WhatsApp Messages : ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కు మీ వాట్సాప్ మెసేజ్‌లను రీసెట్ చేయకుండానే ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలో తెలుసా?

WhatsApp Messages : మీరు ఆండ్రాయిడ్ (Android) నుంచి ఐఫోన్ (iPhone)కి మారిపోతున్నారా? ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కి మారే యూజర్లు తమ వాట్సాప్ డేటా విషయంలో ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు.

WhatsApp Messages : ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కు మీ వాట్సాప్ మెసేజ్‌లను రీసెట్ చేయకుండానే ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలో తెలుసా?

How to Transfer WhatsApp Messages From Android to iPhone Without Factory Reset

WhatsApp Messages : మీరు ఆండ్రాయిడ్ (Android) నుంచి ఐఫోన్ (iPhone)కి మారిపోతున్నారా? ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కి మారే యూజర్లు తమ వాట్సాప్ డేటా విషయంలో ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు. అందులో చాలా మంది యూజర్లు WhatsApp మెసేజ్‌లు, గ్రూపు చాట్ డేటాను ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలో తెలియక సతమతమవుతుంటారు. ఒకవేళ వాట్సాప్ డేటాను ట్రాన్స్‌ఫర్ చేయాల్సి వస్తే.. ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేయకుండానే WhatsApp మెసేజ్‌లను ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

iOSకు ఆండ్రాయిడ్ డేటా ట్రాన్స్‌ఫర్ చేయలేమా? :
ఆండ్రాయిడ్ (Android) నుంచి iPhoneకి WhatsApp మెసేజ్‌లను ఎలా ట్రాన్స్‌ఫర్ చేయడంలో సాయపడే అధికారిక మార్గాలలో ఈ యాప్ ఒకటి. కానీ, యూజర్లు ఈ ఆప్షన్ ఉపయోగించకుండా ఉంటారు. ఎందుకంటే దీనికి ‘iOSకు ట్రాన్స్‌ఫర్’ యాప్‌ని ఉపయోగించే ముందు iPhone ఫ్యాక్టరీ రీసెట్ అవసరమనే విషయాన్ని తప్పక గుర్తించుకోవాలి.

కొంతమంది యూజర్లు అసంపూర్తిగా లేదా కోల్పోయిన డేటా ట్రాన్స్‌ఫర్ సమస్యలను కూడా నివేదించారు. లాంగ్ చాట్‌లు, పెద్ద డేటాను ట్రాన్స్‌ఫర్ చేయడంలో తక్కువ సక్సెస్ రేటు ఉంది. 30 నిమిషాల కన్నా ఎక్కువ సమయం తీసుకున్నప్పుడు.. ఈ స్క్రీన్ నిలిచిపోతుంది. అప్పుడు డివైజ్ రీస్టార్ట్ అవుతుంది. యాప్ విషయానికి వస్తే.. యూజర్ల నుంచి బ్యాడ్ యాప్ రేటింగ్‌లు, రివ్యూలు ఉంటాయి. ఈ సమస్యను ఫిక్స్ చేసేందుకు మరో ప్రత్యామ్నాయం ఉంది.

ఫ్యాక్టరీ రీసెట్ లేకుండా WhatsApp మెసేజ్‌లను Android నుంచి iPhoneకి ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. AnyTransని ఉపయోగించడం ద్వారా వాట్సాప్ మెసేజ్‌లను ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కి ట్రాన్స్‌ఫర్ చేయడం కష్టంగా ఉండదు. అప్పుడు AnyTrans అనే యాప్ అందుబాటులో ఉంటుది. ఈ సర్కిల్ డేటా ట్రాన్స్‌ఫర్, బ్యాకప్ టూల్ కూడా అందిస్తుంది. మీ ఐఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ లేకుండా డేటాను ట్రాన్స్‌ఫర్ చేసేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. ఐఫోన్ సెటప్ చేశారా? లేదా అనే దానితో సంబంధం లేకుండా వర్క్ అవుతుంది.

How to Transfer WhatsApp Messages From Android to iPhone Without Factory Reset

How to Transfer WhatsApp Messages From Android to iPhone Without Factory Reset

Read Also : WhatsApp Old Phones : వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. ఫిబ్రవరి 1 నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి.. ఫుల్ లిస్ట్ మీకోసం..!

డేటా ట్రాన్స్‌ఫర్ సమయంలో, AnyTrans ఆండ్రాయిడ్, ఐఫోన్‌లోని WhatsApp మెసేజ్‌లను ఒక థ్రెడ్‌లో మెర్జ్ చేయొచ్చు. తద్వారా వాట్సాప్ యూజర్లు ఎక్కడ ఆపివేసిన చోటనే కొనసాగించవచ్చు. ఈ మొత్తం ప్రక్రియ చాలా సులభంగానూ, ఎంతో వేగవంతంగా ఉంటుంది. WhatsApp మెసేజ్‌లను నేరుగా Android నుంచి iPhoneకి ట్రాన్స్‌ఫర్ చేయడంతో పాటు AnyTrans WhatsApp బ్యాకప్‌ను Google Drive నుంచి iPhoneకి రీస్టోర్ చేయొచ్చు. బెస్ట్ పార్ట్ ఏమిటో మీకు తెలుసా? iOS 5, అంతకంటే ఆపై రన్ అయ్యే అన్ని iPhone మోడల్‌లకు సపోర్టు ఇస్తుంది.

