Metaverse : ఫేస్‌బుక్‌ చెప్పేదొకటి.. చేసేదొకటి, మెటా పేరును దొంగిలించింది!

ఫేస్‌బుక్‌ను వివాదాలు వెంటాడుతున్నాయి. అమెరికాలోని చికాగోకు చెందిన మెటా అనే టెక్ సంస్థ ఫేస్‌బుక్‌పై కోర్టుకు వెళ్లింది.

Metaverse : ఫేస్‌బుక్‌ చెప్పేదొకటి.. చేసేదొకటి, మెటా పేరును దొంగిలించింది!

Meta

Facebook Metaverse : ఫేస్‌బుక్‌ను వివాదాలు వెంటాడుతున్నాయి. అమెరికాలోని చికాగోకు చెందిన మెటా అనే టెక్ సంస్థ ఫేస్‌బుక్‌పై కోర్టుకు వెళ్లింది. సోషల్ నెట్‌వర్క్ ఫేస్‌బుక్ తన పేరును మెటాగా రీబ్రాండ్ చేసిందని.. అది తమ కంపెనీ పేరు అని కోర్టుకు తెలిపింది. ఫేస్‌బుక్‌ రీబ్రాండింగ్‌ సాకుతో మెటా పేరును దొంగిలించిందని ఆరోపించింది. ఈ మేరకు మెటా కంపెనీ వ్యవస్థాపకుడు నేట్‌ స్క్యూలిక్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.

Read More : Drug Case : ఆర్యన్ ఖాన్‌‌కు సమన్లు..మాలిక్ ఆరోపణలపై స్పందించిన NCB

ఫేస్‌బుక్‌ తన సంస్థను కొనుగోలు చేయడంలో విఫలం కావడంతో.. మీడియా శక్తిని ఉపయోగించి కనుమరుగు చేయాలని చూస్తోందని ఆరోపించారు. ఫేస్‌బుక్‌ ఎప్పుడూ చెప్పేదొకటి.. చేసేదొకటి ఉంటుందని విమర్శించారు. ఈ ప్రకటనను బహిరంగ వివరణగా భావించాలని ఆయన వెల్లడించారు.
మూడు నెలలుగా కంపెనీని చౌకగా విక్రయించాలని ఫేస్‌బుక్‌ లాయర్లు వెంటాడుతున్నారని నేట్‌ చెప్పారు. తాము ఫేస్‌బుక్‌ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలిపాడు.

Read More : Telangana : పోడు రగడకు ఇక చెక్..న్యాయంగా సాగు చేసుకుంటున్నారో వారికే ఆ భూములు

ఫేస్‌బుక్‌పై అవసరమైన చట్టపరమైన చర్యలను దాఖలు చేయాలని మెటా కంపెనీ నిర్ణయించిందన్నారు. ఫేస్‌బుక్, దాని ఆపరేటింగ్ అధికారులు తమ పట్ల మోసపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. వినియోగదారుల డేటా గోప్యతపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ గత నెలలో తన కంపెనీకి మెటా అనే కొత్త పేరు పెట్టనున్నట్లు ప్రకటించారు. ఫేస్‌బుక్‌తో పాటు కంపెనీకి చెందిన ఇతర సామాజిక మాధ్యమాలు ఇన్‌స్టాగ్రామ్‌, మెసేంజర్‌, వాట్సాప్‌ పేర్లలో ఎలాంటి మార్పు ఉండబోదని కంపెనీ తెలిపింది. ఫేస్‌బుక్‌కు చెందిన అన్ని కంపెనీలకు ‘మెటా’ మాతృసంస్థగా ఉండనుందన్నారు.