iPhone 13 Sale Offer : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ సేల్‌.. భారీగా తగ్గనున్న ఐఫోన్ 13 ధర.. ఎంతవరకు ఉండొచ్చుంటే?

iPhone 13 Price : ప్రముఖ ఈ-కామర్స్ద్ దిగ్గజాలైన అమెజాన్ (Amazon Festival Sale), ఫ్లిప్‌కార్ట్ (Flipkart Festival Sale) సేల్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఈ వారంలోనే iPhone 14 స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కు కేవలం ఒక రోజు మాత్రమే సమయం ఉంది.

iPhone 13 Sale Offer : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ సేల్‌.. భారీగా తగ్గనున్న ఐఫోన్ 13 ధర.. ఎంతవరకు ఉండొచ్చుంటే?

iPhone 13 price likely to drop under Rs 50,000 during Flipkart and Amazon festive sale

iPhone 13 Price : ప్రముఖ ఈ-కామర్స్ద్ దిగ్గజాలైన అమెజాన్ (Amazon Festival Sale), ఫ్లిప్‌కార్ట్ (Flipkart Festival Sale) సేల్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఈ వారంలోనే iPhone 14 స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కు కేవలం ఒక రోజు మాత్రమే సమయం ఉంది. రాబోయే స్మార్ట్‌ఫోన్‌లో పెద్ద మొత్తంలో ఖర్చు చేయకూడదంటే.. iPhone 13ని చాలా డిస్కౌంట్ రేటుతో పొందవచ్చు. ఎందుకంటే.. ఫ్లిప్‌కార్ట్ (Flipkart), అమెజాన్‌ (Amazon)లో జరగబోయే ఈవెంట్‌ సమయంలో iPhone 13 ధర రూ. 50వేల లోపు ఉంటుందని భావిస్తున్నారు.

ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఈ నెలాఖరులోగా మెగా ఫెస్టివ్ సేల్‌ను నిర్వహించేందుకు రెడీగా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) సెప్టెంబర్ 23న లైవ్ కానుంది. అమెజాన్ సేల్ (Amazon Great Indian Festival Sale) కూడా అదే సమయంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

iPhone 13 price likely to drop under Rs 50,000 during Flipkart and Amazon festive sale

iPhone 13 price likely to drop under Rs 50,000 during Flipkart and Amazon festive sale

ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ 13పై ఈ-కామర్స్ దిగ్గజాలు భారీ తగ్గింపులను ఆఫర్ చేయనున్నాయి. అందుకే ఇప్పుడు అందరి దృష్టి ఐఫోన్ 13 (iPhone 13 Sale)పైనే ఉంది. టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ప్రకారం.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సేల్ సమయంలో ఐఫోన్ 13 ధర రూ.53,000కి తగ్గనుంది. ఈ-కామర్స్ సైట్‌లలో బ్యాంక్ ఆఫర్‌లతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు కూడా ఉండే అవకాశం ఉంది. అన్ని ఆఫర్‌లు కలిపి సేల్ సమయంలో ధరను రూ.49,000కి తగ్గించవచ్చు. ఈ సమాచారాన్ని అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఇంకా ధృవీకరించలేదు. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఫోన్‌పై భారీ తగ్గింపులను అందించనుంది.

ప్రస్తుతం, ఐఫోన్ 13 ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 69,999గా లిస్టు చేసింది. 128GB వేరియంట్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.79,999 నుంచి తగ్గింది. మీకు (HDFC Credit Card) క్రెడిట్ కార్డ్ ఉంటే.. డివైజ్‌పై రూ. 2000 తగ్గింపు పొందవచ్చు. అంతేకాదు.. మీ పాత డివైజ్ బదులుగా ఫ్లిప్‌కార్ట్ రూ.19,999ల వరకు అందిస్తోంది. కానీ, మీకు రూ.19,000 వస్తుందన్న గ్యారెంటీ లేదు. మీ పాత ఫోన్ ధర ఫోన్ మోడల్, కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు పాత iPhone 11 లేదా iPhone 12 మంచి ధరను పొందే అవకాశం ఉంది.

iPhone 13 price likely to drop under Rs 50,000 during Flipkart and Amazon festive sale

iPhone 13 price likely to drop under Rs 50,000 during Flipkart and Amazon festive sale

iPhone 13: స్పెసిఫికేషన్‌లు ఇవే :
ఐఫోన్ 13 2532×1170 పిక్సెల్‌ల రిజల్యూషన్, 460ppi పిక్సెల్ డెన్సిటీతో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఐఫోన్ 13 A15 బయోనిక్ 5nm హెక్సా-కోర్ ప్రాసెసర్‌తో వచ్చింది. 128GB, 256GB, 512GB సహా 3 స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తుంది. స్మార్ట్‌ఫోన్ బాక్స్ వెలుపల iOS 15లో రన్ అవుతుంది.

ఆప్టిక్స్ పరంగా.. iPhone 13 వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 12MP అల్ట్రా-వైడ్ లెన్స్‌తో పాటు 12MP-ప్రైమరీ కెమెరా ఉంటుంది. ముందు భాగంలో, సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 12-MP లెన్స్ ఉంది. Apple iPhoneల బ్యాటరీ స్పెక్స్‌ను iPhone 13 3240mAh బ్యాటరీతో పాటు 20W వరకు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది.

Read Also : Apple Event of 2022 : ఈ వారంలోనే ఆపిల్ అతిపెద్ద ఈవెంట్.. ఐఫోన్ 14 సహా ఎన్నో విలువైన ప్రొడక్టులు లాంచ్.. ఏమేమి ఉంటాయంటే?