WhatsApp మెసేజ్‌లను ట్రాన్స్‌ఫర్ చేసేందుకు AnyTrans ఎలా ఉపయోగించాలి?
మీ WhatsApp మెసేజ్‌లను ట్రాన్స్‌ఫర్ చేసేందుకు AnyTransని వినియోగించాలి. ఈ కింది సూచనలను ఫాలో అవ్వండి.
* మీ కంప్యూటర్‌లో AnyTrans ని డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయండి > USB కేబుల్‌ల ద్వారా మీ Android, iPhoneని కంప్యూటర్‌కు కనెక్ట్ చేయండి > ఈ డివైజ్ ద్వారా WhatsAppని ఎంచుకోండి > ఇప్పుడే Transfer చేయండి.
* మీ Android ఫోన్‌ని మీ ఐఫోన్‌ను లక్ష్య ఫోన్‌గా ఎంచుకోండి> కొనసాగడానికి ‘Next’ బటన్‌పై Click చేయండి.
మీ WhatsApp డేటాను బ్యాకప్ చేసేందుకు Settings> Chats > Chat Backupకు వెళ్లి , Google డిస్క్‌లో కాకుండా మీ Android డివైజ్‌లో చేయండి.

How to Transfer WhatsApp Messages From Android to iPhone Without Factory Reset

How to Transfer WhatsApp Messages From Android to iPhone Without Factory Reset

బ్యాకప్ పూర్తయిన తర్వాత పాత డివైజ్ అన్‌ఇన్‌స్టాల్ చేసి, మీ Android ఫోన్‌లో WhatsApp కొత్త వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేయండి.
Settings> App Data > WhatsApp > Allow > స్టోరేజ్‌కి వెళ్లి WhatsAppలో ఫోన్ స్టోరేజ్‌కి యాక్సెస్‌ను అనుమతించండి.
ఇన్‌స్టాలేషన్ పూర్తయిన తర్వాత, లాగిన్ చేసి, ‘Restre’ ఆప్షన్ ఎంచుకోండి.
మీరు ఇటీవల అప్‌డేట్ చేసిన వాట్సాప్‌కి చేసిన బ్యాకప్‌ని రీస్టోర్ చేస్తుంది. ఆ తర్వాత AnyTransలో ‘Next’ Click చేయండి.
AnyTrans WhatsApp మెసేజ్‌లను Android నుంచి iPhoneకి ట్రాన్స్‌ఫర్ చేస్తుంది.
మీ డేటా సైజును బట్టి సమయం మారుతుంది. ప్రాసెస్ పూర్తయిన తర్వాత మీకు నోటిఫికేషన్ వస్తుంది.

How to Transfer WhatsApp Messages From Android to iPhone Without Factory Reset

How to Transfer WhatsApp Messages From Android to iPhone Without Factory Reset

AnyTrans కేవలం WhatsApp మెసేజ్‌లను తరలించడానికి మాత్రమే టూల్ కాదు. AnyTrans కేవలం WhatsApp మెసేజ్‌ల ట్రాన్స్‌ఫర్ మాత్రమే పరిమితం కాలేదు. మీరు ఈ టూల్ సాయంతో ఫొటోలు, కాంటాక్టులు, కాల్ లాగ్‌లు మొదలైన వాటితో సహా ఇతర డేటాను కూడా ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. iOSకి ట్రాన్స్‌ఫర్ యాప్ కన్నా మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. AnyTrans అనేది డేటా మైగ్రేషన్ కోసం మాత్రమే వాడే టూల్ కాదు. అనేక ఇతర అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది.

ఐఫోన్ మేనేజర్ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే యూజర్లకు అనేక అంశాలలో టైమ్ ఆదా చేయడంలో సాయపడుతుంది. AnyTrans డేటా బ్యాకప్, కస్టమ్ రింగ్‌టోన్‌లు, యాప్‌ మానేజ్‌మెంట్, స్క్రీన్ మిర్రరింగ్ మొదలైనవాటికి సాయపడుతుంది. ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కు మారుతున్న ఎవరైనా, AnyTrans చాలా ఈజీగా ఉంటుంది. పూర్తిగా iOSలోకి ప్రవేశించే ముందు ఏదైనా సమస్యలను ఫిక్స్ చేసేందుకు యూజర్లకు సాయపడుతుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Samsung Galaxy S23 Series : శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ వచ్చేస్తోంది.. మూడు కొత్త ఫోన్లు ఇవేనా? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?