Apple iPhone 13 Sale : ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. కేవలం రూ.6,999కే సొంతం చేసుకోండి.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!

Apple iPhone 13 Sale : ఆపిల్ ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్ 13పై అదిరిపోయే ఆఫర్ అందిస్తోంది. ప్రీమియం ఫ్లాగ్‌షిప్ డివైజ్ కొనుగోలు చేయాలనుకుంటే.. మీ బడ్జెట్‌లో ఆపిల్ ఐఫోన్ 13 బెస్ట్ ఫోన్ అని చెప్పవచ్చు.

Apple iPhone 13 Sale : ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. కేవలం రూ.6,999కే సొంతం చేసుకోండి.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!

Apple iPhone 13 available at Rs 6,999 in the Flipkart sale after 52,000 off, check details

Apple iPhone 13 Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? అయితే, మీకోసం ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ సేల్ (Flipkart Sale)లో అత్యంత సరసమైన ధరకే ఆపిల్ ఐఫోన్ 13 అందుబాటులో ఉంది. 2022లో భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్లలో ఐఫోన్ 13 ఒకటిగా నిలిచింది. అయితే, ఇప్పుడు (Apple iPhone 15) సెప్టెంబర్ 12న లాంచ్ కానుంది.

ఈ క్రమంలో ఐఫోన్ 13 భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఆపిల్ ఐఫోన్ 13 2021లో రూ. 79,900 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. గత ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో ఆపిల్ ఐఫోన్ 13పై మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ ఐఫోన్ అతి తక్కువ ధరలో అందుబాటులో ఉంది. ఐఫోన్ 13 ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 52 వేలు తగ్గింపు తర్వాత కేవలం రూ.6,999కే అందుబాటులో ఉంది.

Read Also : Apple iPhone 14 Pro : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 14 ప్రోపై భారీ తగ్గింపు.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి..!

ఆపిల్ ఐఫోన్ 13పై డిస్కౌంట్లు :
ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 10,901 తగ్గింపు తర్వాత ఐఫోన్ 13 రూ. 58,999 వద్ద లిస్టు అయింది. దీంతో పాటు, కొనుగోలుదారులు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ. 2వేలు తగ్గింపు పొందవచ్చు. దీంతో ఐఫోన్ 13 ధర రూ.56,999కి తగ్గింది. కొనుగోలుదారులు పాత స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా రూ. 50వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

Apple iPhone 13 available at Rs 6,999 in the Flipkart sale after 52,000 off, check details

Apple iPhone 13 available at Rs 6,999 in the Flipkart sale after 52,000 off, check details

అన్ని ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్‌లతో, కొనుగోలుదారులు ఐఫోన్ 13ని కేవలం రూ. 6వేలకే పొందవచ్చు. ఐఫోన్ 13పై కంపెనీ ఇప్పటికీ బ్యాక్ కెమెరా డిజైన్‌ను అందించింది. మీరు ప్రీమియం ఫ్లాగ్‌షిప్ లెవల్ డివైజ్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే.. మీ బడ్జెట్‌లో ఆపిల్ ఐఫోన్ 13 బెస్ట్ ఆప్షన్లలో ఒకటిగా చెప్పవచ్చు.

iPhone 13 మోడల్ 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. కంపెనీ ఫ్లాగ్‌షిప్ A15 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది. iPhone 13 ఫోన్ 4K డాల్బీ విజన్ HDR రికార్డింగ్‌తో 12MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. నైట్ మోడ్‌తో 12MP TrueDepth ఫ్రంట్ కెమెరాను కూడా అందిస్తుంది.

ఈ డివైజ్ 17 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఐఫోన్ 13 మోడల్.. ఐఫోన్ 14 మాదిరిగా దాదాపు అదే స్పెషిఫికేషన్లతో చాలా తక్కువ ధరకు అందిస్తుంది. మీరు ఐఫోన్ 13 కన్నా బడ్జెట్‌లో ప్రీమియం ఐఫోన్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఇదే బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Read Also : iPhone 15 Models : ఐఫోన్ లవర్స్‌కు అదిరే న్యూస్.. ఈ తేదీన ఐఫోన్ 15 సిరీస్ లాంచ్.. ఏకంగా 5 మోడల్స్.. ధర ఎంత, ఫీచర్లు ఇవేనా?