Aadhaar Photo : మీ ఆధార్‌కార్డుపై ఫొటోను ఈజీగా మార్చుకోండిలా!

ఆధార్ కార్డులో ఫొటో మార్చుకోవాలని అనుకుంటున్నారా? మీ ఆధార్‌లో ఫొటో చిన్నప్పడిదా? ఎప్పటినుంచో మార్చుకోవాలని అనుకుంటున్నారా? ఇంతకీ ఆధార్‌కార్డుపై ఫొటోను ఎలా మార్చుకోవాలో చూద్దాం..

Aadhaar Photo : మీ ఆధార్‌కార్డుపై ఫొటోను ఈజీగా మార్చుకోండిలా!

How To Change Photograph In Aadhaar Card Online

Photograph In Aadhaar Card Online : ఆధార్ కార్డులో ఫొటో మార్చుకోవాలని అనుకుంటున్నారా? మీ ఆధార్‌లో ఫొటో చిన్నప్పడిదా? ఎప్పటినుంచో మార్చుకోవాలని అనుకుంటున్నారా? ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు పొందాలన్నా.. ఎలాంటి అవసరాలకైనా ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. ఎప్పుడిదో పాత ఫొటో ఉంటే.. కొన్నేళ్ల తర్వాత గుర్తుపట్టలేనంతగా మారిపోవచ్చు.

అప్పుడు ఈ ఆధార్ మీదానే అనే సందేహం వ్యక్తమవుతుంది. అప్పటి ఫొటోను ఇప్పుడు పోల్చుకోవడం ఇబ్బందిగా ఉందా? ఇలాంటి సమస్య ఎదురుకాకుండా ఉండాలంటే.. వెంటనే ఈ ఆధార్ కార్డుపై ఫొటోను మార్చేసుకోండి.. ఇంతకీ ఆధార్‌కార్డుపై ఫొటోను ఎలా మార్చుకోవాలో చూద్దాం..

– ఆధార్‌కార్డుపై ఫొటోను మార్చుకోవాలంటే uidai.gov.in వెబ్‌సైట్‌ విజిట్ చేయండి.
– వెబ్‌సైట్ నుంచి ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఫామ్‌ను డౌన్‌లోడ్ చేయండి.
– ఫామ్‌ స‌మీపంలోని ఆధార్ న‌మోదు సెంటర్‌లో స‌మ‌ర్పించాలి.
– రుసుము చెల్లిస్తే.. ఆధార్ సెంటర్‌లోని మీ ఫొటోను ఆధార్‌కార్డుపై అప్‌లోడ్ చేస్తారు.
– ఫొటోను మార్చేసిన తర్వాత ఎనాల్డెజ్ స్లిప్ పొందవచ్చు.
– దానిపై ఒక నంబ‌ర్ ఉంటుంది.
– మీ ఆధార్‌కార్డుపై ఫొటో అప్‌డేట్ చేసుకోండి.
– ఆధార్‌కార్డుపై ఫొటో అప్‌డేట్ వెరిఫై చేసుకోండి.
– వెరిఫై అయ్యాక కొత్త ఆధార్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకోండి..