Android 12L: లార్జ్ స్ర్కీన్ డివైజ్‌ల కోసం.. గూగుల్ ఆండ్రాయిడ్ కొత్త ఓఎస్‌

Android 12L : ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ లార్జ్ డిస్‌ప్లే ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ (OS) లాంచ్ చేసింది. కొత్తగా 12 (OS)బీటా వెర్షన్ విడుదల చేసింది.

Android 12L: లార్జ్ స్ర్కీన్ డివైజ్‌ల కోసం.. గూగుల్ ఆండ్రాయిడ్ కొత్త ఓఎస్‌

Google Releases First Android 12l Beta For Large Screen Devices

Android 12L : ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ లార్జ్ డిస్‌ప్లే ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ (OS) లాంచ్ చేసింది. కొత్తగా ఆండ్రాయిడ్ 12 (OS)బీటా వెర్షన్ తీసుకొచ్చింది. స్మార్ట్ ఫోన్లలో అట్రాక్టివ్ ఫీచర్లతో యూఆర్ఎల్ షేరింగ్ (URL Sharing) , వన్ హ్యాండ్ మోడ్ (One Hand Mode), టేక్‌ మోర్‌ బటన్‌ (Take More Button), కొత్త గేమింగ్ మోడ్ (New Gaming Mode) వంటి ఎన్నో ఫీచర్లను గూగుల్ ప్రవేశపెట్టింది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లోకి రిలీజ్ అయిన అన్ని స్మార్ట్‌ఫోన్లు, ఫోల్డింగ్‌ ఫోన్లు, ట్యాబ్‌ డివైజ్‌ల్లో డివైజ్‌లలో అప్‌డేట్‌ చేసింది.

ఫోల్డింగ్‌ ఫోన్‌, ట్యాబ్ యూజర్లు మాత్రం ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కువ రోజులు వాడలేరంటోంది. ప్రత్యేకించి ఈ ఓఎస్‌ను అతిపెద్ద స్ర్కీన్ డివైజ్‌ల్లో, లెనివో ట్యాబ్ P12ప్రో, పిక్సల్ 3A, పిక్సెల్ 5A స్మార్ట్ ఫోన్ల కోసం తీసుకొస్తోంది. పెద్ద స్ర్కీన్ డివైజ్‌ల్లో ట్యాబ్, ఫోల్డింగ్ ఫోన్ల కోసం ఈ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకొస్తోంది. రాబోయే ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ L (లార్జ్ స్ర్కీన్) అనే సింబల్‌తో వస్తోందని టెక్ వర్గాలు పేర్కొన్నాయి. Android 12L OS వచ్చే ఏడాదిలో యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఒక ప్రత్యేకత ఉంది. ఒక యాప్‌ నుంచి మరో యాప్‌కి మారిపోవచ్చు.

డెస్క్‌టాప్‌ కంప్యూటర్‌ తరహాలో ఇందులో కొత్త టాస్క్‌బార్ అందిస్తున్నారు. స్ల్పిట్‌ స్క్రీన్‌ మోడ్‌ ఉన్న సమయంలో కూడా టాస్క్‌బార్‌ ద్వారా యూజర్‌ ఒక యాప్‌ నుంచి మరో యాప్‌కి సింపుల్‌గా మారిపోవచ్చు. నోటిఫికేషన్లు, లాక్ స్క్రీన్‌, హోమ్‌ స్క్రీన్‌, క్విక్ సెట్టింగ్స్‌ లేవుట్లలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఫోల్డబుల్ ఫోన్లలో ప్రత్యేకత ఉంది. రెండు స్క్రీన్స్‌లో ఒకేసారి రెండు వేర్వేరు డాక్యుమెంట్లు ఓపెన్ చేయొచ్చు. సాధారణ యాప్స్‌ పెద్ద స్క్రీన్లకు అనుగుణంగా ఆపరేటింగ్ సిస్టమ్ (OS) కొత్త అప్‌డేట్ రిలీజ్ చేసింది గూగుల్.

Read Also : Whatsapp : వాట్సాప్‍‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఒక్కసారి మాత్రమే చూడొచ్చు..!