Apple Smart Bottles : ఆపిల్ సరికొత్త స్మార్ట్ వాటర్ బాటిల్స్.. ఇక డివైజ్లతో కనెక్టింగ్ ఈజీ.. ధర ఎంతంటే?
Apple Smart Bottles : టెక్ దిగ్గజం ఆపిల్ సరికొత్త స్మార్ట్ బాటిల్స్ ప్రవేశపెట్టింది. ఆపిల్ తన కంపెనీ వెబ్సైట్లో, అమెరికాలోని రిటైల్ స్టోర్లలో HidrateSpark పేరుతో రెండు స్మార్ట్ వాటర్ బాటిళ్లను అమ్ముతోంది.

Apple Smart Bottles : టెక్ దిగ్గజం ఆపిల్ సరికొత్త స్మార్ట్ బాటిల్స్ ప్రవేశపెట్టింది. ఆపిల్ తన కంపెనీ వెబ్సైట్లో, అమెరికాలోని రిటైల్ స్టోర్లలో HidrateSpark పేరుతో రెండు స్మార్ట్ వాటర్ బాటిళ్లను అమ్ముతోంది. ఆపిల్ హెల్త్ ద్వారా యూజర్లు వాటర్ ఎంత తీసుకున్నారో ట్రాక్ చేయొచ్చు.. అలాగే అన్ని ఆపిల్ డివైజ్‌లకు సింకరైజ్ చేసుకోవచ్చు. ఆపిల్ ఆన్ లైన్ స్టోర్లతో పాటు ఆఫ్ లైన్ స్టోర్లలోనూ ఈ స్మార్ట్ వాటర్ బాటిల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ వాటర్ బాటిళ్ల ద్వారా మీ ఆపిల్ స్మార్ట్ వాచ్‌తో సింకరైజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీ శరీరంలో జరిగే ప్రతి చర్యను రికార్డు చేస్తుంది.
రోజూ ఎంత మొత్తంలో నీళ్లను తీసుకుంటున్నారు, ఏ మాత్రం శారీరక శ్రమ చేస్తున్నారు వంటి అంశాలను పరిశీలిస్తుంది. ఆయా రికార్డులను రెడీ చేస్తుంది. ఈ డేటా ఆధారంగా ఎంత నీరు తీసుకోవాలి, ఎప్పుడూ తీసుకోవాలి అనే విషయాలను ఎప్పటికప్పుడూ తెలియజేస్తుంది. ఈ స్మార్ట్ వాటర్ బాటిల్‌ను HidrateSpark సంస్థ తయారు చేసింది. HidrateSpark App ద్వారా బ్లూటూత్ సాయంతో సింకరైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్మార్ట్ వాటర్ బాటిల్స్ రీఛార్జబుల్ బ్యాటరీతో పాటు ఛార్జింగ్ కేబుల్ కూడా అందిస్తుంది.

Apple Is Now Selling Two New Smart Water Bottles. How Much They Cost
HidrateSpark PRO, HidrateSpark Pro STEEL అనే రెండు వెర్షన్లలో స్మార్ట్ వాటర్ బాటిల్స్ అందుబాటులో ఉన్నాయి. HidrateSpark PRO బాటిల్ ధర రూ.4,500 (59.95 డాలర్లు)గా ఉండగా.. HidrateSpark Pro STEEL ధర రూ. 6,000 (79.95 డాలర్లు)గా ఉన్నాయి. 2014లో ప్రారంభమైన HidrateSpark.. స్మార్ట్ వాటర్ బాటిళ్లలో ప్రముఖంగా పాపులారిటీ సాధించింది. యూజర్లను ఆరోగ్యంగా ఉంచేందుకు HidrateSpark అందుబాటులోకి తెచ్చామని తెలిపింది. మీరు తాగే ప్రతి సిప్ కౌంట్ చేస్తుంది. మీకు ఎంత నీరు అవసరమో సైన్స్ ద్వారా నిర్ణయిస్తుంది. మీ ప్రొఫైల్, మీరు ఎక్కడ నివసిస్తున్నారు, మీరు ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన నీటి పరిమాణం ఎంత ఉండాలి అన్ని రికార్డు చేస్తుందని వ్యవస్థాపకుడు Ngoc Nguyen తెలిపారు.
