Flipkart సేల్: Honor సిరీస్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

సమ్మర్ సేల్ మొదలైంది. ప్రముఖ మొబైల్ తయారీ దిగ్గజాలు కొత్త స్మార్ట్ ఫోన్లతో మార్కెట్లలో సందడి చేస్తున్నాయి. పాపులర్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నారు.

  • Published By: sreehari ,Published On : March 8, 2019 / 12:53 PM IST
Flipkart సేల్: Honor సిరీస్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

సమ్మర్ సేల్ మొదలైంది. ప్రముఖ మొబైల్ తయారీ దిగ్గజాలు కొత్త స్మార్ట్ ఫోన్లతో మార్కెట్లలో సందడి చేస్తున్నాయి. పాపులర్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నారు.

సమ్మర్ సేల్ మొదలైంది. ప్రముఖ మొబైల్ తయారీ దిగ్గజాలు కొత్త స్మార్ట్ ఫోన్లతో మార్కెట్లలో సందడి చేస్తున్నాయి. పాపులర్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నారు. ప్రముఖ మొబైల్ మేకర్ హానర్ కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది. పాపులర్ మోడల్ ఫోన్లపై ధర తగ్గించి డిస్కౌంట్ ధరకే అందిస్తోంది. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ హానర్ సిరీస్ సేల్ కు వేదిక అయింది. హానర్ అందించే మూడు కొత్త సిరీస్ మోడల్స్.. హానర్ 9ఎన్, హానర్ 9 లైట్, హానర్ 7ఏ స్మార్ట్ ఫోన్లపై ఫ్లిప్ కార్ట్ లో డిస్కౌంట్లతో అందుబాటులో ఉన్నాయి.
Also Read : ఇండియాలో ఫస్ట్ స్టేట్ ఇదే : PubG గేమ్ బ్యాన్!

అంతర్జాతీయ ఉమన్స్ డే సందర్భంగా హానర్ తమ కొత్త ఫోన్లపై ఫ్లిప్ కార్ట్ లో డిస్కౌంట్ ధరలతో అందిస్తోంది. మార్చి 7 నుంచి సేల్ ప్రారంభమై మార్చి 8 (ఇదే ఆఖరి రోజు) వరకు డిస్కౌంట్లతో ఆఫర్ చేస్తోంది. ఆసక్తి ఉన్నవారు డిస్కౌంట్ ఆఫర్లతో హానర్ త్రి సిరీస్ ను సొంతం చేసుకోవచ్చు. హానర్ అందించే డిస్కౌంట్ ఆఫర్లలో.. నో కాస్ట్ EMI సదుపాయం ఉంది. బజాజ్ ఫైనాన్స్ ఈఎంఐ నెట్ వర్క్ కార్డుపై నో ఈఎంఐ ఆఫర్ వర్తిస్తుంది. అదనంగా యాక్సస్ బ్యాంకు, హెచ్ డీఎఫ్ సీ, ఐసీఐసీఐ, ఎస్ బీఐ డెబిట్ కార్డుదారులు కూడా ఈఎంఐ బెనిఫెట్స్ పొందొచ్చు. 

హానర్.. ఆఫర్లు-ఫీచర్లు ఇవే.. 
హానర్ 7A : ఈ మోడల్ స్మార్ట్ ఫోన్ తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ పై దీని ధర రూ.7వేల 999 పలుకుతోంది. హానర్ 7ఏ ఫోన్ ఫీచర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ ఫోన్ పై ఒక వేరియంట్ (3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీ) మాత్రమే అందుబాటులో ఉంది. క్వాల్ కామన్ స్నాప్ డ్రాగన్ 430 ప్రాసిసెర్, ఎక్స్ ప్యాండబుల్ స్టోరేజీ 256జీబీ వరకు. డ్యుయల్ 13-మెగా ఫిక్సల్, +2 మెగా ఫిక్సల్ కెమెరా సెట్ అప్, ఫ్రంట్ కెమెరా 8 మెగా ఫిక్సల్ సూటర్ సెల్ఫీ కెమెరా, 5.7 అంగుళాల హెచ్ డీ డిసిప్లే.   
Also Read : ATMకు వెళ్తున్నారా? : కార్డు గికేటప్పుడు జాగ్రత్త!

హానర్ 9 Lite :
ప్రీమియం గ్లాస్ బాడీతో అందిస్తోన్న ఈ మోడల్ ఫోన్ ధర రూ.10వేల లోపే అందిస్తోంది. 2018లో హానర్ 9 లైట్ ఫోన్ ను విడుదల చేసింది. హువావే ఒక్టా కోర్ హిసిలికాన్ కిరిన్ 956 ఎస్ఓసీ టెక్నాలజీతో రూపొందించారు. ఒక వేరియంట్ 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీతో ధర రూ.7వేల 999. మరో వేరియంట్ ఫోన్ 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీతో రూ.10వేల 999 అందుబాటులో ఉంది. రెండు వేరియంట్ల ఫోన్లపై ఒరిజినల్ ధరపై రూ.6వేల వరకు డిస్కౌంట్ తో అందిస్తోంది. 

హానర్ 9 N :
హానర్ సిరీస్ మూడు ఫోన్లలో ఇదే కొత్త మోడల్. 2018లోనే హానర్ 9ఎన్ రిలీజ్ అయింది. న్యూ నాచుడ్ డిసిప్లేతో డిజైన్ చేశారు. ఒక వేరియంట్.. 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీతో ధర రూ. 8వేల 999 ఉండగా, మరో వేరియంట్ 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీతో రూ.9వేల 999 వరకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ లో 16మెగా ఫిక్సల్ సెల్ఫీ కెమెరా, 13 మెగాఫిక్సల్ +2 మెగా ఫిక్సల్ డ్యుయల్ కెమెరా సిస్టమ్, ప్రీమియం 2.5డీ గ్లాస్ బాడీ.  
Also Read : DishTV యూజర్లకు గుడ్ న్యూస్.. అన్‌లిమిటెడ్‌ FTA ఛానల్స్