iPhone 14 Discount Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు.. ఇంకా తక్కువ ధరకు పొందాలంటే?

iPhone 14 Discount Sale : ఆపిల్ ఐఫోన్ (iPhone Users) యూజర్లకు గుడ్‌న్యూస్.. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో ఆపిల్ ఐఫోన్ 14 (iPhone 14)పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.11,901 డిస్కౌంట్‌తో ఐఫోన్ 14 సిరీస్ అందుబాటులో ఉంది.

iPhone 14 Discount Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు.. ఇంకా తక్కువ ధరకు పొందాలంటే?

iPhone 14 Discount Sale _ iPhone 14 available with up to Rs 12,000 discount on Flipkart, here is how the deal works

iPhone 14 Discount Sale : ఆపిల్ ఐఫోన్ (iPhone Users) యూజర్లకు గుడ్‌న్యూస్.. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో ఆపిల్ ఐఫోన్ 14 (iPhone 14)పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.11,901 డిస్కౌంట్‌తో ఐఫోన్ 14 సిరీస్ అందుబాటులో ఉంది. దాంతో డివైజ్ ధర రూ. 71,999కి తగ్గింది. బ్యాంకు ఆఫర్లపై మరింత తగ్గింపు ఆఫర్‌ను అందిస్తోంది. ఐఫోన్ 14 సిరీస్ మోడల్ 128GB, 256GB స్టోరేజ్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది. ఐఫోన్ 14 సిరీస్ బ్లాక్, వైట్, రోజ్, రెడ్, బ్లూ కలర్ ఆప్షన్లలో వస్తుంది. HDFC బ్యాంక్ కార్డ్ (క్రెడిట్ లేదా డెబిట్) ఉన్న కస్టమర్‌లు రూ. 4వేల విలువైన ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. లేకపోతే, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ఉన్న కస్టమర్‌లు 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

బ్యాంక్ ఆఫర్లతో వినియోగదారులు ఐఫోన్ 14ని వరుసగా రూ. 67,999 (128GB), రూ. 77,999 (256GB)కి కొనుగోలు చేయవచ్చు. ఎప్పటిలాగే, ఫ్లిప్‌కార్ట్ పాత స్మార్ట్‌ఫోన్‌లపై రూ. 23వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తోంది. కస్టమర్‌లు ఈ వాల్యూను పొందలేరని గమనించాలి. రూ. 2వేల నుంచి రూ. 5వేల మధ్య ఉంటుంది. ఈ డివైజ్ కండిషన్ ఆధారంగా ధర ఉంటుంది.

Read Also : iPhone 14 Emergency SOS : గూగుల్ మ్యాప్స్ పనిచేయక దారితప్పిన జంట.. ఇద్దరు మహిళలను రక్షించిన ఐఫోన్ 14 శాటిలైట్ ఫీచర్..!

సాధారణంగా, ఐఫోన్‌లు, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ల కన్నా అధిక శాతం రీసేల్ వాల్యూను కలిగి ఉంటాయి. ప్రైస్ ట్రాకర్ క్రోమ్ ఎక్స్‌టెన్షన్ (Price Tracker Chrome extension) ద్వారా ఆపిల్ ఐఫోన్ 14 ధర ఎంత ఉండో చెక్ చేసుకోవచ్చు. గత జనవరిలో ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 67వేలకు ఆపిల్ iPhone 14 అందుబాటులో ఉంటుంది. ఇంకా ధర తగ్గాలంటే మరికొంత సమయం పట్టవచ్చు. అప్పటివరకూ ఆగలేమంటే.. మీ పాత ఫోన్‌ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

iPhone 14 Discount Sale _ iPhone 14 available with up to Rs 12,000 discount on Flipkart, here is how the deal works

iPhone 14 Discount Sale _ iPhone 14 available with up to Rs 12,000 discount on Flipkart

iPhone 14 లేదా iPhone 13 ఏది కొనాలి? :
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్ ( Flipkart Big Bachat Dhamaal Sale) సమయంలో ఐఫోన్ 13 కూడా ధర తగ్గింపుతో అందుబాటులో ఉంది. ప్రస్తుతం రూ. 69వేల MRP ధర నుంచి రూ. 62,999కి అందుబాటులో ఉంది. ఐఫోన్ 14 స్పెసిఫికేషన్‌లు, డిజైన్ వారీగా చూస్తే.. iPhone 13 మోడల్, iPhone 14 ఫీచర్లు దాదాపు సమానంగా ఉంటాయి. ఐఫోన్ 14 అడ్వాన్స్‌డ్ కెమెరాలతో వస్తుంది. ఐఫోన్ 13 కూడా అదే కెమెరా ఫీచర్లతో సమానంగా ఉంటుంది. డ్యుయల్ సెన్సార్ సైజుల్లో కూడా రెండు 12-MP కెమెరాలను కలిగి ఉంది.

రెండు ఫోన్‌లు A15 బయోనిక్ చిప్‌సెట్‌తో వచ్చాయి. iPhone 14 కొత్త జనరేషన్ మోడల్ అదనంగా ఒక ఏడాదిలో iOS అప్‌డేట్లను అందిస్తుంది. ఈ సమయంలో, రెండు స్మార్ట్‌ఫోన్‌లు iOS 16 వెర్షన్‌తో రన్ అవుతున్నాయి. అదేవిధంగా, ఐఫోన్ 14లో లేటెస్ట్ iOS 16 వెర్షన్ రన్ అవుతుంది. ఈ ఫోన్ మరింత సమర్థవంతంగా పని చేస్తుంది. ఐఫోన్ 13 మోడల్ తక్కువ బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఇక రెండు ఫోన్‌లు 5G, వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్ అందిస్తాయి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : iPhone 14 Plus Price Cut : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14 ప్లస్‌పై రూ.12వేలు డిస్కౌంట్.. మరెన్నో ఆఫర్లు.. డోంట్ మిస్.. ఇప్పుడే కొనేసుకోండి!