Read Also : Google Search Mobile : గూగుల్ సెర్చ్‌లో మీ మొబైల్ నంబర్ కనిపిస్తుందా? వెంటనే డిలీట్ చేయండిలా..!
- Apple Search Engine : గూగుల్‌కు పోటీగా.. ఆపిల్ సొంత సెర్చ్ ఇంజిన్ వస్తోంది..!
- Apple Workers : పెరగనున్న ఆపిల్ ఉద్యోగుల జీతాలు.. ఎంతంటే?
- Apple India : భారత్‌కు యాపిల్ కంపెనీ!
- Apple Users : ఆపిల్ యూజర్లకు అలర్ట్.. జూన్ 1లోపు ఈ రెండింట్లోకి మారండి.. ఎందుకంటే?
- Google Play Store: యాపిల్ బాటలో గూగుల్.. ప్లే స్టోర్ నుంచి 9లక్షల యాప్‌లను తొలగించేందుకు చర్యలు
1Searching For Tiger: పులి ఎటు వెళ్లింది..? పులి జాడకోసం కొనసాగుతున్న వేట..
2Udaipur: ఉదయ్‌పూర్‌లో ఉద్రిక్తత.. ఆందోళనకారుల్ని అదుపు చేసిన పోలీసులు
3Andra pradesh : ప్రధాని పాల్గొనే అల్లూరి జయంతి వేడుకలకు రావాలని చంద్రబాబుకు మంత్రి కిష్టన్ రెడ్డి లేఖ
4Gopichand : పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ బిజినెస్.. హిట్ అవ్వాలంటే ఎంత రాబట్టలో తెలుసా??
5PAN-Aadhaar: పాన్‌కార్డ్-ఆధార్ లింక్‌కు నేడే చివరి రోజు.. లేకుంటే వెయ్యి జరిమానా
6Gas Problem: కడుపులో గ్యాస్ సమస్యగా మారిందా.. జాగ్రత్తలివే
7PM Modi: మోదీ బస చేసేది రాజ్‌భవన్‌లో కాదు.. ఎస్పీజీ సూచనలతో ప్లేస్ మార్చేశారు.. ఎక్కడంటే?
8Auto Catches Fire In AP : ఆటో ప్రమాదం పాపం ‘ఉడుత’దే..మా తప్పేమీ లేదు : ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ
9Amarnath Yatra: నేటి నుంచే అమర్నాథ్ యాత్ర.. రెండేళ్ల తర్వాత ప్రారంభం
10SSMB 29 : ప్యారిస్ ఫేమస్ 3డి యానిమేషన్ స్టూడియోలో రాజమౌళి.. మహేష్ సినిమా కోసమేనా??
-
Rheumatic Fever : చిన్నారుల గుండెపై ప్రభావం చూపే రుమాటిక్ ఫీవర్!
-
Jack Fruit : మధుమేహాన్ని నియంత్రణలో ఉంచే పనస పండు!
-
Aloo Bukhara : ఆలూ బుఖారాతో అనారోగ్యాలకు చెక్!
-
Academic Year Calendar : తెలంగాణ 2022-23 విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల
-
Uddhav Thackeray Resign : బలపరీక్షకు ముందే.. సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా
-
Nothing phone (1) : నథింగ్ ఫోన్ (1) ఫోన్ కొత్త ఫీచర్ అదిరిందిగా.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Rains : తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలు
-
TET Final Key : తెలంగాణ TET ఫైనల్ ‘కీ’ రిలీజ్