Apple iOS 17 Beta : ఆపిల్ ఐఓఎస్ 17 బీటా.. ఈ పాపులర్ ఐఫోన్లలో పనిచేయదట.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి..!

Apple iOS 17 Beta : ఆపిల్ ఐఫోన్ iOS 17 లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ వచ్చింది. (Apple iOS 17) పొందడానికి అర్హత ఉన్న ఐఫోన్‌ల జాబితాను కూడా వెల్లడించింది. అయితే, ఆ జాబితాలో 3 పాపులర్ ఐఫోన్ మోడల్స్ మాత్రం లేవు. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి..

Apple iOS 17 Beta : ఆపిల్ ఐఓఎస్ 17 బీటా.. ఈ పాపులర్ ఐఫోన్లలో పనిచేయదట.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి..!

Apple iOS 17 Beta released, But these 3 popular iPhones won't get the Update

Apple iOS 17 Beta Release : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ జూన్ 5న (WWDC 2023)లో సరికొత్త ప్రకటనలను వెల్లడించింది. ఈ సందర్భంగా కంపెనీ CEO టిమ్ కుక్ కొత్త ప్రొడక్టులపై అనేక ప్రకటనలు చేశారు. లేటెస్ట్ iOS సాఫ్ట్‌వేర్ నుంచి మల్టీ హార్డ్‌వేర్ ప్రొడక్టుల వరకు కంపెనీ మొట్టమొదటి మిశ్రమ రియాలిటీ హెడ్‌సెట్ విజన్ ప్రోగా పిలుస్తోంది. ఇప్పుడు, iOS 17తో, ఆపిల్ చాలా కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది.

కానీ, iOS 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై మరిన్ని అప్‌డేట్స్ ప్రకటించింది. iOS 17 పొందడానికి అర్హత ఉన్న ఐఫోన్‌ల జాబితాను కూడా కంపెనీ వెల్లడించింది. ఆ జాబితాలో 3 పాపులర్ ఐఫోన్ మోడల్‌లను జాబితాను రివీల్ చేసింది. ఆపిల్ అధికారిక జాబితా ప్రకారం.. ఆపిల్ (iPhone Xs) తదుపరి మోడల్‌లు iOS 17 అప్‌డేట్ పొందవచ్చు. iOS 17కి అప్‌డేట్ చేయని 3 పాపులర్ ఐఫోన్ మోడల్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Read Also : Apple WWDC 2023 Updates : ఆపిల్ ఐఓఎస్ 17 వెర్షన్ ఇదిగో.. ఈ ఐఫోన్లలో కొత్త ఫీచర్లు తీసుకొచ్చింది.. ఇప్పుడే చెక్ చేసుకోండి!

ఆపిల్ లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ నుంచి కొన్ని మోడళ్లను పక్కన పెట్టేసింది. ఆపిల్ డివైజ్ రిలీజ్ తర్వాత 5 ఏళ్ల వరకు లేటెస్ట్ iOS అప్‌డేట్లను అందిస్తుంది. లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఈ మోడల్‌లను వదిలివేయడం అనేది ఆపిల్ ప్లాన్‌లో భాగమే. ఐఫోన్ X, ఐఫోన్ 8, 8 ప్లస్ 2017 ఏడాదిలో లాంచ్ అయ్యాయి. ఇప్పుడు, iOS 17 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అర్హత కలిగిన ఐఫోన్ మోడల్‌ (iPhone Xs) తర్వాత అన్ని మోడల్‌లు iOS 17 అప్‌డేట్‌ను అందుకుంటాయని కంపెనీ వెల్లడించింది.

Apple iOS 17 Beta released, But these 3 popular iPhones won't get the Update

Apple iOS 17 Beta released, But these 3 popular iPhones won’t get the Update

ప్రస్తుతం, ఆపిల్ iOS 17 బీటా అప్‌డేట్‌ను లాంచ్ చేసింది. అయితే, స్టేబుల్ అప్‌డేట్ ఈ ఏడాది చివరిలో లాంచ్ కానుంది. iOS 17 స్టేబుల్ అప్‌డేట్‌ను పొందే మొదటి ఐఫోన్ 15 సిరీస్ అని చెప్పవచ్చు. ఆపిల్ సంప్రదాయం ప్రకారం.. రాబోయే నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్ సిరీస్ 2023 చివరి నాటికి క్లారిటీ రానుంది. ఇకపోతే, iOS 17 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పొందే అర్హత కలిగిన ఐఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం.

* iPhone 14
* iPhone 14 Plus
* iPhone 14 Pro
* iPhone 14 Pro Max
* iPhone 13
* iPhone 13 mini
* iPhone 13 Pro
* iPhone 13 Pro Max
* iPhone 12
* iPhone 12mini
* iPhone 12 Pro
* iPhone 12 Pro Max
* iPhone 11
* iPhone 11 Pro
* iPhone 11 Pro Max
* iPhone XS
* iPhone XS Max
* iPhone XR
* iPhone SE (2వ జనరేషన్)

Read Also : Apple WWDC 2023 : ఆపిల్ విజన్ ప్రో.. ఇదో కొత్త రకం కంప్యూటర్.. కొత్త కంప్యూటింగ్ శకానికి నాంది అంటున్న సీఈఓ టిమ్ కుక్