iPhone 14 Specifications : ఐఫోన్ 14 చూసేందుకు ఐఫోన్ 13 మాదిరిగానే ఉంటుంది.. ఆ ఫీచర్ ఒక్కటే పెద్దది.. ఏది బెటర్ అంటే?

iPhone 14 Specifications : ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) సరికొత్త ఐఫోన్ మోడల్స్ (iPhone New Models) గ్లోబల్ మార్కెట్లోకి వచ్చేశాయి. ఆపిల్ ఫార్ ఔట్ ఈవెంట్ (Apple Far Out Event) సందర్భంగా ఐఫోన్ 14 సిరీస్ నాలుగు మోడళ్లను కంపెనీ లాంచ్ చేసింది.

iPhone 14 Specifications : ఐఫోన్ 14 చూసేందుకు ఐఫోన్ 13 మాదిరిగానే ఉంటుంది.. ఆ ఫీచర్ ఒక్కటే పెద్దది.. ఏది బెటర్ అంటే?

iPhone 14 may look like iPhone 13 but features higher RAM

iPhone 14 Specifications : ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) సరికొత్త ఐఫోన్ మోడల్స్ (iPhone New Models) గ్లోబల్ మార్కెట్లోకి వచ్చేశాయి. ఆపిల్ ఫార్ ఔట్ ఈవెంట్ (Apple Far Out Event) సందర్భంగా ఐఫోన్ 14 సిరీస్ నాలుగు మోడళ్లను కంపెనీ లాంచ్ చేసింది. అందులో iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro, iPhone 14 Pro Max వంటి స్మార్ట్ ఫోన్లను లాంచ్ అయ్యాయి. అయితే ఆపిల్ ఇప్పటివరకూ లాంచ్ చేసిన ఏయే ఐఫోన్లలోనూ RAM వివరాలను వెల్లడించలేదు. అయితే అన్ని ఐఫోన్ 14 మోడల్‌లు 6GB ర్యామ్‌తో వచ్చాయని కొత్త నివేదిక ధృవీకరించింది.

గత ఏడాదిలోనూ ఇదే నివేదిక ఐఫోన్ 13 RAM వివరాలను వెల్లడించింది. iPhone 13, iPhone 13 mini ఫీచర్లలో 4GB RAM ఉంటే.. iPhone 13 Pro, iPhone 13 Pro Max 6GB RAMతో వస్తాయని తెలిపింది. ఈ ఏడాదిలో iPhone 14 మోడల్‌లు గత ఏడాదిలో కన్నా 50 శాతం ఎక్కువ RAM కలిగి ఉన్నాయి.

iPhone 14 may look like iPhone 13 but features higher RAM

iPhone 14 may look like iPhone 13 but features higher RAM

Xcode 14 Betaలో iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro, iPhone 14 Pro Max అన్నీ 6GB RAMతో వచ్చాయని నివేదిక తెలిపింది. టియర్‌డౌన్ వీడియోలు పోస్ట్ చేసిన తర్వాత ఖచ్చితమైన RAM వివరాలు వెల్లడించింది. ఐఫోన్ 14 (iPhone 14) 6.1-అంగుళాల లిక్విడ్ రెటినా డిస్‌ప్లేతో వచ్చింది. ఐఫోన్ 14 Plus.. HDRకి సపోర్టుతో పెద్ద 6.7-అంగుళాల స్క్రీన్, 1200 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఐఫోన్ 14 స్టాండర్డ్ వేరియంట్‌లు 5nm ప్రాసెస్‌లో A15 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా వచ్చాయి. గ్రాఫిక్స్, 16-Core NPU 5-Core GPUతో వచ్చాయి.

ఆప్టిక్స్ పరంగా.. iPhone 14 వెనుక భాగంలో డ్యూయల్ 12-MP కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీల కోసం 12-MP కెమెరా ఉంది. ఐఫోన్ 14 బ్యాటరీ స్పెసిఫికేషన్‌లు కంపెనీ వెల్లడించలేదు. ఐఫోన్ మోడల్‌లు పాత మోడల్ కన్నా మెరుగైన బ్యాటరీ పర్ఫార్మెన్స్‌తో అందిస్తాయి. ఐఫోన్ 14 మోడల్‌లు సరికొత్త iOS 16 సాఫ్ట్‌వేర్ అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతాయి. స్మార్ట్‌ఫోన్ 128GB, 256GB, 512GB సహా మూడు వేరియంట్‌లలో వస్తుంది.

iPhone 14 may look like iPhone 13 but features higher RAM

iPhone 14 may look like iPhone 13 but features higher RAM

భారత్‌లో iPhone 14 ధర ఎంతంటే? :
ఐఫోన్ 14 బేస్ 128GB వెర్షన్ ధర రూ.79,900తో వస్తుంది. 256GB, 512GB మోడల్స్ వరుసగా రూ.89,900, రూ.1,09,900. ఐఫోన్ 14 ప్లస్ బేస్ 128GB వేరియంట్ కోసం రూ. 89,990 నుంచి ప్రారంభమవుతుంది. 256GB, 512GB మోడల్స్ వరుసగా రూ.99,900లతో వస్తుంది. రూ.1,19,900. ఐఫోన్ 14, 14 ప్లస్ భారత మార్కెట్లో సెప్టెంబర్ 9 నుంచి ప్రీ-ఆర్డర్‌లకు అందుబాటులో ఉంటాయి. ఐఫోన్ 14 సెప్టెంబర్ 16 నుంచి అమ్మకానికి రానుంది. ప్లస్ మోడల్ అక్టోబర్ 7న ఆపిల్ స్టోర్ అధికారిక స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది.

Read Also : iPhone 14 Series Pre-Order : ఈ సాయంత్రం నుంచే కొత్త ఐఫోన్ 14 సిరీస్ ప్రీ-ఆర్డర్లు.. ఇలా ఆర్డర్ చేసుకోండి.. ఇండియాలో ధరలు ఇవే..!