Software Engineer Died : అమెరికా నుంచి పాస్ పోర్టు రెన్యూవల్ కోసం వచ్చి.. గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి

మణిరాజ్ పాస్ పోర్టు కార్యాలయానికి వెళ్లి పాస్ పోర్టు రెన్యూవల్ చేసుకుని మణికొండ అలకాపూర్ టౌన్ షిప్ రోడ్ నెంబర్ 20లోని సిద్ధార్థ రెసిడెన్సీలో ఉంటున్న మిత్రుడు కొత్త చాణక్య ఇంటికి వెళ్లాడు. శనివారం ఇతర మిత్రులతో కలిసి వెస్ట్ మారేడ్ పల్లిలోని వినాయకుడు, జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ గుడిని దర్శించుకున్నాడు.

Software Engineer Died : అమెరికా నుంచి పాస్ పోర్టు రెన్యూవల్ కోసం వచ్చి.. గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి

Software engineer died

Updated On : July 31, 2023 / 11:36 AM IST

Software Engineer Died Of Heart Attack : హైదరాబాద్ లో విషాదం నెలకొంది. పాస్ పోర్టు రెన్యూవల్ కోసం అమెరికా నుంచి నగరానికి వచ్చిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గుండెపోటుతో మృతి చెందాడు. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి పాస్ పోర్టు రెన్యూవల్ కోసం నగరానికి వచ్చి మిత్రుడి ఇంట్లో బాత్ రూంలో గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సంఘటన అలకాపూర్ టౌన్ షిప్ లో ఆదివారం చోటు చేసుకుంది.

నార్సింగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ పట్టణానికి చెందిన త్రిపురాడి మణిరాజ్ (30) అనే వ్యక్తి అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. పాస్ పోర్టు రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉండటంతో ఇటీవలే తన స్వస్థలం వరంగల్ కు వచ్చాడు. మణిరాజ్ తండ్రి నవీన్ కుమార్ శుక్రవారం అతడిని ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద దింపి తిరిగి వరంగల్ కు వెళ్లిపోయాడు.

Pakistan : దేశం దాటి వచ్చిన మరో ప్రేయసి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ .. షాకిచ్చిన పోలీసులు

మణిరాజ్ పాస్ పోర్టు కార్యాలయానికి వెళ్లి పాస్ పోర్టు రెన్యూవల్ చేసుకుని మణికొండ అలకాపూర్ టౌన్ షిప్ రోడ్ నెంబర్ 20లోని సిద్ధార్థ రెసిడెన్సీలో ఉంటున్న మిత్రుడు కొత్త చాణక్య ఇంటికి వెళ్లాడు. శనివారం ఇతర మిత్రులతో కలిసి వెస్ట్ మారేడ్ పల్లిలోని వినాయకుడు, జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ గుడిని దర్శించుకున్నాడు. అనంతరం రాత్రి ఓ పబ్ కు వెళ్లి ఆలస్యంగా తిరిగి అలకాపూర్ లోని మిత్రుని ఇంటికి వచ్చాడు.

ఆదివారం ఉదయం చాణక్యకు ఆపార్ట్ మెంట్ సభ్యుల సమావేశం ఉండటంతో మిత్రుడిని నిద్ర లేపకుండానే కిందకు వెళ్లాడు. తిరిగి 11:30 గంటల సమయంలో వచ్చి చూస్తే గదిలో మణిరాజ్ కనిపించలేదు. బాత్ రూం డోర్ కొట్టినా తీయలేదు. దాంతో వాచ్ మెన్, తన బంధువు సహకారంతో బాత్ రూం డోర్ ను తెరిచి చూడగా అందులో మణిరాజ్ అపస్మారక స్థితిలో కనిపించాడు.

Veg-Non Veg At IIT Bombay : ఇక్కడ శాకాహారులే మాత్రమే కూర్చోవాలి .. బాంబే ఐఐటీలో వెజ్-నాన్ వెజ్ వివాదం

వెంటనే 108కు ఫోన్ చేయగా వారు వచ్చి అతను గుండెపోటుతో అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. మణిరాజ్ తండ్రి నవీన్ కుమార్ కు సమాచారం ఇచ్చారు. అతను నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.