Moto G Stylus : మోటోరోలా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ వస్తోంది.. ఫీచర్లు లీక్..!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ మేకర్ మోటోరోలా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి రానుంది. భారత్ సహా ఇతర మార్కెట్లోకి Moto G Stylus (2022) సరికొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది.

Moto G Stylus : మోటోరోలా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ వస్తోంది.. ఫీచర్లు లీక్..!

Moto G Stylus (2022) Price In India, Renders, Specifications Leak Online; Tipped To Debut In June 2022

Moto G Stylus  2021 : ప్రముఖ స్మార్ట్ ఫోన్ మేకర్ మోటోరోలా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి రానుంది. భారత్ సహా ఇతర మార్కెట్లోకి Moto G Stylus (2022) సరికొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది. లెనోవో సొంత కంపెనీ అయిన మోటోరోలా నుంచి ఈ కొత్త Moto G Stylus ఫోన్ రానున్నట్టు అధికారికంగా కంపెనీ ధ్రువీకరించింది. కానీ, లాంచ్ ముందే ఈ మోడల్ ఫోన్ ధర, స్పెషిఫికేషన్లు ఆన్‌లైన్లో లీక్ అయ్యాయి.

లీకైన డేటా ప్రకారం.. ఈ మోటీ జీ ఫోన్ హోల్ పంచ్ డిస్‌ప్లే, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ఫ్రింట్ స్కానర్ కూడా ఉంది. LED ఫ్లాష్‌తో పాటు ట్రిపుల్ కెమెరాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. వచ్చే ఏడాది (2022) జూన్ నెలలో ఈ కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది. కొత్త మోడల్ ఫోన్ Moto G Stylus (2021) మోడల్‌కు అడ్వాన్స్ వెర్షన్. Moto G Stylus (2022) స్మార్ట్ ఫోన్ ధర, ఫీచర్లకు సంబంధించి టిప్ స్టర్ లీక్ వివరాలను షేర్ చేసింది.

Moto G Stylus 2022 ధర :
Moto G Stylus (2022) స్మార్ట్ ఫోన్ ధర రూ.38,475గా నిర్ణయించినట్టు తెలుస్తోంది. భారత మార్కెట్లో ధరతో పోలిస్తే.. ఇతర దేశాల మొబైల్ మార్కెట్లలో ధరతో సమానంగా ఉండదని అంచనా. Moto G Stylus (2021) మోడల్ ఈ ఏడాది జనవరిలో మార్కెట్లోకి వచ్చింది. 4GB+128GB స్టోరేజీ వేరియంట్ ప్రారంభ ధర 299 డాలర్లు (రూ.22,000)గా ఉంది.

ఫీచర్లు ఇవే :
మోటో జీ స్టయిలీస్ స్మార్ట్ ఫోన్ లీకైన ఫీచర్ల డేటా ప్రకారం.. హోల్ పంచ్ డిస్‌ప్లే డిజైన్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ఫ్రింట్ స్కానర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ట్రిపుల్ రియర్ కెమెరాలు, LED ఫ్లాష్, రెక్టాంగ్యులర్ షేప్డ్ మాడ్యుల్ (బ్యాక్ సైడ్), మోటోరోలా లోగో కూడా ఉంది. రియర్ కెమెరా 48MP మెయిన్ సెన్సార్ తో వస్తోంది. 6.81 అంగుళాల డిస్ ప్లేతో రానుంది. ఆక్టా కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 480 ప్లస్ చిప్ సెట్, 6GB RAM, 128GB ఆన్ బోర్డ్ స్టోరేజీతో రానుంది. బ్యాటరీ 4,500mAh బ్యాటరీ సామర్థ్యంతో USB Type-C పోర్ట్ (170.3×75.9×9.4mm) కూడా ఉంది.

Read Also : Apple iPhone 13 : ‘మేడ్ ఇన్ ఇండియా’.. ఆపిల్ ఐఫోన్ 13 తయారీ ఇండియాలోనే..!