హైద‌రాబాద్‌కు తిరుగుపయనమైన ఓటర్లు.. విజయవాడ హైవేపై వాహనాల రద్దీ

తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లు తిరిగి హైదరాబాద్ కు పయణమయ్యారు. దీంతో విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా వాహన రద్దీ ఏర్పడింది.

హైద‌రాబాద్‌కు తిరుగుపయనమైన ఓటర్లు.. విజయవాడ హైవేపై వాహనాల రద్దీ

Huge Traffic on Vijayawada Highway

Updated On : May 14, 2024 / 10:07 AM IST

Vijayawada Highway Huge Traffic : తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు స్వగ్రామాలకు వెళ్లారు. అయితే, సోమవారం ఓటు హక్కు వినియోగించుకున్న వారు తిరిగి హైదరాబాద్ కు పయణం అవుతున్నారు. దీంతో నిన్న సాయంత్రం నుంచే హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది.

Also Read : Telangana Polling : పెరిగిన పోలింగ్ శాతం.. ఏ పార్టీకి లాభం? ఏ పార్టీకి నష్టం?

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ టోల్ గేట్ ద్వారా సాధారణ రోజుల్లో 30 నుంచి 35వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. సోమవారం తిరుగు పయణంలో 45వేల వాహనాలు వెళ్లినట్లు టోల్ గేట్ సిబ్బంది తెలిపారు. మంగళవారం కూడా జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగనుంది.

Also Read : తెలంగాణలో 64.63శాతం పోలింగ్ నమోదు.. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో అత్యల్పం