Jio Phone Next : జియో ఫోన్‌ ‘Pragati OS’ ఏంటి.. ఎలా పనిచేస్తుంది? ఫీచర్లు ఏమున్నాయంటే?

దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కొత్త స్మార్ట్ ఫోన్ తీసుకొస్తోంది. Jio Phone Next.. ఈ ఫోన్ ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్, రిలయన్స్ జియో భాగస్వామ్యంలో తీసుకొస్తున్నాయి.

Jio Phone Next : జియో ఫోన్‌ ‘Pragati OS’ ఏంటి.. ఎలా పనిచేస్తుంది? ఫీచర్లు ఏమున్నాయంటే?

First Look At Jiophone Next And Pragati Os

JioPhone Next : దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కొత్త స్మార్ట్ ఫోన్ తీసుకొస్తోంది. అదే.. Jio Phone Next.. ఈ ఫోన్ ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్, రిలయన్స్ జియో భాగస్వామ్యంలో తీసుకొస్తున్నాయి. ఈ జియో ఫోన్‌లో ఆండ్రాయిడ్ వెర్షన్ Pragati OSను డెవలప్ చేసినట్టు తెలిపాయి. మొదటగా ఈ జియో ఫోన్లలో ఎంట్రీ లెవల్ ఫోన్లలో వాడే ఆండ్రాయిడ్ లైట్ వెర్షన్ OS Android Go Editionతో రన్ చేయాలని కంపెనీలు భావించాయి. కానీ, ఆ తర్వాత Pragati OS డెవలప్ చేసినట్టు ప్రకటించాయి. ఇంతకీ ఈ ప్రగతి OS ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? ఇందులో ఏయే ఫీచర్లు ఉన్నాయో ఓసారి తెలుసుకుందామా? అసలు ఆండ్రాయిడ్ లైట్ వెర్షన్ కు ఈ ప్రగతి ఓఎస్ కు ఉన్న తేడాలేంటో కూడా తెలుసుకుందాం.. ఈ OS ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లలో రన్ అవుతుందా? లేదా అనేది ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఆండ్రాయిడ్ గో ఎడిషన్, ప్రగతి ఆపరేటింగ్ సిస్టమ్ పనితీరుకు సంబంధించి టెక్ నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

Android Go Edition :
ఈ ఆపరేటింగ్ సిస్టమ్.. ఎంట్రీ లెవల్ ఫోన్లలో వాడుతారు. గూగుల్ 2017లో ఈ OS తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్ లైట్ వెర్షన్ గా ఈ OS రిలీజ్ చేసింది గూగుల్. గూగుల్ ఆండ్రాయిడ్ OS కొత్త వెర్షన్ తీసుకొచ్చిన ప్రతిసారీ Android GO ఎడిషన్ కూడా ప్రవేశపెట్టింది. ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిషన్ రిలీజ్ కావడంతో మొబైల్ తయారీ కంపెనీలు కూడా తమ ఎంట్రీ లెవల్ ఫోన్ల తయారీపై ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే నోకియా, శాంసంగ్, అల్కాటెల్, లెనోవా, షావోమి, రెడ్మీ మొబైల్ దిగ్గజాలు కూడా ఆండ్రాయిడ్ గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తోనే ఎంట్రీ లెవల్ ఫోన్లను రిలీజ్ చేశాయి. ఇప్పుడు ఈ ఆండ్రాయిడ్ గో ఎడిషన్ లో కొన్ని మార్పులు చేసి.. జియో కొత్త ఫోన్ కోసం Pragati OS ఆపరేటింగ్ సిస్టమ్ ప్రవేశపెడుతున్నాయి.
LPG Price Hike : భారీగా పెరిగిన గ్యాస్ ధరలు.. సిలిండర్‌పై రూ.266 పెంపు!

Pragati OS :
రిలయన్స్ జియోలో గూగుల్ సంస్థలు సంయుక్తంగా JioPhone Next స్మార్ట్ ఫోన్ ప్రవేశపెట్టనున్నాయి. ప్రగతి ఓఎస్ కూడా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మాదిరిగానే యూజర్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని గూగుల్ పేర్కొంది. ప్రగతి OS భవిష్యత్తు మొత్తం.. ఆండ్రాయిడ్ గో ఎడిషన్ అత్యాధునిక వెర్షన్‌గా టెక్ నిపుణులు చెబుతున్నారు. ప్రగతి ఓఎస్ దాదాపు ఆండ్రాయిడ్ గో ఎడిషన్ మాదిరి ఫీచర్స్ అందించనుంది. ప్రగతి ఓఎస్ బ్యాటరీ చాలా తక్కువగా వినియోగించుకుంటుంది. అందుకే బ్యాటరీపై ఒత్తిడి తగ్గి ఛార్జింగ్ ఎక్కువసేపు వస్తుందని అంటోంది.


అయితే ఇప్పటివరకూ రిలయన్స్ లేదా గూగుల్.. ప్రగతి OS అనేది ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్‌గా ప్రకటించలేదు. జియో ఫోన్ నెక్స్ట్ లో దాదాపు ఆండ్రాడ్ గో ఎడిషన్ యాప్ మాత్రమే పనిచేస్తుందని ఓ నివేదిక వెల్లడించింది. జియో ఫోన్‌లో దాదాపు ఆండ్రాయిడ్ గో ఎడిషన్ యాప్ మాత్రమే ఉంటుందని తెలుస్తోంది. జియోఫోన్ నెక్స్ట్లో అన్ని గూగుల్, జియో యాప్స్ ఉంటాయని ఆయా సంస్థలు వెల్లడించాయి. గూగుల్ గో (Google Go), గూగుల్ అసిస్టెంట్ గో (Google Assistant Go), గ్యాలరీ గో (Gallery Go), కెమెరా గో (Camera Go) వంటి యాప్స్ అందుబాటులో ఉన్నాయి.

జియో ఫోన్ లోని అసిస్టెంట్ గో యాప్… 12 భారతీయ భాషల వరకు సపోర్ట్ చేస్తుందని గూగుల్ పేర్కొంది. జియో ఫోన్‌లో గూగుల్ లెన్స్ కూడా అందిస్తోంది. HDR, Night Mode, Protrait Mode ఫీచర్లు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. Pragati OS అనేది ఇతర ఫోన్లలో పనిచేస్తుందా లేదా అనేది స్పష్టత లేదు. ఈ ప్రగతి ఓఎస్ పూర్తిగా జియోఫోన్ నెక్స్ట్ను ఆధారంగా రూపొందించారు. ఈ Pragati OS ఇతర ఫోన్లను సపోర్ట్ చేయకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Meta Smartwatch : ఆపిల్‌కు పోటీగా.. ఫేస్‌బుక్ ఫ్రంట్ కెమెరా స్మార్ట్‌వాచ్.. ఫొటో లీక్!