తెలంగాణలో 64.63శాతం పోలింగ్ నమోదు.. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో అత్యల్పం
చిన్నచిన్న ఘటనలు మినహా తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 17 పార్లమెంట్ నియోజకవర్గాలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ..

Telangana Election 2024
TS Polling Percentage : చిన్నచిన్న ఘటనలు మినహా తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 17 పార్లమెంట్ నియోజకవర్గాలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. 2019తో పోలిస్తే ఈసారి ఎక్కువే పోలింగ్ శాతం నమోదైంది. 2019లో 62.77 శాతం ఓటింగ్ నమోదైతే ఈసారి 64.93శాతం ఓటింగ్ నమోదైంది. అయితే, పూర్తి ఓటింగ్ శాతాన్ని ఇవాళ ఎలక్షన్ కమిషన్ వెల్లడించనుంది. పలు పార్లమెంట్ సెగ్మెంట్లలో 72శాతం ఓటింగ్ దాటింది. అత్యధికంగా భువనగిరి నియోజకవర్గంలో 76.47శాతం పోలింగ్ జరగగా, హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో అత్యల్పంగా 46.08శాతం పోలింగ్ నమోదైంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవరగ్ంలో 50.34శాతం పోలింగ్ నమోదైంది.
Also Read : Telangana Polling : పెరిగిన పోలింగ్ శాతం.. ఏ పార్టీకి లాభం? ఏ పార్టీకి నష్టం?
తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో జోరుగా ఓటింగ్ జరగ్గా.. రాజధాని పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు మందకొడిగా పోలింగ్ కొనసాగింది. వరుసగా సెలవులు రావడంతో ప్రజలు టూర్లకు ప్లాన్ చేసినట్లు తెలిసింది. కొంత మంది ఇళ్లకే పరిమితం అయ్యారు. హైదరాబాద్ పార్లమెంట్ ఫరిధిలో పోలింగ్ స్టేషన్ లలో రద్దీ పెద్దగా కనిపించలేదు. సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజకవర్గాల్లో 50శాతం కూడా పోలింగ్ నమోదు కాలేదు. మల్కాజిగిరి, చేవెళ్లలో 50శాతం పోలింగ్ దాటింది. అత్యధికంగా భువనగిరి నియోజకవర్గంలో 76.47శాతం పోలింగ్ నమోదుకాగా.. ఖమ్మంలో 75.19శాతం పోలింగ్ నమోదైంది.
తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో సుమారు 64.93 శాతం పోలింగ్..
అదిలాబాద్ -72.96 శాతం
భువనగిరి -76.47 శాతం
చేవెళ్ల -55.45 శాతం
హైదరాబాద్ -46.08 శాతం
కరీంనగర్-72.33 శాతం
ఖమ్మం-75.19 శాతం
మహబూబాబాద్-70.68 శాతం
మహబూబ్ నగర్-71.54 శాతం
మల్కాజిగిరి-50.12 శాతం
మెదక్-74.38 శాతం
నాగర్ కర్నూల్ -68.86 శాతం
నల్గొండ-73.78 శాతం
నిజామాబాద్-71.50 శాతం
పెద్దపల్లి-67.88 శాతం
సికింద్రబాద్-48.11 శాతం
వరంగల్-68.29 శాతం
జహీరాబాద్-74.54 శాతం