Whatsapp Translate Message : వాట్సాప్‌లో మెసేజ్ పంపే ముందు మీకు నచ్చిన భాషలో ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

Whatsapp Translate Message : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) తమ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది.

Whatsapp Translate Message : వాట్సాప్‌లో మెసేజ్ పంపే ముందు మీకు నచ్చిన భాషలో ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

Whatsapp Translate Message _ A step by step guide to translate a message on WhatsApp before sending

Whatsapp Translate Message : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) తమ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే అనేక ఫీచర్లను తీసుకొచ్చిన వాట్సాప్.. మరో అద్భుతమైన ఫీచర్ అందుబాటులోకి తీసుకొస్తోంది. లేటెస్టుగా వాట్సాప్ తమ యూజర్ల కోసం అనేక భాషల్లోని మెసేజ్‌లను అర్థం చేసుకునేందుకు యూజర్లకు సాయపడే ఇంటర్నల్ ట్రాన్సలేషన్ ఫీచర్‌ను అందిస్తుంది. వాట్సాప్ అప్లికేషన్‌లో ట్రాన్సులేట్ ఫీచర్ ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

* వాట్సాప్ చాట్ ఓపెన్ చేసి.. లేటెస్ట్ మెసేజ్ టైప్ చేయండి.
* ఇప్పుడు మెనూ కనిపించే వరకు మెసేజ్‌పై లాంగ్ ప్రెస్ చేయండి.
* మెను నుండి ‘More’ ఎంచుకోండి.
* ఇప్పుడు కనిపించే Translate ఆప్షన్ ఎంచుకోండి.
* ట్రాన్సులేట్ మెసేజ్ చూపే పాప్-అప్ విండో కనిపిస్తుంది.

Read Also : WhatsApp Big Update : వాట్సాప్‌లో బిగ్ అప్‌డేట్.. ఇకపై హై-క్వాలిటీ ఫొటోలను ఈజీగా షేర్ చేయొచ్చు..!

వాట్సాప్‌లో మెసేజ్ ప్రైమరీ భాషకు ట్రాన్సులేట్ అయ్యే మెసేజ్ లాంగ్వేజ్‌ను యూజర్లు ఎంచుకోవచ్చు. ఫోటో షేరింగ్, మెసేజింగ్ యాప్ Instagram యూజర్ల కోసం ఇటీవల కొత్త ఫీచర్‌ను ప్రకటించింది. క్వైట్ మోడ్ అనే ఫీచర్, స్నేహితులు, ఫాలోవర్లను నిర్ణయించుకోవడానికి యూజర్లను ప్రోత్సహించడంలో సాయపడవచ్చు. కొత్త ఫీచర్‌తో, ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు ప్లాట్‌ఫారమ్‌లో యాక్టివ్‌గా లేరని ఫాలోవర్లను హెచ్చరించడానికి అకౌంట్ స్టేటస్ ‘ఇన్ క్వైట్ మోడ్’కి సెట్ చేసుకోవచ్చు.

Whatsapp Translate Message _ A step by step guide to translate a message on WhatsApp before sending

Whatsapp Translate Message _ A step by step guide to translate a message

టీనేజ్ యూజర్లు తమ స్క్రీన్ సమయాన్ని తగ్గించుకునేలా ప్రోత్సహించడానికి కొత్త ఫీచర్‌ని లక్ష్యంగా చేసుకున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ తెలిపింది. మీరు మీ షెడ్యూల్‌కు సరిపోయేలా మీ క్వైట్ మోడ్ గంటలను సులభంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫీచర్ ఆఫ్ చేసిన తర్వాత నోటిఫికేషన్‌లను చూడవచ్చు. మీరు అకౌంట్ ‘నిశ్శబ్ద మోడ్‌లో’ సెట్ చేయాలనే కొత్త ఫీచర్‌ను ప్రారంభించవచ్చు. మీ స్మార్ట్‌ఫోన్‌లో Instagram యాప్ లేటెస్ట్ వెర్షన్‌ను అమలు చేస్తున్నారని నిర్ధారించుకోండి.

ఇన్‌స్టాగ్రామ్‌లో క్వైట్ మోడ్‌ని ఎనేబుల్ చేయాలంటే? :

* మీ స్మార్ట్‌ఫోన్‌లో Instagram యాప్‌ని ఓపెన్ చేయండి.
* మీ ప్రొఫైల్ ఐకాన్‌పై Tap చేయండి.
* ఆ తర్వాత, మీ స్క్రీన్ కుడి ఎగువ మూలలో ఉన్న 3 బార్‌లపై Tap చేయండి.
* ఇక్కడ, సెట్టింగ్‌లను ఎంచుకుని, నోటిఫికేషన్‌లపై Tap చేయండి.
* ఇప్పుడు, క్వైట్ మోడ్‌ని ఎనేబుల్ చేసేందుకు నోటిఫికేషన్‌లపై Tap చేసి టోగుల్‌ని On చేయండి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp Group Admins : ఆపిల్ ఐఫోన్లలో వాట్సాప్ గ్రూపు అడ్మిన్ల కోసం కొత్త షార్ట్‌కట్స్.. ఇప్పుడే అప్‌డేట్ చేసుకోండి!