Vijayawada Btech Student: జీవన్ మృతి కేసులో కొత్త మలుపు.. పెద్దపులిపాక వరకు ఎందుకెళ్లినట్లు..?
చనిపోయే ముందురోజు రాత్రి బర్త్ డే పార్టీ అయ్యాక 10 గంటల ప్రాంతంలో జీవన్ స్నేహితుడి వద్ద బైక్ తీసుకుని వెళ్లాడు. తెల్లవారేసరికి పెద్దపులిపాక పొలాల్లో కాలిన స్థితిలో శవమై కనిపించాడు.

Btech Student Death Case
Vijayawada Btech Student: విజయవాడ బీటెక్ విద్యార్థి జమ్మలమూడి జీవన్ (21) మృతి కేసు కొత్త మలుపు తిరిగింది. విచారణలో.. ప్రాథమికంగా సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం EMI కట్టమని తండ్రి ఇచ్చిన 12 వేలను జీవన్ వాడుకున్నాడు. దీంతో తండ్రి మందలించాడు. తండ్రి మందలింపుతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉంటాడా అని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల విచారణలో జీవన్ ఫోన్ చేసి నేను మీకు ఇకపై భారం కానని చెప్పినట్లు తల్లి తెలిపింది. ఐ థింక్ థిస్ ఈజ్ మై లాస్ట్ డే అంటూ చనిపోయే కొద్ది గంటల ముందే జీవన్ స్టేటస్ పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాక, బంక్‌లో పెట్రోల్ కొని, బైక్ పై ఒంటరిగా వెళ్తున్నట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలను పోలీసులు సేకరించారు. అయితే, జీవన్ కు ఏమైనా ప్రేమ వ్యవహారాలు ఉన్నాయా అని అతని స్నేహితులను పోలీసులు ఆరాతీశారు. ఎలాంటి ప్రేమ వ్యవహారము లేదని స్నేహితులు తెలిపారు.
Golden Temple: గోల్డెన్ టెంపుల్ వద్ద మరో పేలుడు.. ఐదు రోజుల్లో మూడో సారి ..! భయాందోళనలో స్థానికులు
పెద్దపులిపాక ఎందుకెళ్లినట్లు..?
చనిపోయే ముందురోజు రాత్రి బర్త్ డే పార్టీ అయ్యాక 10 గంటల ప్రాంతంలో జీవన్ స్నేహితుడి వద్ద బైక్ తీసుకుని వెళ్లాడు. తెల్లవారేసరికి పెద్దపులిపాక పొలాల్లో కాలిన స్థితిలో శవమై కనిపించాడు. జీవన్ అసలు పెద్ద పులిపాక వైపు ఎందుకు వెళ్లారని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి, ఇప్పటి వరకు స్నేహితులని, కుటుంబ సభ్యులని విచారించారు. ఆత్మహత్య, హత్య అనే కోణంలో ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా పెద్దపులిపాక వరకు జీవన్ ఎందుకు వెళ్ళాడు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Kerala Couple: భార్యాభర్తల మధ్య గొడవకు కారణమైన సీసీ కెమెరా..! జైలుకెళ్లిన భర్త
జీవన్ విజయవాడలోని పొట్టి శ్రీరాములు ఇంజినీరింగ్ కళాశాలలో థర్డ్ ఇయర్ బీటెక్ చదువుతున్నాడు. తల్లిండ్రులు నాగమణి, సుధాకర్. వీరి స్వగ్రామం తోట్ల వల్లూరుపాలెం. వీరు కొంతకాలం కిందట నగరంలోని క్రీస్తురాజపురం వచ్చి ఉంటున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. సుధాకర్ అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ గా పనిచేస్తున్నాడు. కొడుకు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.