Jabra Evolve 2 TWS Earbuds : భారత్‌లో నిపుణుల కోసం జాబ్రా ఎవాల్వ్ 2 TWS ఇయర్‌బడ్స్.. ధర ఎంతంటే?
Jabra Evolve 2 TWS earbuds : ఇయర్ బడ్స్ కొనేందుకు ప్రయత్నిస్తున్నారా? జాబ్రా హైబ్రిడ్ (Jabra Hybrid) నుంచి రిమోట్ వర్కింగ్ కోరుకునే నిపుణుల కోసం ఫస్ట్ TWS ఇయర్‌బడ్‌లను లాంచ్ చేసింది.

Jabra Evolve 2 TWS earbuds designed for working professionals launched in India, price set at Rs 39,122
Jabra Evolve 2 TWS earbuds : ఇయర్ బడ్స్ కొనేందుకు ప్రయత్నిస్తున్నారా? జాబ్రా హైబ్రిడ్ (Jabra Hybrid) నుంచి రిమోట్ వర్కింగ్ కోరుకునే నిపుణుల కోసం ఫస్ట్ TWS ఇయర్‌బడ్‌లను లాంచ్ చేసింది. జాబ్రా ఎవాల్వ్ 2 TWS ఇయర్‌బడ్‌లు ఎవాల్వ్ సిరీస్‌కి యాడ్ చేసింది. ఈ కొత్త ఇయర్‌బడ్‌లు మారుమూల ప్రాంతాల నుంచి పనిచేసే యూజర్ల ఏకాగ్రతను మెరుగుపరుస్తాయని కంపెనీ పేర్కొంది. మైక్రోసాఫ్ట్ టీమ్స్, జూమ్‌తో సహా ప్రముఖ వర్చువల్ మీటింగ్ ప్లాట్‌ఫారమ్‌ల కోసం Evolve2 బడ్స్ సర్టిఫికేట్ పొందాయని చెప్పవచ్చు. అంతరాయం కలిగించే శబ్దాన్ని తగ్గించడానికి, స్పష్టమైన కాల్‌లను చేసుకునేందుకు సరికొత్త టెక్నాలజీని ఉపయోగిస్తుందని జాబ్రా తెలిపింది.
Evolve 2 గురించి వైస్ ప్రెసిడెంట్ & మేనేజింగ్ డైరెక్టర్ – సౌత్ ఏషియా మరియు హెడ్ – పబ్లిక్ సెక్టార్ (APAC) పీటర్ జయశీలన్ మాట్లాడుతూ.. ప్రపంచంలో, వివిధ ప్రాంతాల నుంచి నిపుణులకు టైమ్ జోన్‌ల ప్రకారమే కనెక్ట్ కావచ్చునని తెలిపారు. హైబ్రిడ్ వర్కింగ్‌తో ఉద్యోగులు సౌకర్యవంతంగా ఉంటారు. కరోనా మహమ్మారికి ముందు ఉన్నదానికంటే చాలా సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. సరికొత్త ఆఫర్, జాబ్రా ఎవాల్వ్ 2 బడ్స్‌ని రిలీజ్ చేసింది. ట్రావెల్ చేసే సమయంలో చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
ధర ఎంతంటే? :
జాబ్రా ఎవాల్వ్ 2 బడ్స్ భారత మార్కెట్లో రూ. 39,122 వద్ద లాంచ్ అయ్యాయి. ఈ డివైజ్ నవంబర్ చివరి నుంచి అన్ని జబ్రా రిటైలర్ల వద్ద అందుబాటులో ఉంటుంది. ఇయర్‌బడ్‌లు క్లాసిక్ బ్లాక్ కలర్‌లో లాంచ్ అయ్యాయి.

Jabra Evolve 2 TWS earbuds designed for working professionals launched in India
TWS ఇయర్‌బడ్స్: స్పెసిఫికేషన్‌లు ఇవే :
జబ్రా ఎవాల్వ్ 2 మల్టీసెన్సర్ వాయిస్ టెక్నాలజీతో వస్తుంది. శబ్దాన్ని నిరోధించడానికి మల్టీ మైక్‌లు, జాబ్రా అల్గారిథమ్ ద్వారా కాల్ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇయర్‌బడ్‌లను ఒకే సమయంలో రెండు వేర్వేరు డివైజ్‌లకు కనెక్ట్ చేయవచ్చు. మల్టీ-పాయింట్ కనెక్షన్ ఫీచర్ పొందవచ్చు. జాబ్రా ఎవాల్వ్ 2లో అడ్జస్టబుల్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) టెక్నాలజీ కూడా ఉంది.
సౌండ్ ప్రాధాన్యతలకు అనుగుణంగా ANCని కేటగిరీ చేసేందుకు ఏదైనా బాహ్య శబ్దాలను నిరోధించవచ్చు. జాబ్రా ఎవాల్వ్ 2 మీ PCకి ప్లగ్ ఇన్-కేస్ డాంగిల్‌ను కూడా కలిగి ఉంది. 20 మీటర్లు/65 అడుగుల వైర్‌లెస్ పరిధిని కలిగి ఉంది. వైడ్ వైర్‌లెస్ రేంజ్‌తో, Evolve2 బడ్స్ కాల్ క్వాలిటీతో రాజీ పడకుండా నిపుణులు హైబ్రిడ్/రిమోట్ వర్క్ ఎన్విరాన్‌మెంట్‌లో పనిచేయవచ్చు.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..