5G in India : ఇండియాలోకి 5G ఎంట్రీ.. దేశంలో ఏయే నగరాల్లో ముందుగా 5G సర్వీసులు రానున్నాయో తెలుసా?

5G in India : భారత్‌లో 5G నెట్‌వర్క్ ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు (శనివారం) భారత మార్కెట్లో 5G సర్వీసులను ప్రారంభించారు. తద్వారా మోదీ దేశంలో నెక్స్ట్ జనరేషన్ నెట్‌వర్క్ వినియోగానికి నాంది పలికారు. అయితే, 5G సర్వీసులు ఒకేసారి అందరికి అందుబాటులోకి రావని గమనించాలి.

5G in India : ఇండియాలోకి 5G ఎంట్రీ.. దేశంలో ఏయే నగరాల్లో ముందుగా 5G సర్వీసులు రానున్నాయో తెలుసా?

5G in India _ Which cities will get it first in the country

5G in India : భారత్‌లో 5G నెట్‌వర్క్ ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు (శనివారం) భారత మార్కెట్లో 5G సర్వీసులను ప్రారంభించారు. తద్వారా మోదీ దేశంలో నెక్స్ట్ జనరేషన్ నెట్‌వర్క్ వినియోగానికి నాంది పలికారు. అయితే, 5G సర్వీసులు ఒకేసారి అందరికి అందుబాటులోకి రావని గమనించాలి. కేవలం దేశంలో 5G సర్వీసులను మాత్రమే ప్రారంభించారు. అంటే.. ముందుగా కొన్ని ప్రధాన నగరాల్లోనే 5G సర్వీసులను అందుబాటులోకి రానున్నాయి.

దశలవారీగా దేశంలోని అన్ని పట్టణ, గ్రామీ ప్రాంతాల్లోకి 5G సర్వీసులు (5G Services in India) అందుబాటులోకి రానున్నాయి. భారత్‌లో మొట్టమొదటిగా 5G సర్వీసులు 13 ప్రధాన నగరాల్లో అందుబాటులోకి రానున్నాయి. అందులో అహ్మదాబాద్ , బెంగళూరు, చండీగఢ్ , చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్ , జామ్‌నగర్, కోల్‌కతా, లక్నో, ముంబై, పూణే వంటి నగరాలు ఉన్నాయి.

5G in India _ Which cities will get it first in the country

5G in India _ Which cities will get it first in the country

దేశంలో మిగిలిన నగరాలు, పట్టణాలు, గ్రామాలు రాబోయే నెలల్లో దశలవారీగా నెక్స్ట్ జనరేషన్ నెట్‌వర్క్‌ యాక్సస్ పొందే అవకాశం ఉంది. రెండు లేదా మూడు ఏళ్లల్లో 5G నెట్‌వర్క్ మొత్తం భారత్ అంతటా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 5G సర్వీసులు అందుబాటులోకి వస్తే.. దేశంలో 5G ద్వారా మీ డౌన్‌లోడ్‌లను వేగవంతం చేసుకోవచ్చు. అంతేకాదు.. క్లౌడ్ గేమింగ్ (Cloud Gaming) నుంచి ఆటో ఆపరేటింగ్ వాహనాల వరకు అనేక కొత్త వినియోగ డివైజ్‌లకు అత్యంత వేగంగా డేటాను యాక్సస్ చేసుకోవచ్చు.

అయితే, Airtel, Reliance Jio, Vodafone Idea (Vi) వంటి టెలికాం ప్రొవైడర్‌లు ఈ 13 నగరాల్లో దశలవారీగా 5G సర్వీసులను అందుబాటులోకి తీసుకురావచ్చు. అంటే మీరు ఈ ప్రాంతాల్లో ఒకదానిలో నివసిస్తుంటే.. మీరు 5G సర్వీసులను ఉపయోగించుకోవడానికి ఇంకా కొంత సమయం పట్టవచ్చు. ముందుగా ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై వంటి ముఖ్య నగరాల్లో 5G సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది దీపావళి నాటికి ఈ నగరాల్లో 5G ప్లాన్‌లను ప్రారంభించనున్నట్టు రిలయన్స్ జియో ధృవీకరించింది.

5G in India _ Which cities will get it first in the country

5G in India _ Which cities will get it first in the country

వచ్చే డిసెంబర్ 2023 నాటికి అన్ని జిల్లాలకు 5Gని అందిస్తామని వెల్లడించింది. Jio 5G దీపావళి నాటికి (అక్టోబర్ 23-24 తేదీలలో) అందుబాటులోకి వస్తుందని జియో పేర్కొంది. జియో 5G సర్వీసులను మొట్టమొదటగా దేశ రాజధాని నగరమైన ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబైలలో లాంచ్ చేయనన్నట్టు పేర్కొంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : 5G Official in India : ఇండియాకు 5G వచ్చేసిందోచ్.. జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ యూజర్లకు 5G సర్వీసులు ఎప్పటినుంచంటే?