Nokia 3310 : మార్కెట్లోకి వచ్చి 21 ఏళ్లు.. నాటి రోజులు గుర్తుచేసుకుంటున్న నెటిజన్లు

భారతీయ ఫోన్ వినియోగదారులకు నోకియా ఫోన్ల గురించి తెలియకుండా ఉండదు. మొదట్లో దేశ విపణిలో విప్లవం సృష్టించాయి ఈ ఫోన్లు. నోకియాలోని 3310 మోడల్ ఫోన్ మార్కెట్లోకి వచ్చి 21 ఏళ్ళు అయింది.

Nokia 3310 : మార్కెట్లోకి వచ్చి 21 ఏళ్లు.. నాటి రోజులు గుర్తుచేసుకుంటున్న నెటిజన్లు

Nokia 3310

Nokia 3310 : ప్రస్తుతం టచ్ మొబైల్స్ మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. కొత్త కొత్త ఫీచర్లతో కొత్త ఫోన్లు పుట్టుకొస్తున్నాయి. అయితే దేశంలో మొబైల్ ఫోన్స్ వాడటం ప్రారంభమైన సమయంలో నోకియా ఫోన్లనే అధికంగా వాడేవారు. మోటరోలా వంటి దిగ్గజ కంపెనీలు ఉన్నా భారతీయుల మనసంతా నోకియాపైనే ఉండేది. ఆ ఫోన్లు ఇప్పుడు మార్కెట్లో ఉన్నంత చిన్నగా ఉండకపోయిన తొలినాళ్లలో వీటినే అధికంగా ఇష్టపడేవారు. వీటి ధర కూడా అప్పట్లో అధికంగానే ఉండేది. ఇక బ్యాటరీ బ్యాక్ రెండు మూడు రోజులు ఉండేది. నోకియా ఫోన్లలో స్నేక్ గేమ్ ప్రత్యేకమైనది. ఈ గేమ్ ఆడుతూ టైం పాస్ చేసేవారు. ఇక నోకియాలో మొద్దు పీఎస్ అని పిలిచే నోకియా 3310 మొబైల్ మార్కెట్లోకి వచ్చి సెప్టెంబర్ 1 నాటికి 21 ఏళ్ళు పూర్తైంది. మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది.

నోకియా 3310 , 21 ఏళ్ళు పూర్తీ చేసుకున్న సందర్బంగా కెనడియన్-అమెరికన్ నటుడు జోన్ ఎర్లిచ్‌మన్ ట్విట్టర్‌లో ఈ ఫోన్ ఫొటోను పోస్ట్ చేశారు. దాంతో నెటిజన్లు తమ పాత జ్ఞాపకాలు పంచుకుంటూ మైమరిచిపోతున్నారు. 2000లో ఈ రోజున(సెప్టెంబర్ 1న) నోకియా 3310 విడుదలైందని జోన్ ఎర్లిచ్‌మన్ తన పోస్ట్ కి క్యాప్షన్ జోడించారు. ఈ ఫొటో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. నిజానికి ఈ ఫోన్ ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ల వలె సన్నగా ఉండదు. అయినప్పటికీ ఇది చాలామందికి ఫేవరెట్ ఫోన్ గా నిలిచిపోయింది. అప్పట్లో చాలామంది సెలెబ్రెటీలు ఈ ఫోన్ నే అధికంగా వాడేవారు. ఇక నోకియా 3310 తర్వాత మార్కెట్లోకి ఆ కంపెనీ అనేక ఫోన్లను విడుదల చేసింది. విడుదలైన ప్రతి ఫోన్ వినియోగదారులను ఆకర్షించింది. నోకియా 3310 తర్వాత 1100,1200 వంటి వాటిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. అవికూడా విపరీతంగా అమ్ముడయ్యాయి.

ఇక నోకియా స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి చాలా లేట్ గా అడుగులు వేసింది. మొదట విండోస్ ఫోన్స్ ని మాత్రమే మార్కెట్లోకి తెచ్చిన ఈ దిగ్గజ కంపెనీ తర్వాత ఆండ్రాయిడ్ లను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో ఇతర కంపెనీలతో నోకియా ఫోన్లు పోటీపడుతున్నాయి. ఆండ్రాయిడ్ 4, 5 వెర్షన్ ఫోన్లు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి.