Jio 5G services: రేపు మోదీ చేతుల మీదుగా 5జీ లాంచ్.. అసలైన 5జీ అందిస్తామన్న జియో

 భారత ప్రధాని నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ)లో ఆవిష్కరించబోయే 5జీ కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో జియో పలు వివరాలు తెలిపింది. వినియోగదారులకు అసలైన 5జీ (True 5G) అందిస్తామని తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని పేర్కొంది. జియో 5జీ స్టాండ్.. అలోన్ 5జీ నెట్వర్క్ గా ఉండనుంది. ప్రస్తుతం ప్రపంచంలో లభ్యమవుతున్న ఎన్నో నెట్వర్క్ లు ఈ తరహావి కాదు. చాలా మంది ఆపరేటర్లు నాన్-స్టాండ్ అలోన్ నెట్వర్క్ పైనే ఆధారపడుతున్నారు. ఈ నాన్-స్టాండ్ అలోన్ నెట్వర్క్ అనేది ప్రాథమికంగా ఇప్పటికే ఉన్న 4జీ నెట్వర్క్ నుంచే 5జి రేడియో సిగ్నల్స్ ప్రసారం చేస్తుంది.

Jio 5G services: రేపు మోదీ చేతుల మీదుగా 5జీ లాంచ్.. అసలైన 5జీ అందిస్తామన్న జియో

Jio 5G services

Jio 5G services: భారత ప్రధాని నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ)లో ఆవిష్కరించబోయే 5జీ కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో జియో పలు వివరాలు తెలిపింది. వినియోగదారులకు అసలైన 5జీ (True 5G) అందిస్తామని తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని పేర్కొంది. జియో 5జీ స్టాండ్.. అలోన్ 5జీ నెట్వర్క్ గా ఉండనుంది. ప్రస్తుతం ప్రపంచంలో లభ్యమవుతున్న ఎన్నో నెట్వర్క్ లు ఈ తరహావి కాదు. చాలా మంది ఆపరేటర్లు నాన్-స్టాండ్ అలోన్ నెట్వర్క్ పైనే ఆధారపడుతున్నారు. ఈ నాన్-స్టాండ్ అలోన్ నెట్వర్క్ అనేది ప్రాథమికంగా ఇప్పటికే ఉన్న 4జీ నెట్వర్క్ నుంచే 5జి రేడియో సిగ్నల్స్ ప్రసారం చేస్తుంది.

ఈ విధానం వినియోగదారులకు మెరుగైన పనితీరును అందించకపోవచ్చు. జియో 5జీ నెట్వర్క్ ను మాత్రం స్టాండ్ అలోన్ నెట్వర్క్ అంటారు. ఎందుకంటే అది 5జీ అందించేందుకు తన 4జీ నెట్ వర్క్ పై ఆధారపడదు. అసలైన 5జీ నెట్ వర్క్ శక్తిమంతమైన సేవలను అందిస్తుంది. లో లాటెన్సీ వద్ద చక్కటి పనితీరును అందిస్తుంది. భారీస్థాయి మెషిన్-టు-మెషిన్ కమ్యూనికేషన్ కు అనువైంది. 5జీ వాయిస్, ఎడ్జ్ కంప్యూటింగ్, నెట్ వర్క్ స్లైసింగ్, మెటావర్స్, ఇంకా మరెన్నింటినో అందిస్తుంది.

వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో ఎన్నో లెక్కలు వేసుకుంటూ జియో తన ‘అసలైన 5జీ’కి రూప కల్పన చేసిందని ఆ కంపెనీ పేర్కొంది. 5జీకి అవసరమైన అతిపెద్ద, అత్యంత సముచిత సమ్మేళనంగా వైర్లెస్ స్పెక్ట్రమ్ పొందడంతోనే ఇది ప్రారంభమైంది. జియో సంస్థ 5జీ స్పెక్ట్రమ్ ను 3,500 MHz మిడ్ బ్యాండ్ విభాగంలో పొందింది. ప్రపంచవ్యాప్తంగా 5జీ కోసం కేటాయించేది దీన్నే. ఇక అల్ట్రా హై కెపాసిటీ కోసం 26 GHz మిల్లీమీటర్–వేవ్ బ్యాండ్ ను పొందింది. అయితే, జియో 5జీ ‘అసలైన 5జీ’ నెట్ వర్క్ గా మారడం వెనుక 700 MHz లో-బ్యాండ్ స్పెక్ట్రమ్ పాత్ర కూడా ఉంది. ఇన్ డోర్ లో కవరేజ్ బాగా ఉండేందుకు ఇది అత్యంత అవసరం.

