Moto G82 5G India : మోటో G82 5G మిడ్ రేంజ్ ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ మేకర్ మోటరోలా Moto G సిరీస్ నుంచి 5G స్మార్ట్ ఫోన్ వచ్చింది. భారత మార్కెట్లో మోటరోలా Moto G82 5G స్మార్ట్ ఫోన్ మంగళవారం లాంచ్ అయింది.

Moto G82 5G India : మోటో G82 5G మిడ్ రేంజ్ ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

Moto G82 5g Launched In India With 10 Bit 120hz Display, Snapdragon 695 Soc Price, Specifications

Moto G82 5G India : ప్రముఖ స్మార్ట్ ఫోన్ మేకర్ మోటరోలా Moto G సిరీస్ నుంచి 5G స్మార్ట్ ఫోన్ వచ్చింది. భారత మార్కెట్లో మోటరోలా Moto G82 5G స్మార్ట్ ఫోన్ మంగళవారం (జూన్ 7) లాంచ్ అయింది. Moto G82 స్మార్ట్‌ఫోన్ రూ. 25,000 లోపు ధరతో అందుబాటులోకి వచ్చింది. బ్యాంక్ ఆఫర్‌లతో ఈ ఫోన్ కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ. 20,000లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ డివైజ్ 10-బిట్ AMOLED డిస్‌ప్లే ప్రైమరీ కెమెరా, OIS సపోర్టుతో కొన్ని సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లతో వచ్చింది.

Moto G82 5G స్పెసిఫికేషన్స్ :
Moto G82 5G స్మార్ట్ ఫోన్.. 6.6-అంగుళాల ఫుల్ HD+ పోలెడ్ డిస్‌ప్లేతో వచ్చింది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్టు కలిగి ఉంది. స్క్రీన్ 10-బిట్ కలర్ సపోర్టు ఇస్తుంది. ఒక బిలియన్ రంగుల వరకు సపోర్టును అందిస్తుంది. ఫ్రంట్ కెమెరా టాప్ సెంటర్‌లో హోల్-పంచ్ కటౌట్ ఉంది. Moto G82 5G Qualcomm Snapdragon 695 SoC రన్ అవుతుంది. గరిష్టంగా 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజీతో వచ్చింది. ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 30W ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. BP బ్యాటరీ ప్యాక్ ఉన్నప్పటికీ.. ఈ ఫోన్ బరువు 173 గ్రాములు, 7.99mm ఉంటుంది.

Moto G82 5g Launched In India With 10 Bit 120hz Display, Snapdragon 695 Soc Price, Specifications (1)

Moto G82 5g Launched In India With 10 Bit 120hz Display, Snapdragon 695 Soc Price, Specifications

ఇక బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. పిల్ ఆకారపు కెమెరా మాడ్యూల్ 50MP ప్రైమరీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. ప్రైమరీ కెమెరా ఫోటోలు, వీడియోల కోసం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)కి సపోర్టు ఇస్తుంది. ప్రధాన కెమెరాతో పాటు, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం.. ఫోన్‌లో 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. Moto G82 భారత మార్కెట్లో 13 5G బ్యాండ్‌లకు సపోర్టుతో వస్తుంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, AI ఫేస్ అన్‌లాక్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 12 పవర్డ్ ఫోన్ MyUX లేయర్ ఉంది. కిందిభాగంలో USB టైప్-C పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉంది. ఇక ఫోన్ బ్లూటూత్ 5.1, WiFi 802.11 a/b/g/n/acకి సపోర్టు ఇస్తుంది.

Moto G82 5G ధర, ఆఫర్లు :
Moto G82 భారత మార్కెట్లో రెండు స్టోరేజీ ఆప్షన్లలో వచ్చింది. బేస్ వేరియంట్ 6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. బేస్ మోడల్ ధర రూ.21,499గా ఉండగా.. 8GB + 128GB స్టోరేజీ ఆప్షన్లతో కూడా వస్తుంది. దీని ధర రూ. 22,999గా నిర్ణయించింది కంపెనీ. SBI క్రెడిట్ కార్డ్‌ కస్టమర్‌లు రూ. 1,500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. బేస్ మోడల్‌ ధర రూ.19,999కే సొంతం చేసుకోవచ్చు. రూ.5,049 విలువైన జియో బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. Moto G82 5Gని ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్ ప్రముఖ రిటైల్ స్టోర్‌ల నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు.

Read Also : Moto G82 5G : రేపే లాంచ్.. ముందే లీకైన మోటో G82 5G ఫోన్ ధర.. ఎంతంటే?