iPhone 14: దేశంలోనే తయారవుతున్న ఐఫోన్ 14.. మరి ధరలు తగ్గుతాయా?

ఐఫోన్ కొత్త మోడల్.. ఐఫోన్ 14 తయారీని ఇండియాలోనే ప్రారంభించింది యాపిల్. చెన్నై సమీపంలో ఉన్న శ్రీపెరుంబుదూర్‌లోని ఫాక్స్‪‌కాన్ ఫెసిలిటీ సెంటర్లో ఈ ఫోన్లు తయారు చేస్తోంది. మరి మన దేశంలోనే తయారవుతున్నాయి కాబట్టి, ఐఫోన్ 14 ధరలు తగ్గుతాయనుకుంటున్నారా?

iPhone 14: దేశంలోనే తయారవుతున్న ఐఫోన్ 14.. మరి ధరలు తగ్గుతాయా?

iPhone 14: యాపిల్ సంస్థ ఐఫోన్ 14 మోడల్ ఫోన్లను ఇండియాలోనే తయారు చేయడం ప్రారంభించింది. దేశీయంగానే ఫోన్లు తయారవుతుండటంతో ధరలు తగ్గుతాయా అనే సందేహం నెలకొంది. ఐఫోన్ 14 ఫోన్లు ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఫోన్లను చెన్నై సమీపంలో ఉన్న శ్రీపెరుంబుదూర్‌లోని ఫాక్స్‪‌కాన్ ఫెసిలిటీ సెంటర్లో తయారు చేయడం ప్రారంభించింది ఆ సంస్థ.

Himachal Pradesh: లోయలో పడ్డ టెంపో ట్రావెలర్.. ఏడుగురు మృతి.. పది మందికి గాయాలు

విస్ట్రన్, ఫాక్స్‪‌కాన్, పెగట్రాన్ అనే సంస్థలతో కలిసి యాపిల్ మన దేశంలో ఫోన్లను తయారు చేస్తోంది. ఇప్పటికే ఇక్కడ ఐఫోన్ 12, ఐఫోన్ 13, ఐఫోన్ ఎస్ఈ వంటి మోడళ్లు తయారయ్యాయి. తాజాగా ఐఫోన్ 14 ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. మన దేశంలోనే ఐఫోన్లు తయారవుతుండటంతో వీటి ధరలు తగ్గుతాయేమోనని చాలా మంది ఆశ. దీనికి కారణం ఉంది. మన దేశంలోకి దిగుమతి అయ్యే ఐఫోన్లపై దిగుమతి సుంకం ఎక్కువగా ఉండటం వల్ల వీటి ధరలు ఎక్కువగా ఉంటాయి. మన దేశంలో తయారవుతున్నాయి కాబట్టి.. వీటికి దిగుమతి సుంకం ఉండదు. అందువల్ల ధరలు తగ్గొచ్చని కొందరి నమ్మకం. కానీ, అలాంటి అవకాశాలు చాలా తక్కువే. ఎందుకంటే యాపిల్ సంస్థ సాధారణంగా అంత త్వరగా ధరల్ని తగ్గించదు. పైగా ఐఫోన్లు మన దేశలో తయారవుతున్నప్పటికీ ఇది అసెంబ్లింగ్ యూనిట్ మాత్రమే.

Rajasthan Congress: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు.. రాజస్థాన్ కాంగ్రెస్‌లో కలకలం.. అశోక్ గెహ్లాట్ వర్గ ఎమ్మెల్యేల రాజీనామా

ఇక్కడ తయారీకి కావాల్సిన ముడి సరుకు మన దగ్గర దొరకదు. విదేశాల నుంచి తెప్పించుకోవాల్సిందే. అందువల్లే మన దేశంలో వీటిని తయారు చేస్తున్నప్పటికీ, ఖర్చులేమీ తగ్గవు. ఈ నేపథ్యంలో ఇప్పట్లో ధరలు తగ్గే అవకాశం లేదు. అయితే, వివిధ బ్యాంకులు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌తో ఒప్పందం చేసుకుని, ఆఫర్స్, డిస్కౌంట్స్ రూపంలో తక్కువ ధరలోనే ఐఫోన్లను అందించే అవకాశం మాత్రం ఉంది. మరోవైపు యాపిల్ సంస్థ మొత్తం తయారు చేసే ఫోన్లలో 25 శాతం ఫోన్లను ఇండియాలోనే తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అది కూడా 2025కల్లా ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్ణయించుకుంది.