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఇటీవల వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో మాట్లాడుతూ.. ‘‘స్టాండ్–అలోన్ 5జీ ఆర్కిటెక్చర్, అతిపెద్ద, అత్యుత్తమ స్పెక్ట్రమ్ సమ్మేళనం, క్యారియర్ అగ్రిగేషన్. వీటితో ఇది కవరేజ్, కెపాసిటీ, క్వాలిటీ, అందుబాటు ధరల తిరుగులేని సేవలను అందించనుంది’’ అని అన్నారు. వాటాదారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… జియో 5జీ ప్రపంచపు అతిపెద్ద, అత్యంత అధునాతన 5జీ నెట్ వర్క్ కానుందని అన్నారు. ఈ సంస్థ 5జీ తాజా వెర్షన్ అయిన స్టాండ్ అలోన్ 5జీని ఉపయోగించనుందని చెప్పారు. అంటే, 5జీ సేవలు అందించేందుకు గాను తన 4జజీ నెట్ వర్క్ పై ఏమాత్రం ఆధారపడదని వివరించారు.

జియో ప్రత్యర్థి సంస్థలు మాత్రం నాన్-స్టాండ్ అలోన్ 5జీ వైపు చూస్తున్నాయి. అవి అలా చూడడం అంటే, 5జీని నామమాత్రంగా అందించడమే అవుతుంది. 700 MHz బ్యాండ్ లో ఖరీదైన స్పెక్ట్రమ్ ను పొందిన క్యారియర్ జియో ఒక్కటే. దీన్ని పొందేందుకు గాను ఈ ఏడాది మొదట్లో జరిగిన వేలంలో ఇది సుమారుగా రూ.40,000 కోట్లను వెచ్చించింది. లో–ఫ్రీక్వెన్సీ కారణంగా 700 MHz బ్యాండ్ మెరుగైన నెట్ వర్క్ కవరేజ్ ను అందిస్తుంది. అంతేగాకుండా భవనాల్లోకి సమర్థంగా చొచ్చుకుపోయే సామర్థ్యం కూడా వీటికి ఉంది. జనసాంద్రత అధికంగా ఉండే ఢిల్లీ, ముంబై, కోల్ కతా, హైదరాబాద్ వంటి నగర ప్రాంతాల్లో ఇది మెరుగైన, నిలకడతో కూడిన, వేగవంతమైన కనెక్టివిటీని అందించగలదని నిపుణులు అంటున్నారు.

దేశవ్యాప్తంగా 700 MHz బ్యాండ్ ను పొందడం ద్వారా హై ఎండ్ యూజర్లను తన నెట్ వర్క్ లోకి ఆకర్షించి వారికి జియో సిమ్ ను ప్రైమరీ సిమ్ గా చేయడాన్ని జియో తన లక్ష్యంగా చేసుకుంది. ఇళ్లు, భవనాల లోపలి భాగాల్లో మెరుగైన వాయిస్ కాల్ క్వాలిటీ, విలక్షణ 5జీ సేవలు అనేవి హై యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ఏఆర్పీయు)లకు ప్రధాన ఆకర్షణ కానున్నాయి. 700 MHz బ్యాండ్ లో బ్రాడ్ బ్యాండ్ సేవలు అందించడానికి అయ్యే ఖర్చు కూడా తక్కువే. జియో దీపావళి నాటికి మెట్రో నగరాలు సహా ముఖ్యమైన నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించనుంది. ఆ తరువాత దశలవారీగా విస్తరణలతో 2023 డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 5జీని అందుబాటులోకి తీసుకురానుంది. జియో 5జీ కోసం రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు జియో ఇప్పటికే ప్రకటించింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..