Google Photos: గూగుల్ ఫొటోస్ ఫ్రీ స్టోరేజ్ గడువు జూన్ 1తో ముగిసినట్లే

కొన్ని నెలల ముందుగా ప్రకటించిన గూగుల్ ఫొటోస్ ఫ్రీ స్టోరేజ్ గడువు రానే వచ్చేసింది. జూన్ 1 నుంచి గూగుల్ అకౌంట్లో 15జీబీకి మించిన స్టోరేజికి డబ్బులు చెల్లించాలని గూగుల్ ముందుగానే చెప్పింది. కొత్తగా వచ్చిన పాలసీ ప్రకారం.. స్టోరేజిలో ఇది తప్పనిసరి.

Google Photos: గూగుల్ ఫొటోస్ ఫ్రీ స్టోరేజ్ గడువు జూన్ 1తో ముగిసినట్లే

Google Photos

Google Photos: కొన్ని నెలల ముందుగా ప్రకటించిన గూగుల్ ఫొటోస్ ఫ్రీ స్టోరేజ్ గడువు రానే వచ్చేసింది. జూన్ 1 నుంచి గూగుల్ అకౌంట్లో 15జీబీకి మించిన స్టోరేజికి డబ్బులు చెల్లించాలని గూగుల్ ముందుగానే చెప్పింది. కొత్తగా వచ్చిన పాలసీ ప్రకారం.. స్టోరేజిలో ఇది తప్పనిసరి.

మీరు ఆల్రెడీ 15జీబీ లిమిట్ దాటిపోతే మాత్రం పెయిడ్ ప్లాన్ ఆప్షన్ ఎంచుకోవాలి. అలా చేయాలంటే మేనేజ్ స్టోరేజి సెక్షన్ లో సెట్టింగ్స్ మార్చుకోవాలి. స్టోరేజ్ మేనేజ్మెంట్ టూల్ లో ఫొటోలు, వీడియోలు, బ్లర్రీగా కనిపిస్తున్న ఫొటోలు, స్క్రీన్ షాట్లు, లార్జ్ వీడియోలు ఉంటే వెంటనే తొలగించింది.

టూల్ యూజర్లు ఫాలో అవ్వండిలా..
* గూగుల్ ఫొటోస్ ఓపెన్ చేయండి.
* లైబ్రరీ సెక్షన్ రైట్ కార్నర్‌లో అకౌంట్ ఐకాన్ పై క్లిక్ చేయండి.
* అకౌంట్ స్టోరేజిలోకి వెళ్లండి.
* మేనేజ్ స్టోరేజ్ సెలక్ట్ చేసుకోండి.
* ఆండ్రాయిడ్ యూజర్లు మెనూపై ట్యాప్ చేసి స్పేస్ ఫ్రీ చేసుకోవచ్చు.
మరో మెథడ్ లోనూ స్టోరేజ్ మేనేజ్ చేసుకోవచ్చు. గూగుల్ వన్ స్టోరేజిలోకి వెళ్లి మేనేజ్ స్టోరేజ్ లేదా ఫ్రీ అప్ అకౌంట్ స్టోరేజి క్లిక్ చేయండి.
* అకౌంట్ స్పేస్ ఫ్రీ చేసి స్పేస్ వెనక్కు తెచ్చుకోండి.
* అక్కడ గూగుల్ డ్రైవ్ లో డిలీట్ అయిన ఫొటోలన్నీ కనిపిస్తాయి.
* గూగుల్ డ్రైవ్ లో డిలీట్ అయిన ఫైల్స్, ఈమెయిల్స్, లార్జ్ సైజ్ అటాచ్మెంట్లు, స్పామ్ మెయిల్స్ మొత్తం క్లియర్ చేస్తే అడిషనల్ స్పేస్ రాబట్టొచ్చు.
* చివర్లో రివ్యూ చేసుకుని డేటా ఫ్రీ చేసుకోవాలి.
ఇక స్టోరేజిని బట్టి పే చేయాలనుకుంటే..
* 100జీబీ: నెలకు రూ.130 లేదా సంవత్సరానికి రూ.1300
* 200జీబీ: నెలకు రూ.210 లేదా సంవత్సరానికి రూ.2100
* 2టీబీ: ఈ ప్లాన్ ప్రకారం.. నెలకు రూ.650 లేదా సంవత్సరానికి రూ.6500