కెమెరా పుటేజీతోపాటు రెస్టో బార్ కు సంబంధించిన పుటేజీని కూడా పరిశీలిస్తున్నారు. వారిని సాధ్యమైనంత తొందరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.