iPhone 13 Price Drop : ఐఫోన్ 14 లాంచ్ ఈవెంట్.. ఆపిల్ ఐఫోన్ 13 ధర తగ్గిందోచ్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో చెక్ చేశారా?

iPhone 13 Price Drop : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) ఫార్ అవుట్ ఈవెంట్‌లో iPhone 14 లాంచ్ అవుతోంది. అయితే ఈ ఐఫోన్ 14 లాంచ్‌కు ముందే ఐఫోన్ 13 (iphone 13 Offer) ధర భారీగా తగ్గింది. ఈ-కామర్స్ ప్లాట్ ఫారం దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్ (Flipkart Sale), అమెజాన్‌ (Amazon Sale)లో తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది.

iPhone 13 Price Drop : ఐఫోన్ 14 లాంచ్ ఈవెంట్.. ఆపిల్ ఐఫోన్ 13 ధర తగ్గిందోచ్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో చెక్ చేశారా?

iPhone 13 price drops on Amazon, Flipkart ahead of iPhone 14 launch event

iPhone 13 Price Drop : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) ఫార్ అవుట్ ఈవెంట్‌లో iPhone 14 లాంచ్ అవుతోంది. అయితే ఈ ఐఫోన్ 14 లాంచ్‌కు ముందే ఐఫోన్ 13 (iphone 13 Offer) ధర భారీగా తగ్గింది. ఈ-కామర్స్ ప్లాట్ ఫారం దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్ (Flipkart Sale), అమెజాన్‌ (Amazon Sale)లో తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. iPhone 13 అధికారిక ధర రూ. 79,900 నుంచి ప్రారంభం కానుంది. అయితే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ 128GB మోడల్‌పై ఫ్లాట్ తగ్గింపు ధర రూ. 69,999కి అందిస్తున్నాయి. అంటే.. దాదాపు రూ. 10,000 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తున్నాయి.

iPhone 13 price drops on Amazon, Flipkart ahead of iPhone 14 launch event

iPhone 13 price drops on Amazon, Flipkart ahead of iPhone 14 launch event

అదనంగా, బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు (Exchange Offers) కూడా అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ రెండూ iPhone 13ని (128GB మోడల్) రూ.69,999 ప్రారంభ ధరకు విక్రయిస్తున్నాయి. iPhone 13 (256GB), 512GB స్టోరేజ్ మోడల్‌లు కూడా తగ్గింపు ధరలతో అందుబాటులో ఉన్నాయి. అధికారికంగా.. ఐఫోన్ 13 భారత మార్కెట్లో రూ.79,900 ధరతో ప్రారంభం కానుంది. 265GB, 512GB స్టోరేజ్ మోడల్‌లు వరుసగా రూ. 89,900, రూ. 1,09,900 ధరలతో అందుబాటులోకి రానున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అందించే డీల్‌లో ఏది బెస్ట్ మోడల్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Amazonలో iPhone 13 డిస్కౌంట్ ఆఫర్ :
అమెజాన్‌లో.. ఐఫోన్ 13 (128GB స్టోరేజ్ మోడల్) తగ్గింపు ధర రూ.69,999కి విక్రయిస్తోంది. 256GB, 512GB స్టోరేజ్ మోడల్‌లు వరుసగా రూ. 76,900, రూ. 99,990 వద్ద తగ్గింపు ధరకు అందుబాటులో ఉన్నాయి. దాదాపు రూ. 10,000 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తున్నాయి. అమెజాన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ రూ. 12,559 తగ్గింపును అందిస్తోంది. మీ ఇంట్లో పాత ఐఫోన్ మోడల్‌ ద్వారా తక్కువ ధరకే iPhone 13ని కొనుగోలు చేయవచ్చు.

iPhone 13 price drops on Amazon, Flipkart ahead of iPhone 14 launch event

iPhone 13 price drops on Amazon, Flipkart ahead of iPhone 14 launch event

Flipkartలో iPhone 13 డిస్కౌంట్ ఆఫర్ :
ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఐఫోన్ 13 తగ్గింపు ధర (బేస్ 128GB స్టోరేజ్ మోడల్) రూ.69,999కి విక్రయిస్తోంది. 256GB, 512GB స్టోరేజ్ మోడల్‌లు వరుసగా రూ. 79,900, రూ. 99,999 వద్ద తగ్గింపు ధరలలో అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ మెరుగైన ఆఫర్‌లను అందిస్తోంది. ఫ్లాట్ డిస్కౌంట్‌పై Flipkart HDFC బ్యాంక్ కార్డ్‌ ద్వారా షాపింగ్ చేసే వినియోగదారులకు రూ. 2,000 డిస్కౌంట్ అందిస్తోంది. Flipkart కూడా రూ. 17000 ఎక్స్ఛేంజ్ వాల్యూను అందిస్తోంది.

IDFC FIRST ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై అదనంగా రూ. 1000 డిస్కౌంట్ సహా మరెన్నో బెనిఫిట్స్ అందిస్తోంది. మీరు ఐఫోన్ 13 కొనుగోలు చేయాలనుకుంటే.. ఇదే సరైన సమయం.. వాస్తవానికి, మీరు మరికొద్దిరోజులు ఎదురుచూస్తే.. భారత మార్కెట్లో Apple iPhone 13 సిరీస్ ధరను అధికారికంగా తగ్గించే అవకాశం ఉంది. Amazon, Flipkart వంటి ప్లాట్‌ఫారమ్‌లు iPhone 13 ఫోన్‌ను చాలా తక్కువ ధరకు అందించే అవకాశం ఉంది.

Read Also : iPhone 13 Sale Offer : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ సేల్‌.. భారీగా తగ్గనున్న ఐఫోన్ 13 ధర.. ఎంతవరకు ఉండొచ్చుంటే?