Samsung Galaxy S23 Series : శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ వచ్చేస్తోంది.. మూడు కొత్త ఫోన్లు ఇవేనా? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Samsung Galaxy S23 Series : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) నుంచి కొత్త S23 సిరీస్ వచ్చేస్తోంది. Galaxy Unpacked ఈవెంట్‌లో ఫిబ్రవరి 1న (ఈరోజు) రాత్రి 11:30 గంటలకు IST లాంచ్ కానుంది.

Samsung Galaxy S23 Series : శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ వచ్చేస్తోంది.. మూడు కొత్త ఫోన్లు ఇవేనా? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Samsung Galaxy S23, S23 Plus and S23 Ultra launching today _ expected specs and price

Samsung Galaxy S23 Series : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) నుంచి కొత్త S23 సిరీస్ వచ్చేస్తోంది. Galaxy Unpacked ఈవెంట్‌లో ఫిబ్రవరి 1న (ఈరోజు) రాత్రి 11:30 గంటలకు IST లాంచ్ కానుంది. ఈ ఈవెంట్ సందర్భంగా దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ తయారీదారు గెలాక్సీ S23 సిరీస్ కింద మూడు కొత్త ఫోన్‌లను రిలీజ్ చేయనుంది. లీక్‌ల ప్రకారం.. ఈ రాత్రి జరిగే ఈవెంట్‌లో శాంసంగ్ కొత్త గెలాక్సీ బుక్ ల్యాప్‌టాప్‌లను కూడా ఆవిష్కరించనుంది. శాంసంగ్ Galaxy అన్‌ప్యాక్డ్ ఈవెంట్ 11:30PM IST నుంచి YouTubeలో లైవ్ టెలిక్యాస్ట్ కానుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు (Samsung India) YouTube ఛానెల్‌ ద్వారా వీక్షించవచ్చు. Galaxy అన్‌ప్యాక్డ్ లైవ్‌స్ట్రీమ్ శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్ లేదా సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో కూడా అందుబాటులో ఉంటుంది.

శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ ఫీచర్లు (అంచనా) :
అధికారిక లాంచ్‌కు ముందు.. శాంసంగ్ స్వయంగా (Samsung Galaxy S23) సిరీస్‌కు సంబంధించి కొన్ని వివరాలను వెల్లడించింది. లైనప్ ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను అందిస్తుందని తెలిపింది. కెమెరా స్పెసిఫికేషన్‌లు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కొన్ని లీక్‌ల ప్రకారం.. లైనప్ టాప్-ఎండ్ మోడల్ లేదా గెలాక్సీ S23 అల్ట్రా కంపెనీ ఇంటర్నల్‌గా డెవలప్ చేసిన 200-MP ISOCELL HP2 సెన్సార్‌తో రానుందని సూచిస్తున్నాయి. హార్డ్‌వేర్ ముందు, మూడు Galaxy S23 ఫోన్‌లు Qualcomm లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్ వెర్షన్ భావిస్తున్నారు.

Samsung Galaxy S23, S23 Plus and S23 Ultra launching today _ expected specs and price

Samsung Galaxy S23 Series : Samsung Galaxy S23, S23 Plus and S23 Ultra launching today

Read Also : Samsung Galaxy S23 Ultra : ఫిబ్రవరి 1న శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే Ultra మోడల్ ధర లీక్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

రాబోయే లైనప్ కింద.. కంపెనీ గెలాక్సీ S23, గెలాక్సీ S23 ప్లస్, గెలాక్సీ S23Ultraతో సహా 3 కొత్త ఫోన్‌లను ఆవిష్కరించనుంది. Samsung Galaxy S23, Galaxy S23 Plus 50-MP ప్రైమరీ కెమెరాతో పాటు 10-MP టెలిఫోటో లెన్స్‌తో f/2.4 ఎపర్చరు, 3x ఆప్టికల్ జూమ్ f/2.2 ఎపర్చరుతో 12-MP అల్ట్రావైడ్ సెన్సార్‌ను అందిస్తాయి. మరోవైపు, గెలాక్సీ S23 అల్ట్రా 200-MP ISOCELL HP2 సెన్సార్‌తో పాటు 12-MP అల్ట్రావైడ్ లెన్స్, రెండు 10-MP టెలిఫోటో కెమెరాలను కలిగి ఉంటుంది. శాంసంగ్ Galaxy S23 సిరీస్‌లో బ్యాటరీ విభాగంలో కూడా రానుందని పుకార్లు సూచిస్తున్నాయి.

Galaxy S23 ఫోన్ 3,900mAh బ్యాటరీతో వస్తుంది. అయితే Galaxy S23 Plus పెద్ద 4,700mAh బ్యాటరీని కలిగి ఉండవచ్చు. ఈ రెండు మోడళ్లు 25W వైర్డు ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తాయని తెలిపింది. శాంసంగ్ గెలాక్సీ S23 Ultra ఫోన్ 45W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌లు వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తాయని అంచనా.

Samsung Galaxy S23, S23 Plus and S23 Ultra launching today _ expected specs and price

Samsung Galaxy S23, S23 Plus and S23 Ultra launching today

భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ S23 ధర ఎంతంటే? :
ధరల విషయానికొస్తే.. శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్‌ను కొంచెం ఎక్కువ ధరలో ఉంటుందని భావిస్తున్నారు. భారత మార్కెట్లో గెలాక్సీ S23 ధర మునుపటి ధర కన్నా దాదాపు రూ. 7వేల కన్నా ఎక్కువగా ఉంటుందని అంచనా. అయితే గెలాక్సీ S23 Plus, గెలాక్సీ S23 Ultra ధర S22 వెర్షన్లతో పోలిస్తే.. రూ. 5వేలు ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. భారత్‌లో Samsung Galaxy S23 ధర రూ. 79,999 ఉండవచ్చు. గెలాక్సీ S23 ప్లస్, Galaxy S23 Ultra వరుసగా రూ. 89,999, రూ. 1,14,999 నుంచి అందుబాటులో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. శాంసంగ్ ధర, స్పెసిఫికేషన్‌లను నిర్ధారించే వరకు వేచి చూడాల్సిందే..

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Samsung Galaxy Book 3 Series : ఫిబ్రవరి 1న శాంసంగ్ గెలాక్సీ బుక్ 3 సిరీస్ ఫ్లాగ్‌షిప్ ల్యాప్‌టాప్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!