Ap Polling Percentage : ఏపీలో పెరిగిన పోలింగ్ శాతం.. ఇప్పటివరకు ఎంతంటే..
ఇంకా పలు పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఓటింగ్ పర్సెంటేజ్ రావాల్సి ఉందన్నారు. ఆ తర్వాత పోలింగ్ శాతం ఎంత..

Ap Polling Percentage : ఏపీలో పోలింగ్ ముగిసింది. పలు చోట్ల చిన్న చిన్న ఘటనలు మినహాలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఈసారి భారీ పోలింగ్ నమోదైంది. గతంలో పోలిస్తే ఓటింగ్ శాతం పెరిగింది. ఇప్పటివరకు 75.92 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఇంకా పలు పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఓటింగ్ పర్సెంటేజ్ రావాల్సి ఉందన్నారు. ఆ తర్వాత పోలింగ్ శాతం ఎంత అన్నదానిపై పూర్తి స్పష్టత రానుంది.
ఉదయం నుంచే పోలింగ్ కు అనుకున్న దానికంటే ఎక్కువమంది వచ్చారని అధికారులు తెలిపారు. ఇక ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు బారులు తీరడంతో భారీగా ఓట్లు పోలయ్యాయి.
Also Read : ప్రజలు జగన్‌ను మరోసారి దీవిస్తారు, అందుకు ఇదే నిదర్శనం- కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు